Massive Fire | హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. వైద్యం కోసం వచ్చిన బంగ్లాదేశీయులు 9 మంది మృతి
Massive Fire | పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో (Kolkata) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఒక హోటల్‌లో భారీగా మంటలు (Massive Fire) చెలరేగాయి.
Massive Fire | త్రినేత్ర.న్యూస్: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో (Kolkata) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఒక హోటల్‌లో భారీగా మంటలు (Massive Fire) చెలరేగాయి. దీంతో 9 మంది మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. వారంత బంగ్లాదేశ్‌కు చెందినవారని, దవాఖానలో చికిత్స కోసం వచ్చారని అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్ నుంచి వైద్యం కోసం వచ్చిన (Bangladeshi Nationals) పలువురు కోల్‌కతాలోని మిర్జా గాలిబ్ స్ట్రీట్‌లో ఉన్న ఓ హోటల్‌లో బస చేశారు. అంతా నిద్రలో ఉండగా రాత్రి 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు హోటల్‌లోని పలు ప్రాంతాలకు వ్యాపించి దట్టమైన పొగ అలుముకున్నది. దీంతో తొమ్మిది మంది మరణించారు. పొగ పీల్చుకోవడంతో పలువురు స్పృహ కోల్పోయారు.

మంటలను ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మంటలకు ఏసీలో పేలుడే కారణమని అధికారులు ప్రాథమికంగా (AC explosion) నిర్ధారించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నెల 17న బీర్‌భూమ్ జిల్లాలోని తారాపీఠ్‌లో (Tarapith) ఉన్న ఓ హోటల్‌లో కూడా అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసందే. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో హోటల్ బిదేశినిలోని (Hotel Bideshini) గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న రిసెప్షన్‌లో మొదలైన మంటలు.. భవనమంతా వ్యాపించాయి. దీంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
- ●Restaurant Food | రెస్టారెంట్ ఫుడ్ తిని ఐదేండ్ల చిన్నారి మృతి.. దవాఖానలో మరో నలుగురు
- ●Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 30 మంది కార్మికులు సజీవసమాధి
- ●BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
- ●Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
- ●Horoscope | ఆగస్టు 19 రాశిఫలాలు.. ఈ రాశివారు మోసపోయే అవకాశం!
- ●Bariatric Surgery Delhi | 16 ఏళ్లకే 275 కిలోల బరువు.. కారులో పట్టక వ్యాన్‌లో ఆసుపత్రికి: ఢిల్లీ బాలుడికి అరుదైన సర్జరీ

Restaurant Food | రెస్టారెంట్ ఫుడ్ తిని ఐదేండ్ల చిన్నారి మృతి.. దవాఖానలో మరో నలుగురు

Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 30 మంది కార్మికులు సజీవసమాధి

BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి






