Janhvi Kapoor | పెద్దిలో జాన్వీ కపూర్ రోల్‌పై దారుణంగా ట్రోల్స్ – శ్రీదేవి కూతురికి అవమానం అంటూ నెటిజన్ల కామెంట్స్
పెద్దిలో జాన్వీ కపూర్ రోల్‌ను చూపించిన తీరుపై నెటిజన్ల నుంచి దారుణంగా విమర్శలు వస్తున్నాయి. జాన్వీ పాత్ర డైలాగ్స్, రామ్‌చరణ్‌తో ఆమె కెమిస్ట్రీలో బూతులు ఎక్కువైయ్యాయని ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో జాన్వీ ఇచ్చిన ఓ పాత ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Entertainment | Published On Jun 5, 2026, 4.53 pm IST
Janhvi Kapoor | రామ్‌చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మొదటిరోజే 135 కోట్ల వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్‌చరణ్ యాక్టింగ్, క్రికెటర్, రెజ్లర్గా అతడి ట్రాన్స్‌ఫర్మేషన్ బాగున్నాయంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్‌ను మాత్రం అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టర్‌కు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదని, కేవలం గ్లామర్ కోసమే ఆమెను తీసుకున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. జాన్వీ పాత్రను చూపించిన తీరుతో పాటు బూతు డైలాగ్స్ ఆమెతో చెప్పించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతోన్నాయి. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో నిండిపోయిందని అంటున్నారు.
హీరోయిన్‌కు అవమానం...
ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ హీరోయిన్‌కు ఇంతలా అవమానం జరగలేదని, పెద్దిలో జాన్వీని చాలా అగౌరవంగా చూపించారంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. అతడి ట్వీట్‌ను జాన్వీ లైక్ చేయడం ఆసక్తికరంగా మారింది. నెటిజన్ కామెంట్‌ను లైక్ చేసి ఇన్‌డైరెక్ట్‌గా జాన్వీ మేకర్స్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసిందని, తన పాత్రను సరిగ్గా చూపించలేదనే విమర్శలను ఈ బాలీవుడ్ బ్యూటీ స్వయంగా అంగీకరించిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విమర్శల నేపథ్యంలో పెద్దికి ముందు జాన్వీ కపూర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.
కెమెరా యాంగిల్స్...
బోల్డ్ రోల్స్ చేయడం తనకు ఇష్టం లేదని, గ్లామర్ పాత్రలకే తాను పనికొస్తానని ముద్ర వేయడం వల్ల దర్శకులు కూడా అలాంటి పాత్రల్లోనే తనను చూపిస్తున్నారని జాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది. "కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టాలి? హీరోయిన్లను ఏ విధంగా చూపించాలి అన్నది దర్శకుడు, డీవోపీ చేతుల్లో ఉంటుంది. కానీ సార్లు అభ్యంతరకర రీతిలో యాంగిల్స్ పెడుతుంటారు. అలా చూపించొద్దు...ఇబ్బందిగా ఉంటుందని చెప్పాలనిపిస్తుంది. చెబితే రూడ్‌గా బిహేవ్ చేశానని నిందలు వేస్తారు. కొన్నిసార్లు నా పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తాను. వినకపోతే వదిలేస్తాను.కెరీర్‌లో అలాంటి ఇబ్బందులు చాలానే ఎదురయ్యాయి" అని జాన్వీ అన్నది. పెద్దిని గురించే జాన్వీ ఈ కామెంట్స్ చేసిందని నెటిజన్లు అంటోన్నారు.
సంబంధిత వార్తలు

Peddi Day 1 Collection | రామ్‌చరణ్ పెద్ది ఫస్ట్ డే కలెక్షన్స్ – దేవర , పుష్ప 2 కంటే తక్కువే
జూన్ 5, 2026

Telugu OTT | గత వారం థియేటర్లలో….ఈ వారం ఓటీటీలో – అవికా గోర్ తెలుగు రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే!
జూన్ 4, 2026

Janhvi Kapoor | పెద్ది రిలీజ్ వేళ – తిరుమలలో జాన్వీ కపూర్ సందడి – కాలినడకన శ్రీవారి దర్శనం
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Dasoju Sravan Kumar | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది
- ●Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు.. మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్
- ●Krithi Shetty | టాలీవుడ్లోకి కృతి శెట్టి కమ్ బ్యాక్ - రొమాంటిక్ సీన్లతో షూటింగ్ షురూ
- ●KCR | రెండేళ్లు సహకరించండి.. పాలమూరు బీఆర్ఎస్ నేతలకు సీఎం రిక్వెస్ట్..!
- ●TATA EV | టాటా ఈవీలపై భారీ రాయితీలు.. రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్లు..
- ●CM Revanth Reddy | తిన్నది అరిగేదాక తిరిగండి.. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ సెటైర్లు

Dasoju Sravan Kumar | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది

Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు.. మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్

Krithi Shetty | టాలీవుడ్లోకి కృతి శెట్టి కమ్ బ్యాక్ - రొమాంటిక్ సీన్లతో షూటింగ్ షురూ

KCR | రెండేళ్లు సహకరించండి.. పాలమూరు బీఆర్ఎస్ నేతలకు సీఎం రిక్వెస్ట్..!



