త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nidhhi Agerwal | నిధి అగ‌ర్వాల్‌కు గోల్డెన్ ఛాన్స్.. మాస్ మహారాజాతో రొమాన్స్‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు, ప్ర‌భాస్ రాజాసాబ్ సినిమాలు నిధి అగ‌ర్వాల్‌కు నిరాశ‌నే మిగిల్చాయి. ఈ డిజాస్ట‌ర్ల త‌ర్వాత తెలుగులో నిధి అగ‌ర్వాల్ మ‌రో గోల్డెన్ ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

N

Entertainment | Published On Apr 19, 2026, 4.47 pm IST

Nidhhi Agerwal | నిధి అగ‌ర్వాల్‌కు గోల్డెన్ ఛాన్స్.. మాస్ మహారాజాతో రొమాన్స్‌
Advertisement

Nidhhi Agerwal |  ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్ వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసినా నిధి అగ‌ర్వాల్‌కు ల‌క్కు మాత్రం క‌లిసిరాలేదు. ఈ ఇస్మార్ట్ బ్యూటీ హీరోయిన్‌గా న‌టించిన‌ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుతో పాటు రాజాసాబ్ డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. ఈ సినిమాల‌ కోసం దాదాపు ఐదేళ్లు టైమ్ కేటాయించింది. ప్ర‌మోష‌న్స్ గ‌ట్టిగానే చేసింది. గ్లామ‌ర్‌తోనూ మెప్పించింది. తాను తీసుకున్న రెమ్యూన‌రేష‌న్‌కు మించి హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు, రాజాసాబ్ కోసం నిధి అగ‌ర్వాల్ క‌ష్ట‌ప‌డింది. కానీ ఈ అమ్మ‌డి రాత‌ను ఈ రెండు సినిమాలు మార్చ‌లేక‌పోయాయి. ఈ ప‌రాజ‌యాల‌తో నిధి అగ‌ర్వాల్‌పై ఐరెన్ లెగ్ ముద్ర‌ప‌డింది. రాజా సాబ్ త‌ర్వాత నిధి నెక్స్ట్ మూవీ ఏద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

బాల‌కృష్ణ‌తో అనుకొని...

తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ ఓ గోల్డెన్ ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. బాల‌కృష్ణ‌తో డైరెక్ట‌ర్‌ గోపీచంద్ మ‌లినేని ఓ హిస్టారిక‌ల్‌ సినిమా చేయాల‌ని ప్లాన్ చేశారు. అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. కానీ బ‌డ్జెట్ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేదు. బాల‌కృష్ణ మూవీ ప్లేస్‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో గోపీచంద్ మ‌లినేని ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యార‌ట‌. ఇటీవ‌లే ర‌వితేజ‌ను క‌లిసిన గోపీచంద్ మ‌లినేని ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను వినిపించిన‌ట్లు స‌మాచారం. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు సిద్ధం చేసిన క‌థ న‌చ్చ‌డంతో ర‌వితేజ ఈ సినిమాకు ఓకే చెప్పార‌ట‌.

నిధి ఫిక్స్‌...

ఇందులో ర‌వితేజ‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. రాజాసాబ్‌, హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు రిజ‌ల్ట్‌ల‌తో సంబంధం లేకుండా హీరోయిన్‌గా నిధిని మేక‌ర్స్ ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం. ర‌వితేజ, నిధి అగ‌ర్వాల్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇది.

నాలుగో సినిమా....

ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబోలో మాత్రం ఇది నాలుగోది. ర‌వితేజ హీరోగా న‌టించిన డాన్ శీనుతోనే డైరెక్ట‌ర్‌గా గోపీచంద్ మ‌లినేని కెరీర్ మొద‌లైంది. ఆ త‌ర్వాత బ‌లుపు, క్రాక్ సినిమాలు చేశారు. ఇవ‌న్నీ సూప‌ర్ హిట్స్‌గా నిలిచాయి.
ప్ర‌స్తుతం ఇరుముడి సినిమా చేస్తున్నారు ర‌వితేజ‌. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో ప్రియా భ‌వానీ శంక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Advertisement
Advertisement