Anasuya | అనసూయపై కేసు.. వ్యాఖ్యలపై తగ్గేదేలేదంటున్న నటి
Anasuya | ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మం, ‘జై శ్రీరామ్’ నినాదం పేరుతో కొందరు అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Entertainment | Published On Aug 17, 2026, 5.37 pm IST
Anasuya | ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మం, ‘జై శ్రీరామ్’ నినాదం పేరుతో కొందరు అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్‌స్టేషన్‌లో అనసూయపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. అనసూయ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికలపై బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించిన వారు.. ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా..
తనపై కేసు నమోదైన నేపథ్యంలో అనసూయ స్పందించింది. తాను చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేయడం ఒక్కటే కాకుండా.. వ్యక్తుల ప్రవర్తన, నైతిక విలువలు కూడా ముఖ్యమేనని చెప్పడమే తన ఉద్దేశమని వివరించింది. తాను సనాతన ధర్మాన్ని గౌరవిస్తానని అనసూయ పేర్కొంది. శ్రీరాముడితో పాటు ఆంజనేయ స్వామిని భక్తితో ఆరాధిస్తానని చెప్పింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేస్తున్న వారిపై ఆమె ఘాటుగా స్పందించింది. తాను మాట్లాడిన మాటలతో అసలు విషయాలు, విమర్శల వెనుక ఉన్న వ్యక్తులు బయటపడుతున్నారంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంతో అనసూయ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాతో పాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ram Temple Donations Case | రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు వేగవంతం చేయాలి
- ●Oven | ఇంట్లో ఓవెన్‌ను వాడుతున్నారా.. ఈ తప్పులు చేయొద్దు..
- ●Allu Arjun | అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ మూవీ లాంఛ్ అప్పుడేనా? - పాన్ ఇండియన్ రేంజ్లో ఈవెంట్!
- ●UP Judge | యూపీ జడ్జి సంచలనం.. నాలుగు నెలల్లోనే 22 మందికి మరణశిక్ష
- ●TTD | తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్.. రేపే ఆర్జిత సేవల టికెట్ల రిలీజ్..!
- ●BJP New National Team | బీజేపీ కొత్త కార్యవర్గం: తెలంగాణకు బిగ్ షాక్.. ఏపీకి మూడు కీలక పదవులు!

Ram Temple Donations Case | రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు వేగవంతం చేయాలి

Oven | ఇంట్లో ఓవెన్‌ను వాడుతున్నారా.. ఈ తప్పులు చేయొద్దు..

Allu Arjun | అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ మూవీ లాంఛ్ అప్పుడేనా? - పాన్ ఇండియన్ రేంజ్లో ఈవెంట్!

UP Judge | యూపీ జడ్జి సంచలనం.. నాలుగు నెలల్లోనే 22 మందికి మరణశిక్ష




