Trisha | త్రిషకు విజయ్ ప్రభుత్వం వీఐపీ ట్రీట్‌మెంట్ – నెటిజన్ల ట్రోలింగ్
ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రిషకు విజయ్ ప్రభుత్వం వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సే నో టూ త్రిష పేరుతో నెటిజన్లు చేస్తోన్న ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి. త్రిషకు పోలీసులు బాడీగార్డుల్లా పనిచేయడానికి ఆమె ఏమైనా మినిస్టారా? అంటూ పోస్ట్‌లో పెడుతున్నారు.
Entertainment | Published On Aug 16, 2026, 5.59 pm IST
Trisha | చెన్నై క్వీన్ త్రిషకు విజయ్ టీవీకే ప్రభుత్వం వీఐపీలా రాచ మర్యాదలు చేయడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సే నో టూ త్రిష ( Say No To Trisha)అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో సీఎం విజయ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. విజయ్ తల్లిదండ్రులతో కలిసి మొదటి వరుసలో త్రిష కూర్చొని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిలకించింది.
బాడీగార్డ్‌లా...
ఈ వేడుకల్లో త్రిషకు బాడీగార్డ్‌లా ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ రక్షణ కల్పించింది. ఇండిపెండెన్స్ డే వేడుకలు జరిగిన ఫోర్ట్ సెయింట్ జార్జ్‌కు వచ్చిన త్రిషకు అధికారులు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. ఆమెను దగ్గరుండి మొదటి వరుసలో కూర్చొబెట్టారు. స్వాతంత్య్ర దినోవత్స వేడుకల్లో పాల్గొన్న కొందరు టీవీకే మినిస్టర్లు, నాయకులతో పాటు చాలా మంది అధికారులు త్రిష వెనుక వరుసలో కూర్చున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సెల్యూట్...
పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తూ ముందుకు సాగిన సీఎం విజయ్ ... త్రిషకు ప్రత్యేకంగా సెల్యూట్ చేశాడు. త్రిష కూడా విజయ్ స్టైల్‌లోనే తిరిగి అతడికి సెల్యూట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్...
ఇండిపెండెన్స్ డే వేడుకల్లో విజయ్ ప్రభుత్వం త్రిషకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సే నో టూ త్రిష( Say No To Trisha) అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. త్రిషకు పోలీసులు బాడీగార్డుల్లా ఎందుకు పనిచేయాలి. ఆమె మినిస్టరా? క్యాబినేట్ హోదాలో ఈ వేడుకకు అటెండ్ అయ్యిందా? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. విజయ్ తల్లిదండ్రులు అటెండ్ కావడంలో తప్పు లేదు? కానీ త్రిష ఏ హోదాలో ఈ వేడుకలో పాల్గొంది అంటూ ట్వీట్స్ పెడుతున్నారు. సే నో టూ త్రిష పేరుతో నెటిజన్లు చేస్తోన్న ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి. వీటిపై త్రిషతో పాటు టీవీకే ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Asish Banerjee Death | తప్పుడు ఆరోపణలతోనే బలితీసుకున్నారు: ఆశిష్ బెనర్జీ మృతిపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
- ●Amit Shah vs Sonia Gandhi | వందేమాతరం పట్ల ఇంత అవమానమా.. సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: అమిత్ షా
- ●TIMS Sanath Nagar | 1,082 పడకలు.. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు.. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా టిమ్స్ సనత్‌నగర్
- ●CM Revanth Reddy | వేయి స్తంభాల గుడితో పోటీ పడే విధంగా మేడారం అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Ananya Raj | 27 ఏళ్లకే హీరోయిన్ అనన్య రాజ్ కన్నుమూత - నిద్రలోనే మృత్యుఒడికి
- ●Revanth Reddy | మేడారంలో సీఎం రేవంత్ మొక్కులు.. అడవి తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పణ

Asish Banerjee Death | తప్పుడు ఆరోపణలతోనే బలితీసుకున్నారు: ఆశిష్ బెనర్జీ మృతిపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

Amit Shah vs Sonia Gandhi | వందేమాతరం పట్ల ఇంత అవమానమా.. సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: అమిత్ షా

TIMS Sanath Nagar | 1,082 పడకలు.. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు.. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా టిమ్స్ సనత్‌నగర్

CM Revanth Reddy | వేయి స్తంభాల గుడితో పోటీ పడే విధంగా మేడారం అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి






