Web Series Review | పంచనామా రివ్యూ – యాంకర్ ఉదయభాను ప్రొడ్యూసర్…తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
ప్రేమిస్తే భరత్ హీరోగా నటించిన తెలుగు వెబ్‌సిరీస్ పంచనామా శుక్రవారం జీ5 ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు యాంకర్ ఉదయభాను ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
Entertainment | Published On Sep 11, 2026, 8.19 pm IST
Web Series Review | యాంకర్ ఉదయభాను నిర్మాతగా మారి పంచనామా పేరుతో వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించింది. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో ప్రేమిస్తే ఫేమ్ భరత్ లీడ్ రోల్‌లో నటించాడు. మేథా రెడ్డి, శివాజీరాజా, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌కు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించాడు. శుక్రవారం జీ5 ఓటీటీలో రిలీజైన ఈ తెలుగు వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
జై ఇన్వేస్టిగేషన్
సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఆది అనే యువకుడు హాస్టల్ గదిలో చనిపోతాడు. సాధారణ మరణంగానే పోలీసులు భావిస్తారు. ఆదికి ఓ అన్నయ్య ఉంటాడు. పేరు జై (భరత్). పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే సీఐగా పనిచేస్తాడు. తమ్ముడిది హత్య అని జై అనుమానిస్తాడు. ఎంక్వైరీలో అతడి అనుమానం నిజమని తేలుతుంది. ఆదితో పాటు మరో ముగ్గురిని ఓ సీరియల్ కిల్లర్ చంపాడనే తెలుసుకుంటాడు. ఈ హత్యలకు సంబంధించి జై దగ్గర ఎలాంటి క్లూస్ ఉండవు. అనుమానితులు అతడి కళ్ల ముందే చనిపోతారు. అసలు ఈ హత్యలు ఎవరూ చేస్తున్నారు? చిన్నతనంలో అమ్మనాన్నలకు దూరమైన జైని అక్క దేవకి ఎలా పెంచి పెద్ద చేసింది? దేవకి మరణానికి ఆమె భర్త హరికి (సూర్య శ్రీనివాస్)ఉన్న సంబంధం ఏమిటి? జై ప్రేమించిన ధరణిని (మేథా రెడ్డి) డాక్టర్ పుష్పవతి (రూపలక్ష్మి ) ఎందుకు కిడ్నాప్ చేసింది? మెడికల్ మాఫియాను నడిపిస్తున్న అసలైన సూత్రధారి ఎవరన్నది జై కనిపెట్టాడా? లేదా? అన్నదే ఈ వెబ్‌సిరీస్ కథ.
ఒకే ఫార్మెట్...
ఎలాంటి ఆధారాలు లేకుండా క్రైమ్ జరగడం... తన తెలివితేటలతో హీరో ఆ నేరం చేసిన వారిని కనిపెట్టడం..హీరో వెన్నంటి ఉండే వ్యక్తి విలన్ కావడం...దాదాపు క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ కథలు ఇదే ఫార్మెట్‌లో సాగుతాయి. భాష, హీరోలు మారినా ఈ ఫార్ములా మాత్రం మారదు.
పంచనామా వెబ్‌సిరీస్ కథ కూడా ఇదే. తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉండటం కోసం సెంటిమెంట్‌ను జోడించారు డైరెక్టర్.
క్లినకల్ హ్యూమన్ ట్రయల్స్...
క్లినికల్ హ్యూమన్ ట్రయల్స్ అనే పాయింట్‌తో దర్శకుడు మోహన్ శ్రీవత్స ఈ కథను రాసుకున్నారు. తాము తయారు చేసిన మెడిసిన్స్ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి కొన్ని ఫార్మా కంపెనీలు డబ్బు ఎరగా వేసి సామాన్యులపై ప్రయోగాలు చేస్తుంటాయి. వాటి వల్ల జరిగే అనర్ధాల చుట్టూ కథను అల్లుకున్నారు. ఆర్గాన్స్ ట్రాఫికింగ్ మాఫియా మోసాలను చూపించారు.
ట్విస్ట్‌లు సూపర్...
హీరో తమ్ముడి మర్డర్‌తోనే ఈ వెబ్‌సిరీస్ మొదలవుతుంది. తమ్ముడి చావుకు కారణమైన వారిని పట్టుకొనే క్రమంలో మరొకొన్ని హత్యలకు సంబంధించిన షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడే సన్నివేశాలతో సిరీస్‌ను థ్రిల్లింగ్‌గా నడిపించారు డైరెక్టర్. బ్యాక్ ఆండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో హీరో ఫ్లాష్‌బ్యాక్, ప్రజెంట్‌ను చూపిస్తూ ఆసక్తిని రేకెత్తించారు. హంతకులు ఎవరన్నది రివీలయ్యే ట్విస్ట్‌లు బాగున్నాయి.
ఆరు ఎపిసోడ్స్...
ఆరు ఎపిసోడ్స్‌తో పంచనామా వెబ్‌సిరీస్ రూపొందింది. ఒక్కో ఎపిసోడ్ నిడివి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల లోపే ఉంది. మెయిన్ విలన్ ఎవరన్నది హీరో కనిపెట్టకుండానే సిరీస్‌ను ముగించారు. దాంతో అసంపూర్తిగా సిరీస్ ముగిసిన అనుభూతి కలుగుతుంది.
వన్ మెన్ షో...
పంచనామాకు భరత్ వన్ మెన్ షోగా నిలిచాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. సూర్య శ్రీనివాస్, రూపలక్ష్మి విలనిజం అంత ఎఫెక్టివ్‌గా లేదు. విలన్ పాత్రలకు తగ్గట్లుగా వారి డైలాగ్ డెలివరీ సెట్ కాలేదు.
శివాజీ రాజా పాత్ర నిడివి తక్కువే అయినా ఎమోషనల్ యాక్టింగ్‌తో మెప్పించారు. లవ్‌స్టోరీ కథలో బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తుంది. యాంకర్ ఉదయభాను ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్‌గా మారి ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
పంచనామా తెలుగులో రీసెంట్ టైమ్‌లో వచ్చిన మంచి క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్. భరత్ యాక్టింగ్ కోసం చూడొచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి
- ●Trivikram | తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ హనుమాన్ అంశ్ - ప్రొడ్యూసర్‌గా త్రివిక్రమ్
- ●Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు
- ●Madras Regiment | ఆర్మీ ఆయుధాల చోరీ జరిగిందిలా.. మినిట్ టు మినిట్
- ●TGHRC | ఆ ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు సమర్పించండి: డీజీపీకి టీజీహెచ్ఆర్సీ ఆదేశం
- ●Kayadu Lohar | నాని ప్యారడైజ్ ఈవెంట్ - కయదు మిస్సింగ్

Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి

Trivikram | తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ హనుమాన్ అంశ్ - ప్రొడ్యూసర్‌గా త్రివిక్రమ్

Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు

Madras Regiment | ఆర్మీ ఆయుధాల చోరీ జరిగిందిలా.. మినిట్ టు మినిట్






