Telugu Serial Actress | విడాకులు తీసుకున్న అగ్నిసాక్షి సీరియల్ హీరోయిన్
అగ్నిసాక్షి సీరియల్ గౌరి పాత్రతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది ఐశ్వర్య పిస్సే. స్టార్‌మాలో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ పెద్ద హిట్టయ్యింది. అగ్నిసాక్షి వచ్చిన పాపులారిటీతో తెలుగులో కస్తూరి, ముక్కుపుడక సీరియల్స్‌లో ఛాన్స్‌లు దక్కించుకుంది ఐశ్వర్య.
Naresh N
Entertainment | Published On Oct 13, 2026, 7.41 pm IST

ఐశ్వర్య పిస్సే యాక్టింగ్ జర్నీ కన్నడ సీరియల్స్‌తో మొదలైంది. అనురూప, పునర్ వివాహ, సర్వమంగళ మాంగళ్యే సీరియల్స్‌తో కన్నడ నాట ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగింది.

తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి అభిమానులకు పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పింది ఐశ్వర్య. భర్త హరివినయ్‌తో వైవాహిక బంధానికి తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించింది.

గత ఏడాదిన్నరగా ఇద్దరం వేర్వేరుగా ఉంటున్నామని, ఎంతో ఆలోచించిన తర్వాతే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నామని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఐశ్వర్య పిస్సే ఓ పోస్ట్ పెట్టింది.

హరివినయ్‌తో ఏడేళ్ల క్రితం ఐశ్వర్య పెళ్లి జరిగింది. హరివినయ్ తెలుగు సీరియల్ నటి నవ్యస్వామికి సోదరుడు అవుతాడు.

మనస్పర్థల కారణంగానే ఈ జంట విడాకులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విడాకుల గురించి చాలా రోజులుగా సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి.

సీరియల్స్‌తో పాటు కన్నడంలో సంతు, శ్రీకాంతతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది ఐశ్వర్య పిస్సే.

ఐశ్వర్య పిస్సేకు సోషల్ మీడియాలో భారీగానే ఫాలోవర్లు ఉన్నారు.
తాజావార్తలు
- ●Obstruction of Dalits | ఈ గుడి మేం కట్టించాం.. మీరెలా వస్తారు.. దళితులను అడ్డుకున్న ఎమ్మెల్యే మేనమామ
- ●Kranthi Kiran | సింగూర్‌ను ఖాళీ చేయించిన ఘనత మంత్రి దామోదరదే
- ●Sobhita Dhulipala | పెళ్లైనా తగ్గేదేలే - శోభిత ధూళిపాళ బోల్డ్ ఫొటోషూట్
- ●AI Impact on Indian Jobs | 20 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్.. ఆటోమేషన్ ముప్పులో యువత
- ●L Murugan resigns Union Minister | కూలీల కొడుకును కేంద్ర మంత్రిని చేశారు.. ఇక చాలు : నన్ను మంత్రి పదవి నుంచి తప్పించండి
- ●DK Shivakumar Kurta Row | డీకే శివకుమార్ కుర్తా పట్టుకుని లాగిన రాహుల్ గాంధీ : వీడియో వైరల్

Obstruction of Dalits | ఈ గుడి మేం కట్టించాం.. మీరెలా వస్తారు.. దళితులను అడ్డుకున్న ఎమ్మెల్యే మేనమామ

Kranthi Kiran | సింగూర్‌ను ఖాళీ చేయించిన ఘనత మంత్రి దామోదరదే

Sobhita Dhulipala | పెళ్లైనా తగ్గేదేలే - శోభిత ధూళిపాళ బోల్డ్ ఫొటోషూట్

AI Impact on Indian Jobs | 20 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్.. ఆటోమేషన్ ముప్పులో యువత


