త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nidhhi Agerwal | అప్పుడు హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు – ఇప్పుడు రాజాసాబ్ – నిధి అగ‌ర్వాల్ త‌గ్గేదేలే

ప్ర‌భాస్ రాజాసాబ్ ప్ర‌మోష‌న్స్‌లో నిధి అగ‌ర్వాల్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఈ హార‌ర్ కామెడీ మూవీలో నిధి అగ‌ర్వాల్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నా వారు ప్ర‌మోష‌న్స్‌లో క‌నిపించ‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది

a

Entertainment | Published On Dec 23, 2025, 3.47 pm IST

Nidhhi Agerwal | అప్పుడు హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు – ఇప్పుడు రాజాసాబ్ – నిధి అగ‌ర్వాల్ త‌గ్గేదేలే
Advertisement

Nidhhi Agerwal | రాజాసాబ్ ప్ర‌మోష‌న్స్‌లో నిధి అగ‌ర్వాల్ దూసుకుపోతుంది. ఈ సినిమా ఈవెంట్స్‌,సాంగ్ లాంఛెస్‌ల‌లో ఎక్క‌డ చూసినా ఈ బ్యూటీనే క‌నిపిస్తోంది. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన రాజాసాబ్ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిలీజ్‌కు ఇర‌వై రోజులు కూడా టైమ్ లేదు. అయినా మేక‌ర్స్ మాత్రం ప్ర‌మోష‌న్స్ స్పీడు పెంచ‌క‌పోవ‌డం అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.
రీసెంట్‌గా రాజాసాబ్‌ నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌ల‌కు నిధి అగ‌ర్వాల్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఈ సాంగ్ రిలీజ్ వేడుక‌ల‌తో పాటు రాజాసాబ్ ప్ర‌మోష‌న్స్‌కు సంబంధించి గ‌త కొద్ది రోజులుగా జ‌రిగిన అన్ని వేడుక‌ల్లో నిధి అగ‌ర్వాల్ మాత్ర‌మే క‌నిపించింది.
రాజాసాబ్‌లో నిధి అగ‌ర్వాల్‌తో పాటు మాళ‌వికా మోహ‌న‌న్‌, రిద్ది కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. సంజ‌య్‌ద‌త్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌తో పాటు టాలీవుడ్ క‌మెడియ‌న్లు చాలా మంది సినిమాలో న‌టించారు. నిధి అగ‌ర్వాల్ మిన‌హా మిగిలిన హీరోయిన్లు, యాక్ట‌ర్లు ఎవ‌రూ కూడా రాజాసాబ్ ప్ర‌మోష‌న్స్‌లో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. నిధి మాత్ర‌మే ఎక్కువ‌గా హైలైట్ అవుతోంది. సినిమా కోసం ఎంత చేయాలో అంత చేస్తుంది. అవ‌కాశం ఉన్న ప్ర‌తి చోట స్పెస్ క‌ల్పించుకొని మ‌రీ రాజాసాబ్‌ను ప్ర‌మోట్ చేస్తుంది.

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టైమ్‌లో ...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టైమ్‌లో కూడా నిధి అగ‌ర్వాల్ ఇలానే క‌ష్ట‌ప‌డింది. సినిమా ప్ర‌చార భారం మొత్తాన్ని సింగిల్‌గా మోసింది. రిలీజ్ రోజు వ‌ర‌కు ప్ర‌మోష‌న్స్‌లో చాలా యాక్టివ్‌గా క‌నిపించింది. నిధి అగ‌ర్వాల్ అంకిత‌భావానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఫిదా అయ్యారు. నిధిని క‌ష్టాన్ని చూసే తాను ప్ర‌మోష‌న్స్‌కు రావాల్సివ‌చ్చింద‌ని అన్నారు. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు డిజాస్ట‌ర్‌గా నిలివ‌డంతో నిధి శ్ర‌మ మొత్తం వృథాగా మారింది.
హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా రాజాసాబ్ ప్ర‌చారంలో త‌గ్గేదేలే అంటూ నిధి అగ‌ర్వాల్ దూసుకుపోతుంది. ఈ సారి ఆమె క‌ష్టానికి త‌గ్గ రిజ‌ల్ట్ రావాల‌ని అభిమానులు కోరుతున్నారు. రాజాసాబ్ సినిమాను ప్ర‌భాస్ కంటే నిధి అగ‌ర్వాలే ఎక్కువ‌గా ప్ర‌మోట్ చేస్తుంద‌ని కామెంట్స్ పెడుతున్నారు.
మ‌రోవైపు రాజాసాబ్ రిజ‌ల్ట్ నిధి అగ‌ర్వాల్ కెరీర్‌కు కీల‌కంగా మారింది. నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నిధి అగ‌ర్వాల్‌. ఇప్ప‌టివ‌ర‌కు మిస్ట‌ర్ మ‌జ్జు, ఇస్మార్ట్ శంక‌ర్‌, హీరోతో పాటు హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాలు చేసింది. వీటిలో ఇస్మార్ట్ శంక‌ర్ మిన‌హా మిగిలిన సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచింది. ఈ ప‌రాజ‌యాల‌కు రాజాసాబ్‌తో పుల్‌స్టాప్ పెట్టాల‌ని భావిస్తోంది నిధి అగ‌ర్వాల్‌.

Advertisement

తాజావార్తలు

Advertisement