త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karthika Deepam Doctor Babu | కార్తీక దీపం డాక్ట‌ర్ బాబు రెమ్యూన‌రేష‌న్ – తెలుగు సీరియ‌ల్ యాక్ట‌ర్స్‌లో హ‌య్యెస్ట్ – ఒక్కో ఎపిసోడ్‌కు ఎంతంటే?

తెలుగు సీరియ‌ల్ యాక్ట‌ర్స్‌లో నిరుప‌మ్ ప‌రిటాల హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్నారు. కార్తీక దీపం సీక్వెల్ సీరియ‌ల్ కోసం ఒక్కో ఎపిసోడ్‌కు న‌ల‌భై వేల నుంచి యాభై వేల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నారు నిరుప‌మ్ ప‌రిటాల‌.

N

Entertainment | Published On Jan 12, 2026, 3.57 pm IST

Karthika Deepam Doctor Babu | కార్తీక దీపం డాక్ట‌ర్ బాబు రెమ్యూన‌రేష‌న్ – తెలుగు సీరియ‌ల్ యాక్ట‌ర్స్‌లో హ‌య్యెస్ట్ – ఒక్కో ఎపిసోడ్‌కు ఎంతంటే?
Advertisement

Karthika Deepam Doctor Babu | తెలుగు సీరియ‌ల్స్‌లో టాప్ యాక్ట‌ర్ గా కొన‌సాగుతోన్నారు నిరుప‌ల్ ప‌రిటాల‌. కార్తీక దీపం సీరియ‌ల్ నిరుప‌మ్ ప‌రిటాల‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సీరియ‌ల్‌లో డాక్ట‌ర్ బాబు పాత్రతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ఈ సీరియ‌ల్‌లోని పాత్ర పేరే అత‌డి ఇంటిపేరుగా మారిపోయింది. అంత‌లా కార్తీక దీపం హిట్టైంది.
ప్ర‌స్తుతం కార్తీక దీపం సీరియ‌ల్‌కు సీక్వెల్ తెర‌కెక్కుతోంది. కార్తీక దీపం ఇది న‌వ వ‌సంతం పేరుతో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియ‌ల్ స్టార్ మాలో టీఆర్‌పీ రేటింగ్‌లో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉంది. కార్తీక దీపంలోని పాత్ర‌ల‌ను తీసుకొని మ‌రో కొత్త క‌థ‌తో మేక‌ర్స్ ఈ సీరియ‌ల్‌ను రూపొందిస్తున్నారు.

ఒక్కో ఎపిసోడ్‌కు...

కార్తీక దీపం ఇది న‌వ వ‌సంతం సీరియ‌ల్ కోసం నిరుప‌మ్ ప‌రిటాల సినిమాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఒక్కో ఎపిసోడ్‌కు న‌ల‌భై నుంచి యాభై వేల మ‌ధ్య ఛార్జ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. కార్తీక దీపం సీక్వెల్ ద్వారానే అత‌డు నెల‌కు ఎనిమిది ల‌క్ష‌ల నుంచి 12 ల‌క్ష‌ల మ‌ధ్య రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు స‌మాచారం.
తెలుగులో ఒక్కో ఎపిసోడ్‌కు అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్న సీరియ‌ల్ యాక్ట‌ర్స్‌లో ఒక‌రిగా నిరుప‌మ్ ప‌రిటాల కొన‌సాగుతోన్నారు. నిరుప‌మ్ ప‌రిటాల మొత్తం ఆస్తుల విలువ 15 కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం.యాక్ట‌ర్‌గానే కాకుండా నిర్మాత‌గా కూడా కొన‌సాగుతోన్నాడు. ఓమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ప‌లు సీరియ‌ల్స్ నిర్మించాడు.కార్తీక దీపం కంటే ముందు తెలుగులో చాలానే సీరియ‌ల్స్ చేశాడు. 2006లో వ‌చ్చిన చంద్ర‌ముఖి సీరియ‌ల్‌లో నిరుప‌మ్ ప‌రిటాల కెరీర్ ప్రారంభ‌మైంది.
మావి చిగురు, క‌న్యాదానం, గృహ‌ప్ర‌వేశం, అత్తారింటికి దారేది, ప్రేమ‌, హిట్ట‌ర్ గారి పెళ్లాం, రాధ‌కు నీవేరా ప్రాణంతో పాటు ప‌లు సీరియ‌ల్స్ లీడ్ రోల్స్ చేశాడు. నిరుప‌మ్ ప‌రిటాల భార్య మంజుల ప‌రిటాల కూడా సీరియ‌ల్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. చంద్ర‌ముఖి సీరియ‌ల్‌లో నిరుప‌మ్‌తో పాటు మంజుల న‌టించింది. ఈ సీరియ‌ల్‌లోనే ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డ‌టంతో పెళ్లి చేసుకున్నారు. సీరియ‌ల్స్ తో పాటు తెలుగులో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు చేశాడు నిరుప‌మ్ ప‌రిటాల‌.

Advertisement

తాజావార్తలు

Advertisement