Raakaasaa Movie Review | రాకస మూవీ రివ్యూ – నిహారిక కొణిదెల హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన హారర్ కామెడీ మూవీ రాకస శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Entertainment | Published On Apr 3, 2026, 11.07 am IST
Rakasa Movie Review | మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ మూవీ రాకస. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాతో మానస శర్మ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రామ్‌చరణ్‌తో పాటు పలువురు అగ్ర హీరోలు ప్రమోషన్స్‌లో భాగం కావడంతో ఈ చిన్న సినిమా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన రాకస ఎలా ఉంది? ప్రొడ్యూసర్‌గా నిహారిక ఈ సినిమాతో విజయాన్ని అందుకుందా? మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ హారర్ కామెడీ మూవీతో ఆడియెన్స్‌ను మెప్పించాడా? లేదా? అంటే?
రాకవరం రాక్షసుడి కథ...
రాకవరం ఊరిని చాలా ఏళ్లుగా రాక్షసుడు పట్టిపీడిస్తుంటాడు. అతడిని చంపాలని రాజులు చేసిన ప్రయత్నాలేవి ఫలించవు. ఆకాశం నుంచి ఓ ఉల్క పడిన రోజు ఆ రాక్షసుడికి నరబలి ఇవ్వాలని తాళపత్రగ్రంథాల్లో రాజులు రాస్తారు. లేదంటే ఊరు మొత్తం నాశనం అవుతుందని వాటిలో ఉంటుంది. రాక్షసుడు ఉండే కోట వైపు వెళ్లడానికి జనాలు భయపడతారు.
అదే ఊరికి చెందిన ఈరబాబు అలియాస్ వీర (సంగీత్ శోభన్) తాను ప్రేమించిన అమ్మాయి కోసం రాకవరం వస్తాడు. కానీ ఆ అమ్మాయి వీరను మోసం చేస్తుంది. ఆ బ్రేకప్ బాధ నుంచి సుబ్బలక్ష్మితో (నయన్ సారిక) పాటు స్నేహితులు బాలరాజు (గెటప్ శీను) సహాయంతో బయటపడతాడు. సోము (వెన్నెలకిషోర్) అనే వ్యక్తిని వీర మర్డర్ చేసినట్లుగా ఆరోపణలు రావడంతో పోలీసులు అతడి పాస్‌పోర్ట్ తీసుకుంటారు. అదే టైమ్‌లో ఆకాశం నుంచి ఉల్క పడటంతో రాక్షసుడికి బలి కోసం వీర స్నేహితుడు బాలరాజు పేరును ఊరు ప్రజలు ఖరారు చేస్తారు. బాలరాజు బదులు వీర కోటలోపలికి వెళ్లాల్సివస్తుంది. అలా ఎందుకు జరిగింది? ఆ కోటలో నిజంగానే రాక్షసుడు ఉన్నాడా? వీర చంపాడని అనుకున్న సోము కోటలో ఏం చేస్తున్నాడు? వీరను ప్రేమించిన సుబ్బలక్ష్మి...బాలరాజుతో కలిసి కోటలోకి ఎలా వచ్చింది? రాక్షసుడిని చంపితేనే కోట నుంచి బయటపడటానికి ఆస్కారం ఉందని తెలిసి వీర ఏం చేశాడు? అన్నదే ఈ మూవీ కథ.
హారర్ కామెడీ ట్రెండ్....
ఒకప్పుడు టాలీవుడ్‌లో హారర్ కామెడీ సినిమాల ట్రెండ్ బాగా నడిచింది. అనగనగా ఓ దయ్యం...దానిని చూసి హీరో అండ్ గ్యాంగ్ భయపడటం...ఈ క్రమంలో జనరేట్ అయ్యే కామెడీతో అప్పట్లో వారానికి ఓ సినిమా థియేటర్లలోకి వచ్చాయి. ఈ రొటీన్ స్టోరీస్ బోర్ కొట్టడంతో ఆడియెన్స్‌తో పాటు డైరెక్టర్స్ హారర్ కామెడీ కథలను పక్కనపెట్టారు.
