Premante Idera | ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్ డేట్ ఇదే – వెంకటేష్‌కు జోడీగా మిస్ వరల్డ్ నటించాల్సింది..కానీ!
Premante Idera |వెంకటేష్ (Vekatesh) బ్లాక్‌బస్టర్ మూవీ ప్రేమంటే ఇదేరా డిసెంబర్ 13న థియేటర్లలో రీ రిలీజ్ (Re Release)కాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత ఐశ్వర్యా రాయ్‌ని(Aishwarya Rai Bachchan) అనుకున్నారు. కానీ డిజాస్టర్స్ కారణంగా ఆమెను తప్పించి ప్రీతి జింటాను సెలెక్ట్ చేశారు.
Entertainment | Published On Dec 8, 2025, 12.16 pm IST
ప్రేమంటే ఇదేరా
విక్టరీ వెంకటేష్ (Venkatesh) కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో ప్రేమంటే ఇదేరా ( Premante Idera )ఒకటి. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో 1998లో రిలీజైన ఈ మూవీ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ప్రేమంటే ఇదేరా విజయంలో రమణ గోగుల మ్యూజిక్ కీలకంగా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు యూత్‌ను ఊపేశాయి.
ప్రేమంటే ఇదేరా మూవీలో డాక్టర్ మురళి పాత్రలో వెంకటేష్ నాచురల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ ప్రీతి జింటా కాదు. తొలు హీరోయిన్‌గా మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్‌ని (Aishwarya Rai Bachchan) అనుకున్నారు. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. ఐశ్వర్యను కలిసిన డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ కథను కూడా వినిపించారు. అప్పుడప్పుడే సినీ కెరీర్‌ను మొదలుపెట్టిన ఐశ్వర్యా రాయ్ ప్రేమంటే ఇదేరా సినిమాను అంగీకరించింది. అదే టైమ్‌లో ఐశ్వర్యా రాయ్ నటించిన ఇరువర్ (తెలుగులో ఇద్దరు)తో పాటు మరో హిందీ మూవీ డిజాస్టర్‌గా నిలవడంతో ప్రేమంటే ఇదేరా నుంచి మేకర్స్ ఆమెను తప్పించారు. ఐశ్వర్య స్థానంలో ప్రీతి జింటాను తీసుకున్నారు. అలా బ్లాక్‌బస్టర్ మూవీని ఐశ్వర్యా రాయ్ మిస్ చేసుకుంది. ఆమెకు దక్కాల్సిన సక్సెస్ ప్రీతి జింటాను వరించింది.
ప్రేమంటే ఇదేరా మూవీ తమిళంతో పాటు హిందీలోకి డబ్ అయ్యింది. అక్కడ కూడా మంచి వసూళ్లను రాబట్టింది. అప్పట్లోనే పది కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ 1998లో అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకుగాను బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా జయనన్ విన్సెంట్ నంది అవార్డును అందుకున్నారు.
వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా ప్రేమంటే ఇదేరా మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్ 13న ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో స్పెషల్ షోస్‌ను స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఇటీవలే ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. బుధవారం నుంచి ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు సమాచారం.
కాగా ప్రస్తుతం హీరోగా వెంకటేష్ ఫుల్ బిజీగా ఉన్నారు. చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారుతో పాటు త్రివిక్రమ్‌తో ఓ మూవీ చేయబోతున్నాడు. అలాగే దృశ్యం 3 కూడా కమిటయ్యాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



