త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg Boss | బిగ్‌బాస్‌తో సంపాదించింది ఏం లేదు – ప్రైజ్‌మ‌నీ మొత్తం క‌ట్ చేశారు – ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కామెంట్స్‌

బిగ్‌బాస్‌పై మాజీ విన్న‌ర్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ సంచ‌ల‌న కామెంట్లు చేశాడు. 35 ల‌క్ష‌లు ప్రైజ్‌మ‌నీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించి జీఎస్‌టీ పేరుతో చాలా వ‌ర‌కు నిర్వ‌హ‌కులే వెన‌క్కి తీసుకున్నార‌ని అన్నాడు. గిఫ్ట్‌గా ఇచ్చిన కారు, న‌క్లెస్ కూడా కూడా డ‌బ్బులు తీసుకున్నార‌ని ఆరోపించాడు.

N

Entertainment | Published On Aug 17, 2026, 11.17 am IST

Bigg Boss | బిగ్‌బాస్‌తో సంపాదించింది ఏం లేదు –  ప్రైజ్‌మ‌నీ మొత్తం క‌ట్ చేశారు – ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కామెంట్స్‌
Advertisement

Bigg Boss |  బిగ్‌బాస్‌పై మాజీ విన్న‌ర్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ సంచ‌ల‌న కామెంట్లు చేశాడు.ప్రైజ్‌మ‌నీ పేరుతో మోసం చేశార‌ని అన్నాడు. జీఎస్‌టీల పేరుతో వ‌చ్చిన డ‌బ్బుల‌న్నీ బిగ్‌బాస్ నిర్వ‌హ‌కులే వెన‌క్కి తీసుకున్నార‌ని చెప్పాడు. రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ విన్న‌ర్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన ఫ‌స్ట్ కామ‌న్ మ్యాన్‌గా అవ‌త‌రించాడు. ఈ రియాలిటీ షో కార‌ణంగానే ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌కు సోష‌ల్ మీడియాలో మంచి పాపులారిటీ వ‌చ్చింది.

కారు, న‌క్లెస్‌....

తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బిగ్‌బాస్ త‌న‌ను మోసం చేసిందంటూ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ఆరోపించారు. "విన్న‌ర్‌గా నిలిచిన త‌న‌కు 35 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీ ఇస్తున్న‌ట్లు స్టేజ్‌పై ప్ర‌క‌టించారు. కానీ అందులో నుంచి 40 శాతం జీఎస్‌టీ క‌ట్ చేశారు. కారుతో పాటు మా అమ్మ కోసం ఓ న‌క్లెస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ కారు కోసం ప్రైజ్‌మ‌నీలో నుంచే ఎనిమిదిన్న‌ర ల‌క్ష‌లు తీసుకున్నారు. న‌క్లెస్‌కు జీఎస్‌టీ అంటూ మ‌రో ఐదు ల‌క్ష‌లు వ‌సూలు చేశారు. ఇవ‌న్నీ పోను నాకు మిగిలింది చాలా త‌క్కువే. కారు, న‌క్లెస్ వ‌ద్ద‌ని చెప్పా. కానీ రూల్స్ ప్ర‌కారం తీసుకోవాల్సిందేన‌ని చెప్పి నా ప్రైజ్‌మ‌నీ నుంచి వాటి తాలూకు డ‌బ్బులు క‌ట్ చేశారు" అని ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ అన్నారు.

విమ‌ర్శ‌లు వ‌చ్చాయి....

"బిగ్‌బాస్ ద్వారా గెలిచిన 35 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీ మొత్తాన్ని రైతుల‌కే సాయం చేస్తాన‌ని స్టేజ్‌పై ప్ర‌క‌టించా. కానీ జ‌రిగింది వేరు. రైతు బిడ్డ అనే ట్యాగ్ వాడుకొని ప్రైజ్‌మ‌నీ మొత్తాన్ని ఎవ‌రికి సాయం చేయ‌కుండా నేనే వాడుకున్నాన‌ని చాలా మంది విమ‌ర్శించారు. తెర‌వెనుక ఏం జ‌రిగింది అన్న‌ది ఆడియెన్స్‌కు తెలియ‌దు" అని ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ చెప్పాడు.

కేసు పెట్టారు...

"టైటిల్ విన్న‌ర్‌గా నిలిచిన ఆనందం లేకుండా ఆ త‌ర్వాత నాతో పాటు నా త‌మ్ముడిపై కేసు న‌మోదు అయ్యింది. ఇప్ప‌టికీ ఆ కేసు వ‌ల్ల కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఆ గొడ‌వ‌ల వ‌ల్ల నా కుటుంబం కూడా చాలా బాధ ప‌డింది" అని ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ పేర్కొన్నాడు.

 

Advertisement
Advertisement