త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | ఓజీ డైరెక్ట‌ర్‌కు కాస్ట్‌లీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan | ఓజీ డైరెక్ట‌ర్ సుజీత్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చాడు. రేంజ్ రోవ‌ర్ డిఫెండ‌ర్ కారును బ‌హుమ‌తిగా అందించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

N

Entertainment | Published On Dec 16, 2025, 1.06 pm IST

Pawan Kalyan | ఓజీ డైరెక్ట‌ర్‌కు కాస్ట్‌లీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

పవన్ కళ్యాణ్, సుజీత్

Advertisement

Pawan Kalyan |ఓజీతో త‌న‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్టు ఇచ్చిన డైరెక్ట‌ర్ సుజీత్‌కు(Sujeeth) కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ల‌గ్జ‌రీ కారును బ‌హుమ‌తిగా అందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఓజీ మూవీ (Og Movie) బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మూడు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ సినిమా 2025లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన తెలుగు మూవీగా నిలిచింది. అంతే కాకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది

కోటి రూపాయలపైనే...
ఓజీతో సెన్సేష‌న‌ల్ హిట్ అందించిన డైరెక్ట‌ర్ సుజీత్‌కు లాండ్ రోవ‌ర్ డిఫెండ‌ర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. తానే స్వ‌యంగా కారును సుజీత్‌కు అంద‌జేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో స్టైలిష్ లుక్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపిస్తున్నారు. లాండ్ రోవ‌ర్ డిఫండ‌ర్ హై హెండ్ మోడ‌ల్‌కు చెందిన ఈ కారు ధ‌ర కోటికిపైనే ఉంటుంద‌ని స‌మాచారం.
గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామాగా ఓజీ మూవీ రూపొందింది. ఈ సినిమాలో ఓజ‌స్ గంభీర పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలివేష‌న్లు, హీరోయిజం, ఆయ‌న‌పై చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. బాలీవుడ్ న‌టుడు ఇమ్రాన్ హ‌ష్మీ విల‌న్‌గా న‌టించిన ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహ‌న్ (Priyanka Mohan) హీరోయిన్‌గా క‌నిపించింది. ప్ర‌కాష్ రాజ్‌, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఓజీకి సీక్వెల్ రానున్న‌ట్లు మేక‌ర్స్ క‌న్ఫామ్ చేశారు. ప్ర‌స్తుతం నానితో ఓ సినిమా చేస్తున్నాడు సుజీత్‌. ఈ సినిమా త‌ర్వాత ఓజీ సీక్వెల్ సెట్స్‌పైకి ర ఆనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
మ‌రోవైపు ఓజీ త‌ర్వాత ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌తో వ‌చ్చే ఏడాది వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీలీల‌, రాశీఖ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ప్ర‌మోష‌న్స్‌ను ఇటీవ‌లే మేక‌ర్స్ మొద‌లుపెట్టారు.

Advertisement
Advertisement