త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ఆసియా మార్కెట్ల పతనం.. సెన్సెక్స్, నిఫ్టీల‌లో నష్టాలు..

Stock Markets | అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా భారత స్టాక్ మార్కెట్లు బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో నష్టాలను చవిచూశాయి. బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ దిగువకు పయనించాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 166.19 పాయింట్లు నష్టపోయి 77,070.93 వద్దకు చేరింది.

S

Business | Published On Aug 19, 2026, 10.44 am IST

Stock Markets | ఆసియా మార్కెట్ల పతనం.. సెన్సెక్స్, నిఫ్టీల‌లో నష్టాలు..
Advertisement

Stock Markets | అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా భారత స్టాక్ మార్కెట్లు బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో నష్టాలను చవిచూశాయి. బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ దిగువకు పయనించాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 166.19 పాయింట్లు నష్టపోయి 77,070.93 వద్దకు చేరింది. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 59 పాయింట్లు పడిపోయి 24,096.75 వద్ద ట్రేడైంది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగాయి.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

ప్రపంచ చమురు మార్కెట్‌ల‌లో కీలకమైన బ్రెంట్ క్రూడ్ ధర 0.67 శాతం పెరిగి బ్యారెల్‌కు 91.63 అమెరికన్ డాలర్లకు చేరింది. అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక 60 రోజుల కాల్పుల విరమణ గడువు ఎలాంటి ముఖ్యమైన దౌత్యపరమైన పురోగతి లేకుండానే ముగియడం ఆందోళనకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇంధన సరఫరాలో దీర్ఘకాలిక అంతరాయాలపై భయాలు పెరిగి ముడి చమురు ధరలు మరింత పెరిగాయి. అలాగే దీర్ఘకాలిక అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ కూడా పలు సంవత్సరాల గరిష్ఠ స్థాయిలకు చేరుకోవడం మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతోంది. భౌగోళిక రాజకీయ పరిణామాలపై స్పష్టత లేకపోవడంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పీ ఏకంగా 5.59 శాతం కుప్పకూలింది. జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ సూచీలు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి. హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ మాత్రం స్వల్ప లాభంతో కొనసాగింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి మ‌రోమారు బ‌ల‌హీన‌ప‌డింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.73 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 0.07 శాతం మేర న‌ష్ట‌పోయింది.

Advertisement
Advertisement