Nidhhi Agerwal | పాపం నిధి అగర్వాల్.. కెరీర్ ట్రాక్‌లో పడేనా..?
Nidhhi Agerwal | టాలీవుడ్‌లో గ్లామర్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజ్ సంపాదించిన హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. సినీ పరిశ్రమలో టాలెంట్ ఒక్కటే సరిపోదని, అదృష్టం కూడా కలిసి రావాలని చెప్పే మాట ప్రస్తుతం ఆమె కెరీర్‌ను చూస్తే నిజమే అనిపిస్తోంది. అందం, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ నిధికి మాత్రం స్టార్‌డమ్ దక్కించుకోలేకపోతున్నది. వ
Entertainment | Published On May 20, 2026, 6.18 pm IST
Nidhhi Agerwal | టాలీవుడ్‌లో గ్లామర్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజ్ సంపాదించిన హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. సినీ పరిశ్రమలో టాలెంట్ ఒక్కటే సరిపోదని, అదృష్టం కూడా కలిసి రావాలని చెప్పే మాట ప్రస్తుతం ఆమె కెరీర్‌ను చూస్తే నిజమే అనిపిస్తోంది. అందం, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ నిధికి మాత్రం స్టార్‌డమ్ దక్కించుకోలేకపోతున్నది. వరుసగా అవకాశాలు వస్తున్నట్టే వచ్చి చేజారిపోవడం, భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు నిరాశపరచడం ఆమె కెరీర్‌ను గందరగోళంలోకి నెట్టేశాయి. నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిధి అగర్వాల్.. తొలి సినిమాతోనే గ్లామర్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, నిజమైన బ్రేక్ మాత్రం రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తోనే వచ్చింది. ఆ సినిమాలో ఆమె గ్లామర్, ఎనర్జీ యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో నిధి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని అప్పట్లో చాలా మంది భావించారు. కానీ, నిధి కెరీర్ ఆశించిన దిశగా సాగలేదు.
బడా హీరోల సినిమాల్లో..
పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయని అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఆమె జోరు తగ్గిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా ప్రయత్నాలు చేసినా సరైన హిట్ మాత్రం దక్కలేదు. కొన్ని సినిమాలు రిలీజ్‌కే ఇబ్బందులు పడగా, మరికొన్ని బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరిచాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటించినా నిధి కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని భావించారు. పోస్టర్లు, పాటల్లో నిధి లుక్‌కి మంచి స్పందన వచ్చినా, సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఆమెకు రావాల్సిన మైలేజ్ కూడా రాలేదనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపించింది. ఇక ‘మిరాయ్’ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్‌పై కూడా నిధి చాలా నమ్మకం పెట్టుకుందట. ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ అయితే కెరీర్ మళ్లీ ట్రాక్‌లో పడుతుందని భావించినట్లు టాక్. కానీ, చివరికి సినిమా ఎడిటింగ్‌లోనే ఆ సాంగ్ తీసేయడంతో మరోసారి ఆమెకు నిరాశే మిగిలింది. విడుదలకు ముందే హాట్ టాపిక్‌గా మారిన ఆ పాట తెరపై కనిపించకపోవడంతో అభిమానులు కూడా నిరుత్సాహానికి గురయ్యారు.
నిరాశ పరిచిన రాజాసాబ్..
ఈ పరిస్థితుల్లోనే నిధి ఆశలన్నీ ది రాజాసాబ్ సినిమాపైనే పెట్టుకుంది. ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటించింది. కనిపించింది. టీజర్ విడుదలైనప్పుడు ప్రభాస్‌తో ఆమె కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ లాంటి హీరోయిన్లు ఉన్నప్పటికీ నిధికే సినిమాలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనే ప్రచారం జరిగింది. దీంతో ఈ సినిమా తన కెరీర్‌ను మళ్లీ నిలబెడుతుందని నిధి భారీ ఆశలు పెట్టుకుందనే వార్తలు వినిపించాయి. ఈ మూవీ రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో నిధికి మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు పడుతున్న నిధికి ఈ మూవీ బ్రేక్ ఇస్తుందనుకున్నా పూర్తిగా నిరాశ కలిగించింది.
ప్రాజెక్టుల్లేవు..
ప్రస్తుతం నిధి చేతిలో పెద్దగా ప్రాజెక్టులేమీ లేవని తెలుస్తోంది. రాజాసాబ్ సమయంలో మూడు సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పినా.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేకపోవడం గమనార్హం. గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, కెరీర్‌ను నిలబెట్టే బలమైన హిట్ మాత్రం ఆమెకు దొరకడం లేదు. మరోవైపు నిధి అగర్వాల్‌కు ఇంకా యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఫిట్‌నెస్ పరంగా ఆమెకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. సరైన కథ, బలమైన పాత్ర దొరికితే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వగల సామర్థ్యం ఆమెకు ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ, ప్రస్తుతం మాత్రం వరుస నిరాశలతో నిధి కెరీర్ కాస్త సంక్షోభంలో పడినట్టే కనిపిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్‌ల ప్రచారం.. నేడు ఈడీ ముందుకు రాజా సాబ్ హీరోయిన్
ఆగస్టు 19, 2026

National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రండి.. గవర్నర్‌ను ఆహ్వానించిన ప్రతినిధులు
ఆగస్టు 18, 2026

Ntr | సొంత బ్యానర్ లాంఛ్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్ – భార్యకు బాధ్యతలు?
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ముడి చమురు ధరల ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం..
- ●Raja Singh | తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు.. అందుకే జాతీయ కార్యవర్గంలో ఒక్కరికీ చోటు దక్కలే: ఎమ్మెల్యే రాజాసింగ్
- ●Stock Markets | ఆసియా మార్కెట్ల పతనం.. సెన్సెక్స్, నిఫ్టీలలో నష్టాలు..
- ●Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్‌ల ప్రచారం.. నేడు ఈడీ ముందుకు రాజా సాబ్ హీరోయిన్
- ●Auto Bandh | ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్లు బంద్
- ●Danam Nagender | బీఆర్ఎస్కి రాజీనామా చేయలే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే: దానం నాగేందర్

Gold And Silver Prices Today | ముడి చమురు ధరల ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం..

Raja Singh | తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు.. అందుకే జాతీయ కార్యవర్గంలో ఒక్కరికీ చోటు దక్కలే: ఎమ్మెల్యే రాజాసింగ్

Stock Markets | ఆసియా మార్కెట్ల పతనం.. సెన్సెక్స్, నిఫ్టీలలో నష్టాలు..

Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్‌ల ప్రచారం.. నేడు ఈడీ ముందుకు రాజా సాబ్ హీరోయిన్



