RGV | చిక్కుల్లో ఆర్‌జీవీ – 30 కోట్లు ఇవ్వాల్సిందేనంటూ లీగల్ నోటీసులు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ చిక్కుల్లో పడ్డారు. ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ 30 కోట్ల పాత బకాయిల విషయంలో ఆర్‌జీవీకి లీగల్ నోటీసులు జారీ చేసింది. నిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎవరూ ఈ దర్శకుడితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.
Entertainment | Published On Oct 29, 2026, 7.29 pm IST
RGV | డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ చిక్కుల్లో పడ్డారు. పాత బకాయిల విషయంలో ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ అగ్ర దర్శకుడికి లీగల్ నోటీసులు ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ తమకు 29 కోట్ల 67 లక్షలు బకాయిలు ఉన్నాడని, ఇందులో 11 కోట్ల 38 లక్షల వడ్డీ కూడా కలిపి ఉందని ఎక్లాటెంట్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ బహిరంగ నోటీసు జారీ చేసింది. అక్టోబర్ 30 లోపు తమకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలను క్లియర్ చేయాలని ఈ నోటీసులో పేర్కొన్నది.
ముంబై హైకోర్టు తీర్పు...
2010లో ఆర్‌జీవీతో తాము ఓ ఆర్థిక ఒప్పందం చేసుకున్నామని, కానీ దానిని ఉల్లంఘించారని తెలిపింది. ఈ వివాదానికి సంబంధించి 2013లో ముంబై హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఎక్లాటెంట్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్పింది.
ఎన్‌వోసీ తప్పనిసరి...
ఆర్‌జీవీతో ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు చేసుకునే నిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తమ నుంచి తప్పనిసరిగా ఎన్‌వోసీ తీసుకోవాల్సిందేనని ఎక్లాటెంట్ సంస్థ తెలిపింది. ఈ లీగల్ నోటీసుల ప్రభావం ఆర్‌జీవీ లేటెస్ట్ మూవీ పోలీస్ కంపెనీపై పడే అవకాశం ఉందని అంటున్నారు. ముంబాయి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హర్షవర్ధన్ రాణే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. టీ సిరీస్ సంస్థతో కలిసి ఆర్‌జీవీ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | ఆ అవమానం జీవితాంతం మోయాల్సిందే – పెద్ద వివాదంపై జాన్వీకపూర్ రియాక్షన్
అక్టోబర్ 29, 2026

Sai Pallavi | సాయిపల్లవికి బిగ్ టెస్ట్.. రెండు సినిమాలు హిట్ అయితేనే..!
అక్టోబర్ 28, 2026

Mrunal Thakur | మృణాల్ ఠాకూర్ పెళ్లిపై మళ్లీ రూమర్స్.. డిసెంబర్లోనే అంటూ ప్రచారం..!
అక్టోబర్ 28, 2026
తాజావార్తలు
- ●Telangana SC ST Sub Plan | ఎస్సీ, ఎస్టీలకు గుడ్ న్యూస్: 1,300 ఎకరాల భూమి పంపిణీకి రంగం సిద్ధం
- ●Ponnam Prabhakar | "ఓబీసీ కాలమ్" పెట్టాలని అమిత్ షాను అడగాలి
- ●DK Aruna | దేశ భద్రత కోసమే సర్.. యువత ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలి: ఎంపీ డీకే అరుణ
- ●Qualcomm Layoffs November 2026 | క్వాల్కామ్లో మళ్లీ లేఆఫ్స్.. ఇండియాలో వేలాది మంది ఉద్యోగాలకు ఎసరు
- ●Mani Ratnam | అనౌన్స్ చేసిన ఆరు నెలల్లోనే రిలీజ్ - సాయిపల్లవి, మణిరత్నం మూవీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
- ●Trisha | త్రిష తెలుగు వెబ్‌సిరీస్ - సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్...

Telangana SC ST Sub Plan | ఎస్సీ, ఎస్టీలకు గుడ్ న్యూస్: 1,300 ఎకరాల భూమి పంపిణీకి రంగం సిద్ధం

Ponnam Prabhakar | "ఓబీసీ కాలమ్" పెట్టాలని అమిత్ షాను అడగాలి

DK Aruna | దేశ భద్రత కోసమే సర్.. యువత ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలి: ఎంపీ డీకే అరుణ

Qualcomm Layoffs November 2026 | క్వాల్కామ్లో మళ్లీ లేఆఫ్స్.. ఇండియాలో వేలాది మంది ఉద్యోగాలకు ఎసరు



