త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలోకి 150 కోట్ల మ‌ల‌యాళం మూవీ – చిలిపి ద‌య్యం క‌థ

మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ స‌ర్వం మాయ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. జ‌న‌వ‌రి 30 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. నివీన్ పాల్‌, ప్రీతి ముకుంద‌న్ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా న‌టించారు.

N

Entertainment | Published On Jan 23, 2026, 3.08 pm IST

Malayalam OTT | ఓటీటీలోకి 150 కోట్ల మ‌ల‌యాళం మూవీ – చిలిపి ద‌య్యం క‌థ
Advertisement

Malayalam OTT |  నివీన్ పాల్ (Nivin Pauly) హీరోగా న‌టించిన స‌ర్వం మాయ గ‌త ఏడాది మ‌ల‌యాళంలో (Malayalam) అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. కేవ‌లం 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 150 కోట్ల వ‌సూళ్ల‌తో అద‌ర‌గొట్టింది. ఈ సినిమాతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత పెద్ద విజ‌యాన్ని అందుకున్నాడు నివీన్ పాల్‌.
థియేట‌ర్ల‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. జ‌న‌వ‌రి 30 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల అవుతోంది. స‌ర్వం మాయ ఓటీటీ రిలీజ్ డేట్‌ను జియో హాట్ స్టార్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.

మ‌ల‌యాళంలోకి ఎంట్రీ...

స‌ర్వ మాయ సినిమాలో రియా శిబు, అజు వ‌ర్గీస్‌, ప్రీతి ముకుంద‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ మ్యూజిక్ అందించారు. స‌ర్వం మాయ సినిమాతో మ‌ల‌యాళం సీనియ‌ర్ డైరెక్ట‌ర్ స‌త్య‌న్ అంతిక్కాడ్ త‌న‌యుడు అఖిల్ స‌త్య‌న్ ద‌ర్శ‌కుడిగా మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చారు.
సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ కామెడీగా స‌ర్వం మాయ మూవీ రూపొందింది. సాధార‌ణంగా హార‌ర్ సినిమా అంటే భ‌య‌పెట్ట‌డం కామ‌న్‌. కానీ అందుకు భిన్నంగా ఫ‌న్ కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించిన విధానం ఆడియెన్స్‌ను మెప్పించింది. నివీన్ పాల్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోల సినిమాలను అధిగమిస్తూ  బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గిటారిస్ట్‌ను ఆవ‌హించే ద‌య్యం...

ప్ర‌బేందు (నివీన్ పాల్) బ్ర‌హ్మ‌ణ కుటుంబానికి చెందిన యువ‌కుడు. దేవుడిని న‌మ్మ‌డు. మ్యూజిషియ‌న్ కావాల‌ని క‌ల‌లు కంటాడు. ఆర్థిక ఇబ్బందుల వ‌ల్ల ఓ పూజ‌లో అసిస్టెంట్‌గా ప‌నిచేస్తాడు. అనుకోకుండా ఆ పూజ కార‌ణంగా ప్ర‌భేందును ఓ యువ‌తి ఆత్మ ఆవ‌హిస్తుంది. ఆ ఆత్మ ఎవ‌రిది? ప్ర‌భేందును ఎందుకు అవ‌హించింది. గిటారిస్ట్ కావాల‌నే అత‌డి క‌ల నెర‌వేరిందా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Advertisement

తాజావార్తలు

Advertisement