Ramayana vs Varanasi | రామాయణ వర్సెస్ వారణాసి – రాజమౌళిని మించినోడు లేడు…నెటిజన్ల కంపేరిజన్స్ వైరల్
రణభీర్‌కపూర్ రామాయణ గ్లింప్స్‌తో మహేష్‌బాబు వారణాసి గ్లింప్స్‌ను పోలుస్తూ నెటిజన్లు చేస్తోన్న ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి. వారణాసి గ్లింప్స్‌లో డివైన్ ఫీల్ ఉందని, రామాయణ గ్లింప్స్‌మాత్రం ఆర్టీఫీషియల్‌గా సాగిందని అంటున్నారు. రామాయణ మరో ఆదిపురుష్ 2.0 అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Entertainment | Published On Apr 2, 2026, 12.29 pm IST
Ramayana vs Varanasi |ఈ ఏడాది ఇండియన్ సినిమా లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో రామాయణ ఒకటి. రణభీర్‌కపూర్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోన్న ఈ బాలీవుడ్ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా రణభీర్‌కపూర్ రామాయణ గ్లింప్స్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ద్వారా రాముడిగా రణభీర్‌కపూర్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ హంగులతో గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. రణభీర్ లుక్‌తో పాటు బీజీఎమ్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
మిక్స్‌డ్ టాక్...
అయితే రామాయణ గ్లింప్స్‌పై అభిమానుల నుంచి మాత్రం మిక్స్‌డ్ టాక్ వస్తోంది. మహేష్‌బాబు వారణాసి గ్లింప్స్‌తో రామాయణ గ్లింప్స్‌ను కంపేర్ చేస్తూ నెటిజన్లు చేస్తోన్న ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి. ఎమోషన్స్, వాల్యూస్‌కు ప్రతీకగా రామాయణాన్ని చెబుతుంటారని, కానీ రామాయణ గ్లింప్స్‌లో గ్రాఫిక్స్ మినహా ఎమోషన్స్ కనిపించడం లేదు. చాలా ఆర్టీఫీషియల్‌గా ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
మహేష్‌బాబు వారణాసి గ్లింప్స్, విజువల్స్, బీజీఎమ్...ప్రతి ఫ్రేమ్‌లో, డీవైన్ ఫీల్ ఉంటుందని అంటున్నారు. ఎమోషన్స్‌ను పండించడంలో రాజమౌళిని మించినోడు లేడంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఐఏ బెటర్....
వావ్ అనుకునే మూవ్‌మెంట్స్ ఒక్కటి కూడా రామాయణ గ్లింప్స్‌లో కనిపించలేదని ట్రోల్స్ చేస్తున్నారు. ఎనిమిది ఆస్కార్స్ గెలిచిన సంస్థ వీఎఫ్ఎక్స్ అందించిందని మేకర్స్ పేర్కొన్నారు...కానీ గ్రాఫిక్స్ మొత్తం ఏఐ షాట్స్‌ను తలపిస్తున్నాయంటూ నెటిజన్లు చేసిన ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.
వారణాసి నెక్స్ట్ లెవెల్....
రామాయణ కంటే వారణాసి గ్లింప్స్ సూపర్ అంటూ చెబుతున్నారు. వారణాసికి వంద మార్కులు ఇస్తే రామాయణకు పది కూడా ఇవ్వడం కష్టమేనంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. వారణాసి బడ్జెట్ 1300 కోట్లు అయితే రామాయణ బడ్జెట్ 4000 కోట్లు...కానీ క్వాలిటీ పరంగా వారణాసి నెక్స్ట్ లెవెల్‌లో ఉందని మరో నెటిజన్ అన్నాడు.
ట్రెండింగ్‌లోకి ఆదిపురుష్...
రామాయణ గ్లింప్స్ రిలీజ్ వేళ ప్రభాస్ ఆదిపురుష్ మూవీ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. రామాయణ, ఆదిపురుష్ సినిమాలను కూడా నెటిజన్లు కంపేర్ చేస్తున్నారు. రెండింటి బడ్జెట్, విజువల్స్‌ను పోలుస్తూ నెటిజన్లు చేసిన ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి. రామాయణ...మరో ఆదిపురుష్ 2.0 అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






