Nivetha Pethuraj | బ్రేకప్ తర్వాత ఫస్ట్ ఛాన్స్.. మూడేళ్ల తర్వాత తెలుగు సినిమాలో నివేదా పేతురాజ్
దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు గత ఏడాది ప్రకటించింది హీరోయిన్ నివేదా పేతురాజ్. కానీ మనస్పర్థల కారణంగా ఎంగేజ్‌మెంట్‌తోనే ఈ జంట ప్రేమాయణానికి పుల్‌స్టాప్ పడింది. బ్రేకప్ తర్వాత ఫస్ట్ టైమ్ తెలుగులో ఓ ఛాన్స్ దక్కించుకుంది నివేదా పేతురాజ్.
Entertainment | Published On May 3, 2026, 3.17 pm IST
Nivetha Pethuraj | బ్రోచేవారెవరురా బ్యూటీ నివేదా పేతురాజ్ మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన తర్వాత ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు రాబోతుంది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు గత ఏడాది ఆగస్ట్‌లో ప్రకటించింది నివేదా పేతురాజ్. ఇబ్రాన్‌తో తన ఎంగేజ్‌మెంట్ కూడా జరిగినట్లు వెల్లడించింది. కాబోయే భర్తతో ఇబ్రాన్‌తో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2025 డిసెంబర్‌లో నివేదా పేతురాజ్, రాజ్ హిత్ ఇబ్రాన్ పెళ్లి జరుగనున్నట్లు వార్తలొచ్చాయి.
అన్‌ఫాలో...
కానీ మనస్పర్థల కారణంగా ఎంగేజ్‌మెంట్‌తోనే ఈ జంట ప్రేమాయణానికి పుల్‌స్టాప్ పడింది. ఇబ్రాన్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించడమే కాకుండా అతడిని అన్‌ఫాలో చేసింది. బ్రేకప్‌కు గల కారణాలను మాత్రం నివేదా వెల్లడించలేదు.
రీఎంట్రీ...
ఈ విఫల ప్రేమాయణం తాలూకు బాధ నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న నివేదా పేతురాజ్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఎట్టకేలకు నివేదాకు తెలుగులో ఓ ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.
సింగ్ గీతంలో..
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సింగ్ గీతం పేరుతో మ్యూజికల్ ఫాంటసీ డ్రామా మూవీ తెరకెక్కుతోంది. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ మూవీ కాన్సెప్ట్ వీడియోను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో నివేదా పేతురాజ్ కనిపించబోతున్నట్లు సమాచారం. చాలా సర్‌ప్రైజింగ్ ఈ ముద్దుగుమ్మ పాత్ర సాగుతుందట. ఓ స్పెషల్ వీడియో టీజర్‌తో త్వరలోనే మేకర్స్ నివేదా క్యారెక్టర్‌ను పరిచయం చేయబోతున్నట్లు తెలిసింది. సింగ్ గీతం సినిమాలో అయాన్, అహల్య, షాలిని కొండెపూడి లీడ్ రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ జూలై 11న రిలీజ్ కాబోతుంది.
కాగా శ్రీవిష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్. ఆ తర్వాత బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అలా వైకుంఠపురములో, రెడ్, పాగల్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



