త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఓటీటీలోకి ధూల్‌పేట పోలీస్ స్టేష‌న్‌

N

Entertainment | Published On Dec 5, 2025, 10.28 am IST

ఓటీటీలోకి ధూల్‌పేట పోలీస్ స్టేష‌న్‌

ఓటీటీ సినిమాలు

Advertisement

ఈ వారం థియేట‌ర్ల‌లో అస‌లు సంద‌డి లేదు. శుక్ర‌వారం రిలీజ్ కావాల్సిన బాల‌కృష్ణ అఖండ 2 మూవీ వాయిదాప‌డింది. కానీ ఓటీటీలో మాత్రం సినిమాల జాత‌ర క‌నిపిస్తోంది. శుక్ర‌వారం ఒక్క‌రోజే 15కుపైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. తెలుగులో సూప‌ర్ హిట్‌గా నిలిచిన ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలు స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశాయి. ఈ వారం ఓటీటీలోకి వ‌చ్చిన సినిమాలు, సిరీస్‌లు ఇవే?
నెట్‌ఫ్లిక్స్
ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ ది గ‌ర్ల్‌ఫ్రెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీకి రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థియేట‌ర్ల‌లో న‌ల‌భై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.
స్టీఫెన్ (త‌మిళం)
జే కెల్లీ (ఇంగ్లీష్‌)
ది న్యూయార్క‌ర్ ఎట్ 100 (ఇంగ్లీష్‌)
ల‌వ్ అండ్ వైన్ (సౌతాఫ్రిక‌న్ మూవీ)
ది ప్రైస్ ఆఫ్ క‌న్ఫేష‌న్ (కొరియ‌న్ వెబ్‌సిరీస్‌)
ది నైట్ మై డాడ్ సేవ్‌డ్ క్రిస్మ‌స్ 2 (ఇంగ్లీష్‌)
జియో హాట్‌స్టార్‌
మ‌ల‌యాళంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న హార‌ర్ మూవీ డైస్‌ ఈరే జియో హాట్ స్టార్‌లో శుక్ర‌వారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్ర‌ణ‌వ్ మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన ఈ మూవీకి రాహుల్ స‌దాశివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.
ఘ‌ర్‌వాలీ పెడ్వాలీ (హిందీ వెబ్‌సిరీస్‌)
బే దున్ తీన్ (మ‌రాఠీ వెబ్‌సిరీస్‌)
ఆహా ఓటీటీ
ధూల్‌పేట్ పోలీస్ స్టేష‌న్ (తెలుగు వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీ)
కుట్ర‌మ్ పురింద‌వ‌న్ - (త‌మిళ వెబ్‌సిరీస్ - సోనీలివ్ ఓటీటీ)
అమెజాన్ ప్రైమ్ వీడియో
సుధీర్ బాబు హీరోగా న‌టించిన హార‌ర్ మూవీ జ‌టాధ‌ర అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. వెంక‌ట క‌ళ్యాణ్‌, అభిషేక్ జైస్వాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్క‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు.
అర‌స‌య్య‌న ప్రేమ ప‌సంగ ( స‌న్ నెక్స్ట్ ఓటీటీ - క‌న్న‌డ మూవీ)
ఖుదీరాం బోస్ (వేవ్స్ టీవీ)
డియాబ్లో (ఇంగ్లీష్ - అమెజాన్ ప్రైమ్ వీడియో)
డిస్ ఈరే, కుట్ర‌మ్ పురింద‌వ‌న్‌, స్టీఫెన్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు తెలుగు వెర్ష‌న్‌లో అందుబాటులోకి వ‌చ్చాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement