Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్‌ల ప్రచారం.. నేడు ఈడీ ముందుకు రాజా సాబ్ హీరోయిన్
Nidhhi Agerwal | ఆన్లైన్ బెట్టింగ్ (Betting App), గేమింగ్ యాప్‌ల (Rajasaab Gaming APP) ప్రచారంలో సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్రపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు.
Nidhhi Agerwal | త్రినేత్ర.న్యూస్: ఆన్లైన్ బెట్టింగ్ (Betting App), గేమింగ్ యాప్‌ల (Rajasaab Gaming APP) ప్రచారంలో సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్రపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఈడీ అధికారుల ఎదుట బుధవారం (ఆగస్టు 19న) హాజరుకానున్నారు. ఆమె బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ స్టేట్మెంట్ను ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు.

ఈ కేసులో రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత సుభాష్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లతో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తం 29 మందిపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. మియాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సెలబ్రిటీలు ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రమోట్ చేశారని, వాటి ద్వారా ప్రజలను డబ్బులు పెట్టేలా ప్రోత్సహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా ప్లాట్‌ఫామ్‌లను ప్రచారం చేసినందుకు సెలబ్రిటీలకు జరిగిన చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలు, వాటికి సంబంధించిన మనీలాండరింగ్ కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.


సంబంధిత వార్తలు

Nidhhi Agerwal | ఎట్టకేలకు ఓ ఛాన్స్ – పౌరాణిక సినిమాలో నిధి అగర్వాల్ – లేడీ ఓరియెంటెడ్ జానర్‌తో ప్రయోగం
ఆగస్టు 18, 2026

Nidhhi Agerwal | పెళ్లికి తొందరేం లేదు – వెడ్డింగ్ రూమర్లపై రాజాసాబ్ హీరోయిన్ క్లారిటీ
జులై 9, 2026

Nidhhi Agerwal | పాపం నిధి అగర్వాల్.. కెరీర్ ట్రాక్‌లో పడేనా..?
మే 20, 2026
తాజావార్తలు
- ●Stock Markets | ఆసియా మార్కెట్ల పతనం.. సెన్సెక్స్, నిఫ్టీలలో నష్టాలు..
- ●Auto Bandh | ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్లు బంద్
- ●Danam Nagender | బీఆర్ఎస్కి రాజీనామా చేయలే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే: దానం నాగేందర్
- ●Massive Fire | హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. వైద్యం కోసం వచ్చిన బంగ్లాదేశీయులు 9 మంది మృతి
- ●Restaurant Food | రెస్టారెంట్ ఫుడ్ తిని ఐదేండ్ల చిన్నారి మృతి.. దవాఖానలో మరో నలుగురు
- ●Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 30 మంది కార్మికులు సజీవసమాధి

Stock Markets | ఆసియా మార్కెట్ల పతనం.. సెన్సెక్స్, నిఫ్టీలలో నష్టాలు..

Auto Bandh | ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్లు బంద్

Danam Nagender | బీఆర్ఎస్కి రాజీనామా చేయలే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే: దానం నాగేందర్

Massive Fire | హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. వైద్యం కోసం వచ్చిన బంగ్లాదేశీయులు 9 మంది మృతి



