Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ మూవీ – సీఎంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే…
నివీన్ పాల్ హీరోగా నటించిన మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ప్రతిఛాయ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 24 నుంచి జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ కాబోతుంది. థియేటర్లలో పది కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
Entertainment | Published On Apr 17, 2026, 8.05 pm IST
Malayalam OTT | సర్వం మాయ మూవీతో హీరోగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు నివీన్ పాల్. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. సర్వమాయ తర్వాత ప్రతిఛాయ పేరుతో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ చేశాడు నివీన్ పాల్. భారీ అంచనాల నడుమ మలయాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రతిఛాయ సినిమాకు ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించాడు. నివీన్ పాల్‌తో పాటు షరాఫుద్దీన్ మరో హీరోగా కనిపించాడు.
జియో హాట్ స్టార్‌లో...
తాజాగా ఈ మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రతిఛాయ సినిమాలో ఏప్రిల్ 24 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది . మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది.
సాంగ్స్...హీరోయిన్ లేకుండా...
హీరోయిన్ తో పాటు సాంగ్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ప్రయోగాత్మకంగా దర్శకుడు ఉన్నికృష్ణన్ ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ రాతలోనే కాకుండా తీతలో కొత్తదనం లేకపోవడంతో ప్రతిఛాయ డిజాస్టర్‌గా నిలిచింది. వరల్డ్ వైడ్‌గా పది కోట్లలోపే కలెక్షన్స్ కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీగా నష్టాలు తెచ్చిపెట్టింది.
సీఎం కొడుకు....
వర్గీస్ కేరళ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. నిజాయితీపరుడైన నాయకుడిగా పేరుతెచ్చుకున్నాడు. వర్గీస్ పెద్ద కొడుకు జాన్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఐటీ జాబ్ చేసుకుంటాడు. మరో కొడుకు టోబిన్ ...తండ్రి అడుగుజాడల్లోనే యంగ్ లీడర్‌గా పేరు తెచ్చుకుంటాడు. సీఎం వర్గీస్ తనను లైంగికంగా వేధించాడంటూ నిశా అనే మహిళా ఆరోపణలు చేస్తుంది. దాంతో సీఎం పదవికి వర్గీస్ రాజీనామా చేస్తాడు. ఈ ఆరోపణల వెనుకున్న నిజానిజాలను వెలికితీయాలని జాన్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి తెలిసిన షాకింగ్ నిజాలేమిటి? రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జాన్‌కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నదే ఈ మూవీ కథ.
ప్రస్తుతం హీరోగా మలయాళంలో మూడు సినిమాలు చేస్తున్నాడు నివీన్ పాల్. తమిళంలో బెంజ్ మూవీలో విలన్‌గా కనిపించబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ కథను అందిస్తున్న ఈ సినిమాలో లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం టైమ్ ట్రావెల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ – తెలుగులోనూ రిలీజ్
ఏప్రిల్ 9, 2026

Telugu OTT | ఓటీటీలోకి తరుణ్ భాస్కర్, ఈషారెబ్బా లేటెస్ట్ కామెడీ మూవీ – స్ట్రీమింగ్‌డేట్, ప్లాట్‌ఫామ్ కన్ఫామ్
ఫిబ్రవరి 23, 2026

Horror Movie | హెబ్బాపటేల్ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్
ఫిబ్రవరి 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



