త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Netflix | నెట్‌ఫ్లిక్స్ థియేటర్లు వస్తున్నాయి…ఓటీటీ ప్లాట్‌ఫామ్ న‌యా బిజినెస్ ప్లాన్‌

ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ థియేట‌ర్ బిజినెస్‌లోకి ఎంట‌ర‌వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధాన న‌గ‌రాల‌తో పాటు స్మాల్ టౌన్స్‌లో థియేట‌ర్ల‌ను నిర్మించాల‌నే ఆలోచ‌న‌లో నెట్‌ఫ్లిక్స్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోకి కూడా నెట్‌ఫ్లిక్స్ ప్ర‌వేశించ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

N

Entertainment | Published On Apr 6, 2026, 5.54 pm IST

Netflix |    నెట్‌ఫ్లిక్స్ థియేటర్లు వస్తున్నాయి…ఓటీటీ ప్లాట్‌ఫామ్ న‌యా బిజినెస్ ప్లాన్‌
Advertisement

Netflix |  ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ థియేట‌ర్ బిజినెస్‌లోకి అడుగుపెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు న‌గ‌రాల్లో థియేట‌ర్ల‌ను నిర్మించే ఆలోచ‌న‌లో దిగ్గ‌జ ఓటీటీ ప్లాట్‌ఫామ్ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే నెట్‌ఫ్లిక్స్ హైద‌రాబాద్‌లో కొత్త స్టూడియోను ఓపెన్ చేసింది. ఐలైన్ స్టూడియోస్ పేరుతో ఏర్పాటుచేసిన ఈ కార్యాల‌యాన్ని ఇటీవ‌ల‌ సీఏం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. యానిమేష‌న్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌తో పాటు సినిమాల నిర్మాణం ల‌క్ష్యంగా ఈ స్టూడియోను ప్రారంభించిన‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది.

థియేట‌ర్ బిజినెస్‌....

స్టూడియోతోనే ప‌రిమితం కాకుండా థియేట‌ర్ బిజినెస్‌తో పాటు డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోకి నెట్‌ఫ్లిక్స్ ఎంట‌ర‌వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల నిర్మాణంవైపు నెట్‌ఫ్లిక్స్ దృష్టిసారించిన‌ట్లు చెబుతున్నారు. హైద‌రాబాద్‌, వైజాగ్ వంటి ప్ర‌ధాన న‌గ‌రాల‌తో పాటు స్మాల్ సిటీస్‌ను టార్గెట్ చేస్తూ కొత్త థియేట‌ర్ల నిర్మించాల‌ని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంద‌ట‌. ఇప్ప‌టికే న‌డుస్తోన్న కొన్ని థియేట‌ర్ల‌ను లీజ్‌కు తీసుకోవాల‌ని అనుకుంటుంద‌ట. థియేట‌ర్ బిజినెస్ కోసం తెలంగాణ‌తో పాటు ఏపీలోనూ భారీగానే పెట్టుబ‌డులు పెట్ట‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ‌య్యే ఒరిజిన‌ల్ కంటెంట్‌తో పాటు సినిమాల‌ను ఈ థియేట‌ర్ల‌లో స్పెష‌ల్‌గా స్క్రీనింగ్ చేస్తార‌ట‌. ఓటీటీ కంటెంట్ ప‌రంగా ఆడియెన్స్‌కు థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ అందించే దిశ‌గా నెట్‌ఫ్లిక్స్ ఏర్పాట్లు చేస్తోన్న‌ట్లు చెబుతోన్నారు. నెట్‌ఫ్లిక్స్ థియేట‌ర్ల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం.

డిస్ట్రిబ్యూష‌న్‌....

థియేట‌ర్ల నిర్మాణం మాత్ర‌మే కాకుండా డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోకి నెట్‌ఫ్లిక్స్ ప్ర‌వేశించ‌బోతుంద‌ట‌. తెలుగులో భారీ బ‌డ్జెట్ సినిమాల‌తో పాటు చిన్న సినిమాల పంపిణీ హ‌క్కుల‌ను తీసుకునేలా ఓ డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌స్థ‌ను నెట్‌ఫ్లిక్స్ ఏర్పాటుచేయ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ వ్యాపార విస్త‌ర‌ణ‌ ఆలోచ‌న‌ల‌పై సోష‌ల్ మీడియా నుంచి మాత్రం వ్య‌తిరేక‌త ఎదుర‌వుతుంది. ఓటీటీ కంటెంట్‌ను థియేట‌ర్ల‌లో స్క్రీనింగ్ చేయ‌డం సాధ్య‌ప‌డ‌ద‌ని కామెంట్లు పెడుతున్నారు. మ‌రోవైపు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్ల ఎక్కువ‌గా ఉన్నాయ‌నే విమ‌ర్శ‌లు చాలా కాలంగా వ్య‌క్త‌మ‌వుతోన్నాయి. నెట్‌ఫ్లిక్స్ లాంటి కార్పొరేట్ సంస్థ‌ల థియేట‌ర్ల వ్యాపారంలోకి వ‌స్తే ఈ ధ‌ర‌లు మ‌రింత పెర‌గ‌వ‌చ్చ‌ని అంటున్నారు.
కామ‌న్ ఆడియెన్స్ నుంచే కాకుండా సినిమా రంగానికి ముప్పువాటిల్లే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. సినిమా నిర్మాణం నుంచి రిలీజ్ వ‌ర‌కు కీల‌క నిర్ణ‌యాలు మొత్తం నెట్‌ఫ్లిక్స్ చేతుల్లోకి వెళ్లిపోతాయ‌ని, అదే జ‌రిగితే నిర్మాత‌ల‌కు న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని అంటున్నారు.

 

Advertisement
Advertisement