త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | టైటిల్ వివాదంలో నివిన్ పౌలీ సంచారి – ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్ర‌యించ‌నున్న టాలీవుడ్ డైరెక్ట‌ర్ ?

నివీన్ పౌలీ , సూరి హీరోలుగా న‌టిస్తున్న సంచారి మూవీ టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ఈ టైటిల్‌ను టాలీవుడ్ డైరెక్ట‌ర్ చంద్ర‌సిద్ధార్థ్ త‌న నెక్స్ట్ సినిమా కోసం ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్నారు. ఈ టైటిల్ హ‌క్కుల విష‌యంలో చంద్ర సిద్ధార్థ్ నివీన్ పౌలీ తెలుగు నిర్మాత‌ల‌పై ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో కంప్లైంట్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Sep 26, 2026, 8.20 pm IST

Tollywood | టైటిల్ వివాదంలో నివిన్ పౌలీ  సంచారి – ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్ర‌యించ‌నున్న టాలీవుడ్ డైరెక్ట‌ర్ ?
Advertisement

Tollywood | బెత్లెహం కుడుంబ‌ యూనిట్ మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు మ‌ల‌యాళ హీరో నివీన్ పౌలీ. రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా రూపొందిన ఈ మ‌ల‌యాళ సినిమా మూడు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. త‌మిళ క‌మెడియ‌న్ సూరి మండాడి మూవీతో హీరోగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. స్పోర్ట్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది.

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌...

నివిన్ పౌలీ, సూరి క‌లిసి త‌మిళంలో యెళు కాద‌ల్ యెళు మ‌లై పేరుతో ఓ సినిమా చేస్తోన్నారు. రొమాంటిక్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ కాబోతుంది. తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్‌కు సంచారి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఇటీవ‌ల ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. సంచారి మూవీ అక్టోబ‌ర్ 1న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. నివీన్ పౌలీ, సూరి సినిమా కావ‌డంతో తెలుగు ఆడియెన్స్‌లో సంచారిపై ఆస‌క్తి ఏర్ప‌డింది. తాజాగా ఈ సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకుంది.

ఫిల్మోత్స‌వ్ బ్యాన‌ర్‌పై....

సంచారి అనే టైటిల్‌ను టాలీవుడ్ డైరెక్ట‌ర్ చంద్ర‌సిద్ధార్థ్ ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్నారు. ఈ టైటిల్‌తో త‌న స్వీయ నిర్మాణ సంస్థ ఫిల్మోత్స‌వ్ ప‌తాకంపై ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతోన్నారు. సంచారి పేరుతో నివీన్ పౌలీ, సూరి సినిమా రిలీజ్ కాబోతుండ‌టం చూసి చంద్ర‌సిద్ధార్థ టీమ్ షాక్‌కు గురైన‌ట్లు స‌మాచారం. టైటిల్ విష‌యంలో చంద్ర‌సిద్ధార్థ్ ఫిల్మ్ ఛాంబ‌ర్‌ను ఆశ్ర‌యించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే అక్టోబ‌ర్ 1న నివీన్ పౌలీ సినిమా రిలీజ్ ఉంటుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

సంచారి క‌థేమిటి?

గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో కొద్ది నెల‌లే బ‌తుకుతాన‌ని ఓ ఈ కామ‌ర్స్ వ్య‌వ‌స్థాప‌కుడికి తెలుస్తుంది. కుటుంబానికి దూర‌మై త‌న పేరును సంచారిగా మార్చుకుంటాడు. ఈ క్ర‌మంలో ఐదుగురు అప‌రిచితుల‌తో అత‌డికి ఏర్ప‌డిన ప‌రిచ‌యం... రాయ‌ల‌సీమ‌లోని ఓ ఊరిని కాపాడ‌టం కోసం ఆ వ్య‌క్తి చేసిన పోరాటంతో చంద్ర సిద్ధార్థ్ సంచారి సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు.

 

Advertisement
Advertisement