లాంగ్ గ్యాప్ తర్వాత ఈ జానర్‌లో వచ్చిన మూవీ రాకస. రెగ్యులర్ హారర్ కామెడీ సినిమాలా కాకుండా ఓ ఫాంటసీ ఎలిమెంట్‌ను మిక్స్ చేసి దర్శకురాలు మానస శర్మ ఈ కథను రాసుకున్నారు. ఓ కోటలో రాక్షసుడు.. అతడిని అంతం చేయాలని ప్రయత్నించి విఫలమైన ఎందరో రాజులు... ఎక్కడో అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఓ యువకుడు రాక్షసుడి పీడను ఎలా వదిలించాడు అన్నదే ఈ సినిమా కథ.
హిలేరియస్‌గా...
ఈ సింపుల్ పాయింట్‌ను హిలేరియస్ కామెడీతో దర్శకురాలు మానస శర్మ స్క్రీన్‌పై ఆవిష్కరించారు. ఓ వైపు భయపెడుతూనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా నవ్విస్తుంది. సంగీత్ శోభన్, గెటప్ శీను, వెన్నెలకిషోర్ కామెడీ టైమింగ్ వల్ల డైరెక్టర్ రాసుకున్న సీన్లలోని ఫన్ మరింత ఎలివేట్ అయ్యింది. వీరబాబు బ్రేకప్ లవ్‌స్టోరీతో పాటు తనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ హీరో ఇబ్బందులు పడే సీన్లతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది. మరోవైపు కోటలోని రాక్షసుడి కథను కూడా చూపిస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఓ ముసలాడిని కాపాడబోయి వీరు కోటలోకి వెళ్లాల్సివచ్చే సీన్లు నవ్విస్తాయి.
సెకండాఫ్ కథ మొత్తం కోటలోనే కథ సాగుతుంది. ఓవైపు రాక్షసుడు...మరోవైపు దయ్యాలను చూసి హీరోహీరోయిన్లు జడుసుకోవడం...ఆ భయాన్ని కవర్ చేయడానికి వారు హడావిడి నుంచి చక్కటి కామెడీని రాబట్టుకున్నారు. రాక్షసుడికి, ఓ చిన్నారికి మధ్య ఉన్న బంధాన్ని ఆవిష్కరిస్తూ సింపుల్ ఎమోషన్స్‌తో సినిమాను ఎండ్ చేశారు డైరెక్టర్.
కథ లేకుండా...
ఫస్ట్ హాఫ్ కథే లేకుండా సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కామెడీ పరంగా దర్శకురాలు ఆకట్టుకున్న హారర్ ఎలిమెంట్స్ విషయంలో కొత్తగా ఆలోచించలేదు. రాక్షసుడి పాయింట్ మొదలుపెట్టిన తీరు బాగున్నా....ఎండింగ్‌కు వచ్చేసరికి హడావిడిగా ముగించినట్లుగా అనిపిస్తుంది.
కామెడీ టైమింగ్
సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ బాగుంది . అతడి వన్ లైనర్ పంచ్‌లు వర్కవుట్ అయ్యాయి. చివరి వరకు కామెడీ విషయంలో అదే టెంపోను కొనసాగించారు. నయన్ సారిక చాలా పద్దతిగా కనిపించింది. గెటప్ శీను, వెన్నెలకిషోర్ ఇద్దరూ పోటీపడి కామెడీని పంచారు. బ్రహ్మాజీ, తనికెళ్లభరణి, రోహిణితో పాటు మిగిలిన వారి నటన ఓకే.
అనుదీప్ దేవ్ బీజీఎమ్ బాగుంది. సినిమా మొత్తం ఒకే ఊరిలో సాగుతుంది. తక్కువ బడ్జెట్ అయిన క్వాలిటీ పరంగా నిర్మాత నిహారిక కొణిదెల రాజీపడలేదు.
రాకస డీసెంట్ హారర్ కామెడీ మూవీ. వినోదాన్ని ఆశించి థియేటర్‌లో అడుగుపెట్టిన ఆడియెన్స్‌ను మాత్రం డిసపాయింట్ చేయలేదు.
రేటింగ్ : 3/5
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



