త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil OTT | తెలుగులో రిలీజైన త‌మిళ స్పోర్ట్స్ థ్రిల్ల‌ర్ మూవీ – ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

కోలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ బ్లూ స్టార్ తెలుగులో రిలీజైంది. థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలో ఈ స్పోర్ట్స్ థ్రిల్ల‌ర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు పా రంజిత్ నిర్మించిన ఈ సినిమాలో అశోక్ సెల్వ‌న్‌, శంత‌ను భాగ్య‌రాజ్ కీర్తి పాండియ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

N

Entertainment | Published On Sep 10, 2026, 8.52 pm IST

Tamil  OTT | తెలుగులో రిలీజైన త‌మిళ స్పోర్ట్స్ థ్రిల్ల‌ర్ మూవీ – ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

Tamil OTT | కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పా రంజిత్ నిర్మించిన స్పోర్ట్స్ థ్రిల్ల‌ర్ మూవీ బ్లూస్టార్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో అశోక్ సెల్వ‌న్‌, శంత‌ను భాగ్య‌రాజ్‌, కీర్తి పాండియ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఎస్ జ‌య‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

నేరుగా ఓటీటీలో...

త‌మిళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన బ్లూస్టార్ మూవీ తెలుగులోకి వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
క్రికెట్ నేప‌థ్యానికి కుల వివ‌క్ష అనే పాయింట్‌ను జోడించి ఈ మూవీని రూపొందించారు డైరెక్ట‌ర్ జ‌య‌కుమార్‌. అర‌క్కోణం అనే ఊరిలో బ్లూస్టార్‌, ఆల్ఫా క్రికెట్ టీమ్స్ మ‌ధ్య ఎప్పుడూ గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. బ్లూస్టార్ జ‌ట్టు కెప్టెన్ రంజిత్‌తో పాటు మిగిలిన ప్లేయ‌ర్లు త‌క్కువ కులానికి చెందిన వారు కావ‌డంతో అల్ఫా జ‌ట్టు కెప్టెన్ రాజేష్ వారిని ఎగ‌తాళి చేస్తుంటాడు. ఓ గ్రౌండ్ కార‌ణంగా వారి మ‌ధ్య విభేదాలు పెరుగుతాయి. ఎలైట్ అనే కార్పొరేట్ కంపెనీకి చెందిన ఆట‌గాళ్లు రంజిత్‌తో పాటు రాజేష్ అవ‌మానిస్తారు. వారి టీమ్‌లు క్రికెట్ ఆట‌కే ప‌నికిరావ‌ని అంటారు. ఎలైట్ ప్లేయ‌ర్స్ తో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు త‌మ గొడ‌వ‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి రంజిత్‌, రాజేష్ ఎలా ఒక్క‌ట‌య్యారు? ఈ మ్యాచ్‌లో వారు విజ‌యం సాధించారా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

తెలుగు రీమేక్‌...

బ్లూ స్టార్‌లో అశోక్ సెల్వ‌న్‌, శంత‌ను భాగ్య‌రాజ్ యాక్టింగ్‌తో పాటు డైరెక్ట‌ర్ టేకింగ్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ప్ర‌తిభ ఉండి కూడా కుల వివ‌క్ష కార‌ణంగా అవ‌కాశాల‌కు దూర‌మైన వారి వ్య‌థ‌ల‌ను ఈ సినిమాలో ఎమోష‌న‌ల్‌గా ద‌ర్శ‌కుడు చూపించాడు. బ్లూ స్టార్ సినిమాకు గోవింద వ‌సంత మ్యూజిక్ అందించాడు. బ్లూస్టార్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేసే ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు.

 

Advertisement
Advertisement