Toxic Teaser | టాక్సిక్‌లో ఐదుగురు హీరోయిన్లు – టీజర్‌లో మాత్రం ఒక్కరూ లేరు – యశ్ మూవీపై ట్రోల్స్
యశ్ టాక్సిక్ టీజర్ శుక్రవారం రిలీజైంది. భారీ యాక్షన్ సీక్వెన్స్, కలర్‌ఫుల్ విజువల్స్‌గా టీజర్ గ్రాండియర్‌గా ఉంది. టాక్సిక్‌లో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. కానీ టీజర్‌లో ఒక్కరిని చూపించకపోవడంతో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. టాక్సిక్ మూవీకి డైరెక్టర్ గీతూమోహన్‌దాస్‌తో కలిసి యశ్ కథను అందించారు.
Entertainment | Published On Feb 20, 2026, 5.12 pm IST
Toxic Teaser | కేజీఎఫ్ ఫేమ్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ టాక్సిక్. మలయాళ ఫిల్మ్ మేకర్, నేషనల్ అవార్డ్ విన్నర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టాక్సిక్‌లో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు యశ్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 తర్వాత యశ్ నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ కోసం దక్షిణాదితో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు.
మార్చి 19న రిలీజ్...
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న టాక్సిక్ మార్చి 19న రిలీజ్ కాబోతుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ విడుదల చేయబోతున్నారు. టాక్సిక్ టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో కలర్‌ఫుల్‌గా ఉంటూనే మితిమీరిన వయలెన్స్‌తో ఈ టీజర్‌ను కట్ చేశారు. టీజర్‌లో రక్తం ఏరులై పారింది. సర్కస్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లుచెదిరే విజువల్స్‌తో టీజర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈసారి యుద్ధం వేరు.. వాళ్ళ కుతంత్రాలు వేరు.. అందరితో విరోధం పెట్టుకొని బతకలేవు.. పట్టుదల వదిలేయ్.. గివ్ అప్ రాయ అంటూ టీజర్‌లోని డైలాగ్ ఆసక్తిని పంచుతోంది.ఈ టీజర్‌లో రెండు డిఫరెంట్ లుక్‌లలో యశ్ కనిపించారు. పొడవైన గడ్డంతో ఒకటి, క్లీన్ షేవ్‌తో మరో లుక్ కనిపించింది. టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐదుగురు హీరోయిన్లు కానీ...
ఈ టీజర్‌పై విమర్శలు కూడా భారీగానే వస్తోన్నాయి. టాక్సిక్‌లో నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా తో పాటు హ్యుమా ఖురేషి హీరోయిన్లుగా నటించారు. ఐదుగురు హీరోయిన్లు ఉన్నా ఒక్కరిని టీజర్‌లో చూపించలేదు. కేవలం యశ్ క్యారెక్టర్ మాత్రమే కనిపించడంపై ఆయా హీరోయిన్ల ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. లేడీ డైరెక్టర్ మూవీలోనే హీరోయిన్లకు అన్యాయం జరిగిందని అంటున్నారు.
కేజీఎఫ్ హ్యాంగోవర్...
మరోవైపు కేజీఎఫ్‌తో టాక్సిక్‌కు భారీగా పోలికలు వస్తున్నాయి. విజువల్స్, యాక్షన్ సీన్లు కేజీఎఫ్‌ను గుర్తుకు తెస్తున్నాయని, కేజీఎఫ్ హ్యాంగోవర్... నుంచి యశ్ ఇంకా బయటపడలేదని ట్వీట్స్ చేస్తున్నారు. ఈ టీజర్‌లో మలయాళ నటుడు టోవినో థామస్ జోకర్ గెటప్‌లో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అతడే ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడని అంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

NTR | ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం దేవుడిచ్చిన వరం.. పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్..
మే 20, 2026

Kiara Advani | టాక్సిక్‌లో బోల్డ్ సీన్ల రచ్చ.. రూమర్లకు చెక్ పెట్టిన కియారా అద్వానీ
మే 4, 2026

Rukmini Vasanth | ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్కు “నో” చెప్పిన సాయిపల్లవి – కన్నడ బ్యూటీకి ఛాన్స్
ఏప్రిల్ 26, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



