Nivetha Pethuraj | వెంకటేష్ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ – మరోసారి ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్?
అల వైకుంఠపురములో తర్వాత మరోసారి త్రివిక్రమ్ సినిమాలో నివేదా పేతురాజ్ ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఆదర్శ కుటుంబం సినిమాలో ఈ కోలీవుడ్ బ్యూటీ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On May 22, 2026, 4.22 pm IST
Nivetha Pethuraj | మూడేళ్ల గ్యాప్ తర్వాత కోలీవుడ్ బ్యూటీ నివేదా పేతురాజ్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నది. అల వైకుంఠపురములో తర్వాత మరోసారి త్రివిక్రమ్ మూవీలో ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. శ్రీవిష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. బ్రోచేవారెవరురా, చిత్రలహరి, రెడ్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
పెళ్లికి ముందే తెగతెంపులు...
దుబాయ్‌కి చెందిన బిజినెస్‌మెన్ రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో ప్రేమలో పడింది నివేదా పేతురాజ్. అతడిని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పాలని కలలు కన్నది. కానీ మనస్పర్థల కారణంగా పెళ్లి పీటలు ఎక్కకముందే రాజ్‌పుత్‌తో తెగతెంపులు చేసుకుంది. విఫల ప్రేమాయణం, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకుల కారణంగా మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న నివేదా త్వరలోనే తెలుగు తెరపై మళ్లీ కనిపించబోతుంది.
ఆదర్శ కుటుంబంలో...
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆదర్శ కుటుంబం సినిమాలో ఈ కోలీవుడ్ బ్యూటీ కీలక పాత్రలో కనిపించబోతున్నదట. గ్లామర్ హంగులకు దూరంగా ఛాలెంజింగ్‌గా నివేదా పాత్ర సాగుతుంది. త్వరలోనే ఆదర్శ కుటుంబం సెట్స్‌లో ఈ తమిళ హీరోయిన్ అడుగుపెట్టబోతున్నట్లు చెబుతోన్నారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమాలో నివేదా నటించింది. రెండోసారి ఈ ముద్దుగుమ్మకు త్రివిక్రమ్ మూవీలో ఛాన్స్ దక్కడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆదర్శకుటుంబం సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ తెరకెక్కుతోన్న ఈ సినిమా దసరాకు థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదర్శ కుటుంబం సినిమాలో నారా రోహిత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు తొలుత మ్యూజిక్ డైరెక్టర్‌గా యానిమల్, అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వరన్‌ను అనుకున్నారు. కానీ ఇటీవల అతడిని తప్పించి తమన్‌ను సంగీత దర్శకుడిగా తీసుకోవడం వివాదానికి దారితీసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Satyadev | సమవర్తిగా సత్యదేవ్ – టాలీవుడ్‌కు కొత్త జానర్‌ను పరిచయం చేస్తోన్న హీరో
మే 22, 2026

Suriya Jyothika | హీరో సూర్య కూతురి ఫొటోలు చూశారా – హీరోయిన్లకు మించిన అందం
మే 22, 2026

Pooja Hegde | మళ్లీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా పూజా హెగ్డే.. ఇక కెరీర్ ట్రాక్‌లో పడినట్లేనా..?
మే 22, 2026
తాజావార్తలు
- ●Venkateshwar Reddy, Narendar Reddy | హరీశ్‌రావు ఉన్నమాటే అన్నారు.. అవాకులు, చెవాకులెందుకు యెన్నం: మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి
- ●Satyadev | సమవర్తిగా సత్యదేవ్ - టాలీవుడ్‌కు కొత్త జానర్‌ను పరిచయం చేస్తోన్న హీరో
- ●Vinesh Phogat | ఆసియా గేమ్స్ ట్రయల్స్ వివాదం.. రెజ్లింగ్ ఫెడరేషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం..
- ●Xiaomi YU7 | షియోమీ నుంచి బీస్ట్ తరహా ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. 2.92 సెకన్లలో 100 కి.మీ. వేగం.. 700 కి.మీ. రేంజ్..
- ●Brahmotsavams | రేపటి నుంచి తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 27న గరుడ సేవ
- ●Mallu Bhatti Vikramarka | 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం: బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Venkateshwar Reddy, Narendar Reddy | హరీశ్‌రావు ఉన్నమాటే అన్నారు.. అవాకులు, చెవాకులెందుకు యెన్నం: మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి

Satyadev | సమవర్తిగా సత్యదేవ్ - టాలీవుడ్‌కు కొత్త జానర్‌ను పరిచయం చేస్తోన్న హీరో

Vinesh Phogat | ఆసియా గేమ్స్ ట్రయల్స్ వివాదం.. రెజ్లింగ్ ఫెడరేషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం..

Xiaomi YU7 | షియోమీ నుంచి బీస్ట్ తరహా ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. 2.92 సెకన్లలో 100 కి.మీ. వేగం.. 700 కి.మీ. రేంజ్..



