OTT | ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోన్న మెగా డాటర్ తెలుగు హారర్ కామెడీ మూవీ
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తెలుగు హారర్ కామెడీ మూవీ రాకాస ఓటీటీలో అదరగొడుతోంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ మూవీ నాన్ ఇంగ్లీష్ మూవీస్ కేటగిరీలో టాప్ టెన్ ట్రెండింగ్ మూవీస్‌లో ఏడో ప్లేస్‌లో నిలిచింది.
Entertainment | Published On May 10, 2026, 1.19 pm IST
OTT | మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన రాకాస మూవీ థియేటర్లలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఓటీటీలో సేమ్ సీన్‌ను రిపీట్ చేస్తోంది. రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోంది. రాకాస మూవీలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ హారర్ కామెడీ మూవీతో మానస శర్మ డైరెక్టర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
నెట్‌ఫ్లిక్స్‌లో...
ఇటీవలే రాకాస మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోంది. నెట్ ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్ మూవీస్ కేటగిరీలో టాప్ టెన్ మూవీస్‌లో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఏడు రోజుల్లోనే 1.2 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఓటీటీలో సూపర్ హిట్‌గా రాకాస నిలిచినట్లు మేకర్స్ వెల్లడించారు.
పది కోట్ల బడ్జెట్...21 కోట్ల కలెక్షన్స్...
పది కోట్ల బడ్జెట్‌తో రాకాస మూవీని ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించింది. థియేటర్లలో ఈ మూవీ 21 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను పది కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాతో నిర్మాతగా నిహారిక కొణిదెలకు భారీగానే లాభాలు దక్కాయి.
కామెడీ టైమింగ్...
సోషియా ఫాంటసీ ఎలిమెంట్స్‌కు కామెడీని జోడించి దర్శకురాలు మానస శర్మ రాకాస మూవీని రూపొందించింది. సంగీత్ శోభన్, వెన్నెలకిషోర్ గెటప్ శీను కామెడీ టైమింగ్‌తో పాటు హారర్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. రాకాస మూవీకి అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందించాడు.
ప్రేమించిన అమ్మాయి కోసం...
రాకవరానికి చెందిన ఈరబాబు అలియాస్ వీర (సంగీత్ శోభన్) తాను ప్రేమించిన అమ్మాయి కోసం అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి వీరను మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఆ బ్రేకప్ బాధ నుంచి సుబ్బలక్ష్మితో (నయన్ సారిక) పాటు స్నేహితుడు బాలరాజు (గెటప్ శీను) సహాయంతో బయటపడతాడు. రాకవరంలో ఊరి పొలిమేరలో ఉన్న కోటలో బ్రహ్మరాక్షసుడు ఉన్నట్లుగా వేల ఏళ్లుగా ప్రచారం జరుగుతుంటుంది. రాక్షసుడికి నరబలి ఇచ్చే ఆచారం ఉంటుంది. ఆ నరబలి కోసం వీర స్నేహితుడు బాలరాజు పేరును ఊరు ప్రజలు ఖరారు చేస్తారు. బాలరాజు బదులు వీర కోటలోపలికి వెళ్లాల్సివస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Adobe | ఇక చాట్ జీపీటీలో ఫొటోషాప్.. అడోబ్ కొత్త ప్లగిన్.. ఎలా ఉపయోగించాలంటే..?
- ●Ponnam Prabhakar | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే హైదరాబాద్ ఆరోగ్యంగా ఉంటుంది
- ●Womens Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ Vs రిజుజు.. ఎక్స్ వేదికగా మాటల యుద్ధం
- ●RBI | లోన్ రికవరీ పేరుతో వేధింపులకు చెక్.. ఏజెంట్లకు ఆర్బీఐ కొత్త రూల్స్..
- ●Harish Rao | 2 లక్షల ఉద్యోగాలిస్తే.. 150 హైడ్రా పోస్టుల కోసం వేలాది మంది నిలబడాల్సి వచ్చేదా?
- ●HYDRAA | ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి.. హైడ్రా ఉద్యోగర్థుల పట్ల అధికారుల ఫైర్

Adobe | ఇక చాట్ జీపీటీలో ఫొటోషాప్.. అడోబ్ కొత్త ప్లగిన్.. ఎలా ఉపయోగించాలంటే..?

Ponnam Prabhakar | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే హైదరాబాద్ ఆరోగ్యంగా ఉంటుంది

Womens Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ Vs రిజుజు.. ఎక్స్ వేదికగా మాటల యుద్ధం

RBI | లోన్ రికవరీ పేరుతో వేధింపులకు చెక్.. ఏజెంట్లకు ఆర్బీఐ కొత్త రూల్స్..






