Nithya Menen | పదకొండేళ్ల తర్వాత హారర్ మూవీలో నిత్యామీనన్ – ప్రొడ్యూసర్‌గా తొలి అడుగు
పదకొండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హీరోయిన్ నిత్యా మీనన్ ఓ హారర్ మూవీ చేయబోతుంది. ఈ సినిమాతోనే ఏడాది తర్వాత సిల్వర్ స్క్రీన్‌పైకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. అంతే కాకుండా ఈ తమిళ సినిమాకు నిత్యా మీనన్ రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Aug 17, 2026, 3.44 pm IST
Nithya Menen | నిత్యా మీనన్ కొత్త సినిమాపై సంతకం చేసి ఏడాది దాటిపోయింది. చివరగా ధనుష్ తమిళ మూవీ ఇడ్లీ కడైలో హీరోయిన్‌గా నటించింది. ఇడ్లీకడై తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకుంది నిత్యా మీనన్ . ఈవెంట్లు, సోషల్ మీడియాలోనూ ఈ సీనియర్ హీరోయిన్ కనిపించకపోవడం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఒకానొక టైమ్‌లో ఈ బెంగళూరు బ్యూటీ సినిమాలకు గుడ్‌బై చెప్పిందంటూ రూమర్లు వినిపించాయి. వీటిపై కూడా రియాక్ట్ కాలేదు. ఎట్టకేలకు ఈ పుకార్లకు చెక్ పెడుతూ నిత్యా మీనన్ ఓ హారర్ మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాతోనే నిత్యా మీనన్ ప్రొడ్యూసర్‌గా మారనున్నట్లు ప్రచారంజరుగుతోంది.
రైటర్‌గా...
యామిరుక్కా భయమే, కరుంగాప్పియమ్ వంటి హారర్ సినిమాలతో తమిళ ప్రేక్షకులను మెప్పించాడు డైరెక్టర్ డీకే. తనకు అచ్చొచ్చిన జానర్‌లోనే నెక్స్ట్ మూవీని చేయబోతున్నాడు ఈ దర్శకుడు. హారర్ ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు దక్షిణాదిలో వచ్చిన హారర్ సినిమాలకు భిన్నమైన పాయింట్‌తో ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు డీకేతో కలిసి నిత్యామీనన్ కథను అందించినట్లు టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తోన్నట్లు సమాచారం.
స్వీయ నిర్మాణ సంస్థ....
ఈ ఏడాదే కేయూరి ప్రొడక్షన్స్ పేరుతో నిత్యా మీనన్ స్వీయ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా ఈ హారర్ మూవీని రూపొందించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఓ టాప్ ప్రొడక్షన్ హౌజ్‌తో కలిసి నిత్యామీనన్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే డీకే, నిత్యా మీనన్ హారర్ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలిసింది. తమిళంలో రూపొందుతోన్న ఈ మూవీని తెలుగుతో పాటు మలయాళంలో రిలీజ్ చేయబోతున్నారు. నిత్యా మీనన్ గతంలో రాఘవ లారెన్స్ కాంచన 2లో ఓ హీరోయిన్‌గా నటించింది. కెరీర్ మొత్తంలో ఆమె చేసిన ఏకైన హారర్ మూవీ ఇదే. డీకే డైరెక్షన్‌లో రూపొందుతోన్న సినిమాతో పదకొండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హారర్ జానర్‌లో ఈ సీనియర్ హీరోయిన్ సినిమా చేయబోతుండటం తమిళ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Trisha | తల్లి చీరలో మెరిసిన త్రిష – చెన్నై క్వీన్ కొత్త ఫొటోలపై ఓ లుక్కేయండి!
ఆగస్టు 16, 2026

Trisha | త్రిషకు విజయ్ ప్రభుత్వం వీఐపీ ట్రీట్మెంట్ – నెటిజన్ల ట్రోలింగ్
ఆగస్టు 16, 2026

Vishwanath And Sons | విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్స్ – సూర్య సినిమాకు తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●Tamil Nadu | తమిళనాడు రైతులకు విజయ్ గుడ్‌న్యూస్.. రూ.75వేల దాకా పంట రుణాలమాఫీ
- ●Mallu Ravi | కుల వివక్షకు వ్యతిరేకంగా.. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతాం: మల్లు రవి
- ●Jupally Krishna Rao | వ్యక్తుల కంటే పార్టీయే సుప్రీం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
- ●కల్యాణ లక్ష్మిపై వెనక్కి తగ్గేది లేదు
- ●Dasoju Sravan | మీనాక్షి నటరాజన్‌కు దండం పెట్టి చెబుతున్న.. రేవంత్‌ను నందిగ్రామ్‌లో శిక్షణకు పంపించండి
- ●E20 Petrol | పాత వాహనాల కోసం ఈ10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలి.. చీఫ్ ఎకనామిస్ట్ నాగేశ్వరన్

Tamil Nadu | తమిళనాడు రైతులకు విజయ్ గుడ్‌న్యూస్.. రూ.75వేల దాకా పంట రుణాలమాఫీ

Mallu Ravi | కుల వివక్షకు వ్యతిరేకంగా.. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతాం: మల్లు రవి

Jupally Krishna Rao | వ్యక్తుల కంటే పార్టీయే సుప్రీం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం

కల్యాణ లక్ష్మిపై వెనక్కి తగ్గేది లేదు



