Ott Releases This Week | ఈ వారం ఓటీటీలో రిలీజైన తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – ఒక్కోటి ఒక్కో జానర్
ఈ వారం ఓటీటీలో డిఫరెంట్ జానర్స్‌తో కూడిన తెలుగు సినిమాలు, వెబసిరీస్‌లు రిలీజయ్యాయి. సుమంత్ న్యూటన్స్ థర్డ్‌లా, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పార్ట్ టైమర్స్ వెబ్‌సిరీస్‌తో పాటు ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏవంటే?
Entertainment | Published On Aug 28, 2026, 2.07 pm IST
Ott Releases This Week | ఈ వారం థియేటర్లలో టాక్సిక్ మినహా పెద్ద సినిమాలేవి విడుదల కాలేదు. కానీ ఓటీటీలో మాత్రం ఏకంగా ఇరవై వరకు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లో రిలీజయ్యయి. వీటిలో కొన్ని తెలుగు సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి. అవి ఏవంటే?
న్యూటన్స్ థర్డ్ లా
సుమంత్ హీరోగా నటించిన న్యూటన్స్ థర్డ్ లా మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో శుక్రవారం రిలీజైంది. రాజేష్ కర్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. కర్మ సిద్ధాంతం ఆధారంగా తెరకెక్కిన న్యూటర్స్ థర్డ్ లా డిఫరెంట్ అటెంప్ట్‌గా నిలిచింది. కానీ కమర్షియల్‌గా మాత్రం సరైన విజయాన్ని దక్కించుకోలేకపోయింది.
కేజీక్యూ
దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా హీరోహీరోయిన్లుగా నటించిన కేజీక్యూ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. సినిమాకు కేకే దర్శకత్వం వహించాడు. సినిమా రిలీజ్ కాకముందే అనారోగ్య కారణాలతో కేకే మరణించారు. ఈ చిన్న సినిమా ప్రమోషన్స్‌లో సందీప్ వంగా పాల్గొనడంతో ఆడియెన్స్‌లో కేజీక్యూ ఆసక్తిని రేకెత్తించింది. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా కేజీక్యూ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోగా నటించిన శశి ఓదెల...ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు సోదరుడు. ఈ సినిమాతోనే హీరోగా పరిచయమయ్యాడు.
హరుడు
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకట్ హీరోగా నటించిన హరుడు ఆహా ఓటీటీ ద్వారా సెలైంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాజ్ తాళ్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా వెంకట్ కనిపించాడు. నటాషా సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఓ పొలిటికల్ లీడర్ అక్రమాలను నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ ఎలా అడ్డుకున్నాడనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
పార్ట్ టైమర్స్
బిగ్‌బాస్ ఫేమ్ తనూజ, జ్జానేశ్వరి కాండ్రేగుల ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్‌సిరీస్ పార్ట్ టైమర్స్ జియో హాట్‌స్టార్‌లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సంపత్ కుమార్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. తమ కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో ఓ ఇద్దరు యువతులకు ఎదురైన సంఘటనలతో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ వెబ్‌సిరీస్ రూపొందింది.
ఆకలి రాజ్యం
కమల్‌హాసన్ సూపర్ హిట్ టైటిల్‌తో తెరకెక్కిన ఆకలిరాజ్యం వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ వెబ్‌సిరీస్‌లో వికాస్ వశిష్ట, గీత్ సైని కీలక పాత్రలు పోషించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Toxic Movie | టాక్సిక్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఓటీటీ రైట్స్ విషయంలో దారుణంగా..!
సెప్టెంబర్ 7, 2026

Jio Hotstar | జియోహాట్‌స్టార్ గ్లోబల్ ఎంట్రీ.. 3 దేశాల్లో సేవలు ప్రారంభం
సెప్టెంబర్ 2, 2026

OTT | 5 కోట్ల బడ్జెట్ – 130 కోట్ల కలెక్షన్స్ – విజయ్, రష్మిక బ్లాక్‌బస్టర్ మూవీ … ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●Students Attack | 30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..
- ●MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్
- ●Balmoor Venkat | బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..
- ●Ponnam Prabhakar | తెలంగాణ ప్రజలకు లైఫ్‌లైన్ ఆర్టీసీ.. జాగ్రత్తగా విలీన ప్రక్రియ: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●BRS | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తన.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం!

Students Attack | 30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..

MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్

Balmoor Venkat | బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..



