త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nidhhi Agerwal | నిధి అగ‌ర్వాల్‌కు చేదు అనుభ‌వం – రాజాసాబ్ హీరోయిన్‌తో ఫ్యాన్స్ అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌

Nidhhi Agerwal | రాజాసాబ్ సాంగ్ (Rajasaab) లాంఛ్ ఈవెంట్‌లో నిధి అగ‌ర్వాల్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. సాంగ్ లాంఛ్ ఈవెంట్ ముగించుకొని బ‌య‌ట‌కు వెళుతున్న క్ర‌మంలో అభిమానులు ఒక్క‌సారిగా ఆమెను చుట్టుముట్టారు. కొంద‌రు నిధి అగ‌ర్వాల్‌తో అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు.

N

Entertainment | Published On Dec 18, 2025, 8.48 am IST

Nidhhi Agerwal | నిధి అగ‌ర్వాల్‌కు చేదు అనుభ‌వం – రాజాసాబ్ హీరోయిన్‌తో ఫ్యాన్స్ అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌

Finance and money: loans, credit cards, LIC, savings schemes, stock basics, gold investment, insurance.​

Advertisement

Nidhhi Agerwal | రాజాసాబ్ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో నిధి అగ‌ర్వాల్‌కు (Nidhhi Agerwal) చేదు అనుభ‌వం ఎదురైంది. అభిమానుల తీరుపై నిధి అగ‌ర్వాల్ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. రాజాసాబ్‌లోని స‌హానా సాంగ్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లోని(Hyderabad) లులూ మాల్‌లో మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు నిధి అగ‌ర్వాల్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఈ సాంగ్ లాంఛ్ వేడుక ముగిసిన‌ త‌ర్వాత నిధి అగ‌ర్వాల్ బ‌య‌ట‌కు వెళుతున్న క్ర‌మంలో పెద్ద ఎత్తున ఆమెను అభిమానులు చుట్టు ముట్టారు. బాడీ గార్డ్స్ వారిస్తున్న విన‌కుండా కొంద‌రు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో తోపులాట జ‌రిగింది. కొంద‌రు అభిమానులు నిధి అగ‌ర్వాల్‌పై చేతులు వేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఓ అభిమాని ఏకంగా ఆమెను తోసేశాడు. గుంపులు గుంపులుగా మీద ప‌డి నిధి అగ‌ర్వాల్‌కు ఊపిరి ఆడ‌కుండా చేశారు. ఆమె డ్రెస్‌ను లాగేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. అభిమానుల‌ను కంట్రోల్ చేయ‌డంలో బాడీ గార్డ్స్ విఫ‌ల‌మ‌య్యారు.
అతి క‌ష్టంగా జ‌నాల గుంపును త‌ప్పించుకొని నిధి అగ‌ర్వాల్ కారు ఎక్కింది. అభిమానుల అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌తో నిధి అగ‌ర్వాల్ చాలా ఇబ్బంది ప‌డింది. వారిపై అగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కారులో కూర్చున్న త‌ర్వాత త‌న డ్రెస్‌ను స‌ర్ధుకుంది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చాలా మంది నెటిజ‌న్లు అభిమానుల తీరును త‌ప్పుప‌డుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లో జ‌రిగే ఇలాంటి ఈవెంట్స్‌కు అటెండ్ అయ్యేముందు సెలిబ్రిటీస్ ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిదంటూ కామెంట్స్ పెడుతున్నారు. సెక్యూరిటీ ప‌రంగా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.
ఈ ఏడాది హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది నిధి అగ‌ర్వాల్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఈ సినిమా కోసం మూడేళ్లు ఎదురుచూసింది. కానీ థియేట‌ర్ల‌లో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో నిధి అగ‌ర్వాల్‌కు నిరాశే మిగిలింది. ఈ ముద్దుగుమ్మ ఆశ‌ల‌న్నీ రాజాసాబ్‌పైనే ఉన్నాయి. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement