MLA Anirudh Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి నోటీసులు..!
MLA Anirudh Reddy | జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సందర్భానుసారంగా సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన.. తన వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
నాకెలాంటి నోటీసులు అందలేదన్న అనిరుధ్ రెడ్డి
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ
MLA Anirudh Reddy | త్రినేత్ర న్యూస్ : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సందర్భానుసారంగా సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన.. తన వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న.. జడ్చర్లలో నేను చనిపోతే బిల్లులు ఇస్తారా..? అలాగైతే నేను నియోజకవర్గం అభివృద్ధి కోసం చావడానికి సిద్ధం అని అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన మరువక ముందే ఈ ఏడాది అక్టోబర్ 27న గజ్వేల్ నియోజకవర్గం మాజీ మంత్రి హరీశ్‌రావుతో అనిరుధ్ రెడ్డి వేదిక పంచుకోవడం కూడా తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. అనిరుధ్ పర్యటనపై సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట ఆంక్షా రెడ్డి.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా హరీశ్‌రావుతో కలిసి రేషన్ డీలర్ల సమావేశంలో అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారని ఆంక్షా రెడ్డి, నర్సారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి వివరణ తీసుకోవాలని కోరారు.
ఈ పరిణామాలను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనిరుధ్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ తనకు ఎవరూ ఫోన్ చేయలేదని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ చెప్పలేదని అనిరుధ్ రెడ్డి తెలిపారు.
అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు ఇవే..
ముఖ్యంగా తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టుల విషయంలోనూ ఆయన చేసిన ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి.
గతంలో రాష్ట్రంలో మళ్లీ ఇప్పసారా దుకాణాలు ప్రారంభించాలని, గతంలో సారా తాగినవారు 115 ఏళ్లు బతికారంటూ అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సినీ నటులకు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని కూడా ఆయన సూచించారు. మరో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను కూడా సీఎం అభ్యర్థినేనంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
నిధుల విడుదలపై సొంత ప్రభుత్వానికే అల్టిమేటం!
ఇటీవల జడ్చర్ల నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనిరుద్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. నిధులు విడుదల చేయకపోతే 30 వేల మందితో దీక్షకు దిగుతానని హెచ్చరించారు. తన ప్రాణం పోయినా సరే నిధులు సాధిస్తానని, తాను చనిపోయిన తర్వాతే నిధులు ఇస్తారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Aga Syed Ruhullah Mehdi | ఒమర్ అబ్దుల్లాకి షాక్.. శ్రీనగర్ ఎంపీ రాజీనామా
- ●Ramayana Song Controversy | రామాయణ సాంగ్‌పై వివాదం.. స్పందించిన అర్మాన్ మాలిక్
- ●Diwali 2026 | దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?.. లక్ష్మీ పూజ శుభ ముహూర్తం, 5 రోజుల క్యాలెండర్, పూజా విధానం ఇదే..!
- ●Nithya Menen | బాలీవుడ్ సినిమాలో విలన్‌గా టాలీవుడ్ హీరోయిన్ - "స్పిరిట్" నటుడితో మర్డర్ మిస్టరీ మూవీ
- ●Sangishetti Jagadeeshwar Rao | అమిత్ షా సర్దుకునే టైమొచ్చింది: సంగిశెట్టి జగదీశ్వర్ రావు
- ●MP Chamala | సర్ పేరుతో శాశ్వత అధికారానికి బీజేపీ కుట్ర

Aga Syed Ruhullah Mehdi | ఒమర్ అబ్దుల్లాకి షాక్.. శ్రీనగర్ ఎంపీ రాజీనామా

Ramayana Song Controversy | రామాయణ సాంగ్‌పై వివాదం.. స్పందించిన అర్మాన్ మాలిక్

Diwali 2026 | దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?.. లక్ష్మీ పూజ శుభ ముహూర్తం, 5 రోజుల క్యాలెండర్, పూజా విధానం ఇదే..!

Nithya Menen | బాలీవుడ్ సినిమాలో విలన్‌గా టాలీవుడ్ హీరోయిన్ - "స్పిరిట్" నటుడితో మర్డర్ మిస్టరీ మూవీ





