త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు షాక్ – ఉస్తాద్‌కు టికెట్ ధ‌ర‌ల పెంపు, బెనిఫిట్ షోలు లేన‌ట్లేనా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూవీకి తెలంగాణ ప్ర‌భుత్వం షాకిచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా టికెట్ రేట్స్ హైక్‌తో పాటు బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. రెగ్యుల‌ర్ టికెట్ ధ‌ర‌ల‌తోనే నైజాంలో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ రిలీజ్ అవుతోన్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Mar 17, 2026, 10.58 am IST

Pawan Kalyan | తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు షాక్ – ఉస్తాద్‌కు టికెట్ ధ‌ర‌ల పెంపు, బెనిఫిట్ షోలు లేన‌ట్లేనా?
Advertisement

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూవీ మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. మార్చి 19న రిలీజ్ అవుతోంది. ఓజీ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ న‌టిస్తోన్న ఈ మూవీపై తెలుగు రాష్ట్రాల్లో భారీగా క్రేజ్ నెల‌కొంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రాశీఖ‌న్నా, శ్రీలీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కాగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాకు ఇటీవ‌లే ఏపీ ప్ర‌భుత్వం బెనిఫిట్ షోతో పాటు టికెట్ ధ‌ర‌ల పెంపుకు అనుమ‌తి ఇచ్చింది. తెలంగాణ‌లో టికెట్ ధ‌ర‌ల పెంపు, బెనిషిట్‌షోలు ఉండొచ్చ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇటీవ‌లే 90 రోజుల నిబంధ‌న‌పై సుప్రీంకోర్టు స్టే విధించ‌డంతో టికెట్ హైక్‌కు నైజాంలో ప‌ర్మిష‌న్ రావ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు మేక‌ర్స్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం గ‌ట్టి షాక్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

రెగ్యుల‌ర్ టికెట్ రేట్స్‌తోనే...

ఉస్తాద్ టికెట్ ధ‌ర‌ల‌ను పెంచ‌డానికి అంగీక‌రించ‌లేద‌ని స‌మాచారం. తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో రెగ్యుల‌ర్ టికెట్ ధ‌ర‌ల‌తోనే నైజాంలో ఈ సినిమాను స్క్రీనింగ్ చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మంగ‌ళ‌వారం నైజాంలో కొన్ని థియేట‌ర్ల‌లో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. పూర్తిస్థాయిలో సాయంత్రం నుంచి అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం. రాజాసాబ్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల‌కు ఏపీలో టికెట్ ధ‌ర‌ల పెంపుకు అనుమ‌తులు వ‌చ్చాయి. కానీ తెలంగాణ‌లో మాత్రం ప‌ర్మిష‌న్స్ రాలేదు. ఆ సినిమాల‌కు చివ‌రి నిమిషంలో టెన్ష‌న్లు, కోర్టు కేసులు ఎదుర‌య్యాయి. ఈ టెన్ష‌న్ల‌ను అవైడ్ చేస్తూ రెగ్యుల‌ర్ రేట్స్‌తోనే ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు ఫిక్సైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

స్ట్రాంగ్ మార్కెట్‌...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కు నైజాంలో స్ట్రాంగ్ మార్కెట్‌ ఉంది. ఓజీతో పాటు అత‌డి గ‌త సినిమాలో నైజాంలో రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రాబ‌ట్టాయి. ఉస్తాద్‌కు టికెట్ రేట్ హైక్‌, బెనిఫిట్ షోల‌కు అనుమ‌తులు రాక‌పోవ‌డంతో ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్‌పై గ‌ట్టిగానే ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రోవైపు ఏపీలో బెనిఫిట్ షో ఉండ‌టంతో ప్రీమియ‌ర్‌ టాక్ ఏ మాత్రం అటు ఇటుగా వ‌చ్చినా ఆ ఇంపాక్ట్ నైజాంలో ఫ‌స్ట్‌డే క‌లెక్ష‌న్స్‌పై ప‌డొచ్చ‌ని అంటున్నారు.
ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూవీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు. ద‌ళ‌ప‌తి విజ‌య్ తేరీ రీమేక్‌గా ఉస్తాద్ తెర‌కెక్కుతోన్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను ప్ర‌మోష‌న్స్‌లో హ‌రీష్ శంక‌ర్ ఖండించారు. స్ట్రెయిట్ మూవీనే అంటూ చెప్పారు. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌కు దేవిశ్రీప్ర‌సాద్‌, త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement
Advertisement