త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nithya Menen | టాలీవుడ్ ఒక్క‌టే కాదు .. అన్ని ఇండ‌స్ట్రీలు ఇంతే – జాన్వీ కపూర్ పెద్ది వివాదంపై నిత్యా మీన‌న్ కామెంట్స్

జాన్వీ క‌పూర్ పెద్ది వివాదంపై నిత్యా మీన‌న్ రియాక్ట్ అయ్యింది. హీరోయిన్ల‌ను గ్లామ‌ర‌స్‌గా చూపించే సంస్కృతి టాలీవుడ్‌లోతో పాటు అన్ని ఇండ‌స్ట్రీల‌లో ఉంద‌ని అన్న‌ది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో త‌న‌ను కొంద‌రు ద‌ర్శ‌కులు అప్రోచ్ అయ్యార‌ని, ఆ సినిమాల‌ను తాను తిర‌స్క‌రించాన‌ని చెప్పింది.

N

Entertainment | Published On Jun 7, 2026, 6.10 pm IST

Nithya Menen |  టాలీవుడ్ ఒక్క‌టే కాదు .. అన్ని ఇండ‌స్ట్రీలు ఇంతే  –  జాన్వీ కపూర్ పెద్ది వివాదంపై నిత్యా మీన‌న్ కామెంట్స్
Advertisement

Nithya Menen  | జాన్వీ క‌పూర్ పెద్ది వివాదం ముదురుతోంది. హీరోయిన్ల‌ను గ్లామ‌ర‌స్‌గా చూపించ‌డంలో ద‌ర్శ‌కులదే త‌ప్పంటూ నెటిజ‌న్ల‌తో పాటు కొంద‌రు సెలిబ్రిటీలు ట్వీట్స్‌, కామెంట్లు పెడుతోన్నారు. టాలీవుడ్ తీరును త‌ప్పుప‌డుతున్నారు. ఈ వివాదంపై జాన్వీ క‌పూర్‌ను స‌పోర్ట్ చేస్తూ ఆషికా రంగ‌నాథ్‌, డింపుల్ హ‌య‌తితో పాటు మ‌రికొంద‌రు హీరోయిన్లు పోస్ట్‌లు పెట్టారు. హీరోయిన్ల‌ను కాకుండా ద‌ర్శ‌కుల‌ను నిల‌దీయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. జాన్వీ రోల్‌లో విమ‌ర్శ‌లు ఎక్కువైపోవ‌డంతో చివ‌ర‌కు బుచ్చిబాబు సానా దిగొచ్చారు. క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డ‌మే కాకుండా సినిమా నుంచి ఆ సీన్ల‌ను తొల‌గిస్తాన‌ని అన్నారు.

టాలీవుడ్‌లో మాత్ర‌మే కాకుండా...

పెద్ది వివాదంపై హీరోయిన్ నిత్యామీన‌న్ కూడా స్పందించింది. హీరోయిన్ల‌ను గ్లామ‌ర్ డాల్స్‌గా చూపించే సంస్కృతి టాలీవుడ్‌లో మాత్ర‌మే కాకుండా అన్ని ఇండ‌స్ట్రీల‌లో ఉంద‌ని అన్న‌ది. హీరోయిన్ల‌పైనే నిత్యామీన‌న్ సెటైర్లు వేసింది. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో కూడిన పాత్ర‌ల్లోనే కొంద‌రు హీరోయిన్లు ఎక్కువ‌గా క‌నిపించ‌డంతో ద‌ర్శ‌కులు కూడా వారిని అలాగే స్క్రీన్‌పై చూపిస్తున్నార‌ని నిత్యా మీన‌న్ తెలిపింది.

అవాస్త‌వం...

"హీరోయిన్ల‌ను కేవ‌లం గ్లామ‌ర్ కోస‌మే సినిమాల్లో తీసుకునే ట్రెండ్ టాలీవుడ్‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌న్న‌ది పూర్తిగా అవాస్త‌వం. ఈ విష‌యంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను త‌ప్పుప‌ట్ట‌డం స‌రికాదు. అన్ని ఇండ‌స్ట్రీల‌లో ఇదే ప‌రిస్థితి ఉంది. క‌థానాయిక‌ల‌ను గ్లామ‌ర‌స్‌గా చూపిస్తేనే సినిమాలు చూడ‌టానికి జ‌నాలు వ‌స్తార‌నే అపోహ‌లో మేక‌ర్స్‌ ఉంటున్నారు. సినిమాలు అతిగా క‌మ‌ర్షియ‌లైజ్ కావ‌డం వ‌ల్ల స‌క్సెస్ కోసం కొన్ని సార్లు ద‌ర్శ‌కులు హ‌ద్దులు దాటుతున్నారు" నిత్యా మీన‌న్ చెప్పింది.

నో చెప్పాను...

"గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో కొంద‌రు ద‌ర్శ‌కులు న‌న్ను అప్రోచ్ అయ్యారు. నేను చేయ‌లేన‌ని చెప్పా. వాటి వ‌ల్ల పెద్ద సినిమాల్లోనే అవ‌కాశాలు కోల్పోయాను. కానీ స్టార్‌డ‌మ్ కంటే నేను న‌మ్మిన సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉండ‌ట‌మే ముఖ్య‌మ‌ని అనిపించింది. ఇష్టానికి వ్య‌తిరేకంగా ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు నో చెప్ప‌గ‌ల‌గాలి . కానీ ఎలాగైనా నేను టాప్ హీరోయిన్ అయిపోవాల‌ని, టాప్ స్టార్స్ సినిమాల్లో అవ‌కాశాలు రావాల‌ని కొంద‌రు హీరోయిన్లు ప్రాధాన్య‌త లేని పాత్ర‌లైనా అంగీక‌రిస్తున్నారు. మొదటి నుంచి కమర్షియల్ సినిమాలు చేస్తూ, ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌ల్లోనే క‌నిపిస్తూ...స‌డెన్‌గా అలాంటి పాత్ర‌లు చేయ‌లేనంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. ఇండ‌స్ట్రీలో ఏదైనా హీరోయిన్ల వ్య‌క్తిగ‌త ఇష్టాల‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది" అని నిత్యా మీన‌న్ అన్న‌ది.

 

Advertisement
Advertisement