త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nithya Menen | బాలీవుడ్ సినిమాలో విల‌న్‌గా టాలీవుడ్ హీరోయిన్ – “స్పిరిట్” న‌టుడితో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ మూవీ

సౌత్ హీరోయిన్‌ నిత్యామీన‌న్ విల‌న్ పాత్ర‌తో ఆడియెన్స్‌ను భ‌య‌పెట్టేందుకు రెడీ అయ్యింది. వివేక్ ఒబెరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో మిస్ట‌ర్ అండ్ మిస్ గ్రే పేరుతో బాలీవుడ్‌లో ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో నిత్యామీన‌న్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతుంది. ఈ బాలీవుడ్ మూవీ డిసెంబ‌ర్ 11న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Nov 3, 2026, 4.38 pm IST

Nithya Menen | బాలీవుడ్ సినిమాలో విల‌న్‌గా టాలీవుడ్ హీరోయిన్ – “స్పిరిట్” న‌టుడితో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ మూవీ
Advertisement

Nithya Menen |హీరోయిన్లు విల‌న్ పాత్ర‌ల్లో క‌నిపించే ట్రెండ్ పెరుగుతోంది. సంయుక్త మీన‌న్‌, రుక్మిణి వ‌సంత్‌తో పాటు ప‌లువురు స్టార్ హీరోయిన్లు నెగెటివ్ పాత్ర‌ల‌తో అద‌ర‌గొట్టారు. అల్లు అర్జున్ (Allu Arjun) రాకాలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) విల‌న్‌గా న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ లిస్ట్‌లోకి మ‌రో హీరోయిన్ చేరింది. ద‌క్షిణాది నాయిక నిత్యామీన‌న్ బాలీవుడ్ సినిమా కోసం విల‌న్‌గా అవ‌తారం ఎత్తింది.

మిస్ట‌ర్ అండ్ మిస్ గ్రే...

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు వివేక్ ఒబెరాయ్‌, నిత్యామీన‌న్ (Nitya Menen) ప్ర‌ధాన పాత్ర‌ల్లో మిస్ట‌ర్ అండ్ మిస్ గ్రే పేరుతో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ మంగ‌ళ‌వారం విడుద‌లైంది. ఈ పోస్ట‌ర్‌లో నిత్యామీన‌న్‌, వివేక్ ఒబెరాయ్ ముఖాలు స‌గ‌మే క‌నిపిస్తున్నాయి. రెట్రో స్టైల్‌లో డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది.

విల‌న్ పాత్ర‌లో...

మిస్ట‌ర్ అండ్ మిస్ గ్రే సినిమాకు విశాల్ మిశ్రా, అంకుర్ ప‌జ్నీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో నిత్యామీన‌న్ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఆమె పాత్ర‌లో వ‌చ్చే ట్విస్ట్‌లు షాకింగ్‌కు గురిచేస్తాయ‌ని స‌మాచారం. రెగ్యుల‌ర్ విల‌న్ పాత్ర‌ల‌కు భిన్నంగా ఈ సౌత్ బ్యూటీ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని అంటున్నారు. ప్రేమ‌, న‌మ్మ‌క‌ద్రోహం, మోసం అనే అంశాల చుట్టూ మిస్ట‌ర్ అండ్ మిస్ గ్రే మూవీ సాగ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

రిలీజ్ డేట్‌...

మిస్ట‌ర్ అండ్ మిస్ గ్రే మూవీ రిలీజ్ డేట్‌ను సోమ‌వారం రివీల్ చేశారు. డిసెంబ‌ర్ 11న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ధ‌నుష్ హీరోగా న‌టించిన ఇడ్లీక‌డై త‌ర్వాత ఏడాది పాటు సినిమాల‌కు గ్యాప్ తీసుకుంది నిత్యామీన‌న్‌. ఇటీవ‌లే నిర్మాత‌గా మారింది. కేయూరీ ప్రొడ‌క్ష‌న్ పేరుతో సొంతంగా బ్యాన‌ర్ స్థాపించింది. ఈ నిర్మాణ సంస్థ‌పై తొలి ప్ర‌య‌త్నంగా ఓ ఫాంట‌సీ మూవీని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స్పిరిటిల్‌లో వివేక్ ఓబెరాయ్ న‌టిస్తోన్నారు. సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీలో మెయిన్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

 

ట్యాగ్స్:

Bollywood MovieHindi CinemaMr And Mrs GreyMr And Mrs Grey Release DateNitya MenenNitya Menen Turns VillianVivek Oberai
Advertisement
Advertisement