త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ntr Devara 2 | డ్రాగ‌న్ త‌ర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఇదే – త్రివిక్ర‌మ్‌కు షాకిచ్చిన ప్రొడ్యూస‌ర్‌

ఎన్టీఆర్ దేవ‌ర 2 మూవీ ఆగిపోయిన‌ట్లు చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తున్నారు. ఈ రూమ‌ర్ల‌కు చెక్ పెడుతూ దేవ‌ర సీక్వెల్ షూటింగ్ మొద‌ల‌య్యేది ఎప్పుడ‌న్న‌ది ప్రొడ్యూస‌ర్ రివీల్ చేశారు. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు.

N

Entertainment | Published On Jan 27, 2026, 11.31 am IST

Ntr Devara 2 | డ్రాగ‌న్ త‌ర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఇదే –  త్రివిక్ర‌మ్‌కు షాకిచ్చిన ప్రొడ్యూస‌ర్‌
Advertisement

Ntr Devara 2 | ప్ర‌స్తుతం కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో డ్రాగ‌న్ మూవీ చేస్తున్నారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీ షూటింగ్ నాన్‌స్టాప్‌గా జ‌రుగుతోంది. లార్జ‌ర్ దేన్ లైఫ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, త‌మిళంతో పాటు వివిధ భాష‌ల‌కు చెందిన యాక్ట‌ర్స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు.

వాట్ నెక్స్ట్‌...

డ్రాగ‌న్ త‌ర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఏద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. కొర‌టాల శివ‌తో చేయాల్సిన దేవ‌ర 2ను ప‌క్క‌న‌పెట్టి త్రివిక్ర‌మ్‌తో గాడ్ ఆఫ్ వార్ సినిమాను ఎన్టీఆర్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత కొర‌టాల శివ‌తో దేవ‌ర మూవీ చేశారు ఎన్టీఆర్‌. భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. క‌మ‌ర్షియ‌ల్‌గా ప‌ర్వాలేద‌నిపించిన ఎన్టీఆర్ పొటెన్షియ‌ల్‌కు త‌గ్గ క‌థ‌, క‌థ‌నాలు లేవ‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దేవ‌ర‌కు కొన‌సాగింపుగా దేవ‌ర 2ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఏడాది దాటినా...

ఫ‌స్ట్ పార్ట్‌కు వ‌చ్చిన విమ‌ర్శల నేప‌థ్యంలో దేవ‌ర 2 రూపొంద‌డం అనుమాన‌మేనంటూ చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫ‌స్ట్ పార్ట్ రిలీజై ఏడాది దాటిపోయినా సీక్వెల్స్‌పై ఎలాంటి అప్‌డేట్స్ రాక‌పోవ‌డం ఈ రూమ‌ర్ల‌కు బ‌లాన్ని చేకూర్చింది. ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ సినిమా ఉండ‌బోతున్న‌ట్లు వార్త‌లు తెర‌పైకి రావ‌డంతో దేవ‌ర 2 ఆగిపోయిన‌ట్లు నంద‌మూరి ఫ్యాన్స్ ఫిక్సయ్యారు.

రూమ‌ర్ల‌కు చెక్‌....

ఈ రూమ‌ర్ల‌కు దేవ‌ర నిర్మాత సుధాక‌ర్ మిక్కిలినేని చెక్ పెట్టారు. ఓ ఈవెంట్‌లో దేవ‌ర షూటింగ్‌తో పాటు రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ ఇచ్చారు. దేవ‌ర మూవీ షూటింగ్ 2026 మే నుంచి మొద‌లుకాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుంద‌ని అన్నారు. ప్రొడ్యూస‌ర్ ప్ర‌క‌ట‌న‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. డ్రాగ‌న్ త‌ర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ దేవ‌ర 2నే అని నిర్మాత ప్ర‌క‌ట‌న‌తో క్లారిటీ వ‌చ్చేసింద‌ని అంటున్నారు. దేవ‌ర 2 మే నుంచి ప్రారంభ‌మైతే త్రివిక్ర‌మ్ గాడ్‌ ఆఫ్ వార్ ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. దేవ‌ర 2 కంప్లీట్ కావ‌డానికి ఏడాదిపైనే ప‌డుతుంది. అదే జ‌రిగితే గాడ్ ఆఫ్ వార్ ఇప్ప‌ట్లో ఉండ‌క‌పోవ‌చ్చున‌ని  టాక్ వినిపిస్తోంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement