Telugu OTT | ఒకే ఓటీటీలోకి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నాని ప్యారడైజ్ – మరికొన్ని తెలుగు సినిమాలు కూడా!
షూటింగ్ కంప్లీట్ కాకముందే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌తో పాటు నాని ది ప్యారడైజ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కన్ఫామ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతున్నాయి.
Entertainment | Published On Jan 16, 2026, 12.49 pm IST
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్, నాని ప్యారడైజ్ సినిమాలు ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. శుక్రవారం తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న అప్‌కమింగ్ తెలుగు మూవీస్ లిస్ట్‌ను నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్‌చేసింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్, నాని ది ప్యారడైజ్‌తో పాటు దుల్కర్ సల్మాన్ ఆకాశంతో ఒక తార, విశ్వక్ సేన్ ఫంకీ, ఫహాద్ ఫాజిల్ డోండ్ ట్రబుల్ ది ట్రబుల్ తో పాటు ఇటీవల రిలీజైన ఛాంపియన్ సినిమాలు తమ ఓటీటీలోనే విడుదల కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ సినిమాల పోస్టర్స్‌ను అభిమానులతో పంచుకుంది.
ఉస్తాద్ భగత్‌సింగ్
గబ్బర్‌సింగ్ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్‌సింగ్ తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఉస్తాద్ భగత్‌సింగ్‌లో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఓజీ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దళపతి విజయ్ హీరోగా నటించిన తమిళ మూవీ తేరీ రీమేక్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందుతోన్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రీమేక్ వార్తలను డైరెక్టర్ హరీశ్ శంకర్ ఖండించారు.
నాని ప్యారడైజ్...
నాని ప్యారడైజ్ మూవీ షూటింగ్ కంప్లీట్ కాకముందే ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. భారీ రేటుకు నెట్‌ఫ్లిక్స్ ప్యారడైజ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కాబోతుంది. ఇందులో సీనియర్ హీరో మోహన్‌బాబు విలన్‌గా నటిస్తున్నారు. కయదు లోహర్ హీరోయిన్‌గా కనిపించబోతున్నది.
విశ్వక్ సేన్ ఫంకీ మూవీకి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార, పహాద్ ఫాజిల్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. మలయాళ హీరోలు నటిస్తున్న ఈ స్ట్రెయిట్ తెలుగు సినిమాలపై తెలుగు ఆడియెన్స్‌లో భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఆకాశంలో ఒక తార మూవీకి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తుండగా...ఫహాద్ ఫాజిల్ మూవీతో శశాంక్ ఏలేటి డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు. ఈ సినిమాలన్నీ ఒకే ఓటీటీలో రిలీజ్ కానుండటం ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



