Jr Ntr | జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ట్విస్ట్ – ఊరువాడతో తనకు సంబంధం లేదన్న యంగ్ టైగర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. వంద కోట్లతో సేవా యజ్ఞం ఊరు వాడ వస్తున్నాం అంటూ ఇటీవల రా ఎన్టీఆర్ (RAW NTR ) అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టిన పోస్ట్‌తో ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం రూమర్లు మొదలయ్యాయి. ఊరువాడ కార్యక్రమంపై ఎన్టీఆర్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ కార్యక్రమంతో తనకు సంబంధం లేదని ఓ ప్రకటనను రిలీజ్ చేశారు.
Entertainment | Published On Jul 14, 2026, 2.43 pm IST
Jr Ntr | జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. వంద కోట్లతో సేవా యజ్ఞం ఊరు వాడ వస్తున్నాం అంటూ ఇటీవల రా ఎన్టీఆర్ (RAW NTR ) అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ ఆదేశాలతోనే ఆయన అభిమానులు చేస్తోన్న సేవా కార్యక్రమిదని ఫ్యాన్స్ భావించారు. యంగ్ టైగర్ రాజకీయ అరంగేట్రానికి సన్నాహకంగా ఈ ఊరువాడ కార్యక్రమం ఉండొచ్చని భావించారు. జూలై 18న తిరుపతిలో జరుగనున్న ఓ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తారని వార్తలొస్తున్నాయి. ఆ రోజే పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.దాంతో ఊరు వాడ కార్యక్రమంపై సినీ వర్గాల్లోనే కాకుండా రాజకీయంగా ఆసక్తి ఏర్పడింది. ఈ కార్యక్రమం గురించి ఎన్టీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ వారికి ఎన్టీఆర్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు
ఎలాంటి సంబంధం లేదు...
రా ఎన్టీఆర్ (RAW NTR) పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్ ఆఫీస్ ఓ అఫీషియల్ ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేసింది. "ఎన్టీఆర్‌తో సంబంధం ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా రా ఎన్టీఆర్ అనే సంస్థ వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఎన్టీఆర్‌కు, ఆయన కార్యాలయానికి , RAW NTR అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదు. ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. ఎన్టీఆర్ పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదు" అని అన్నారు.
ఊహాగానాలను వ్యాప్తి చేయద్దు
అంతే కాకుండా "ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం లేదా ఇతర కార్యకలాపాల గురించిన సమాచారాన్ని ఆయనే నేరుగా వెల్లడిస్తారు. లేదంటే ఎన్టీఆర్ అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారికమైనవిగా పరిగణించవద్దని మనవి. ఈ విషయానికి సంబంధించిన ఎలాంటి అపోహలు, వదంతులు, ఊహాగానాలను వ్యాప్తి చేయద్దు. ఎన్టీఆర్ టీమ్ ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయద్దు అని కోరుతున్నాం" అని తెలిపింది.
డ్రాగన్‌తో బిజీ బిజీ...
ప్రస్తుతం డ్రాగన్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే త్రివిక్రమ్‌తో ఓ మైథాలజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్. లార్డ్ కుమారస్వామి కథతో ఈ మైథాలజీ మూవీ తెరకెక్కుతోంది.
సంబంధిత వార్తలు

Jani Master | మా మధ్య గొడవలు లేవు – శేఖర్ మాస్టర్‌తో వివాదంపై జానీ మాస్టర్ కామెంట్స్
జులై 13, 2026

Tollywood | ఏడడుగులు వేశారు…హిట్టు కొట్టారు – పెళ్లి తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోహీరోయిన్లు వీళ్లే!
జులై 13, 2026

Sreeleela | ఎస్ఎస్ఎస్ – శ్రీలీల డ్రీమ్బాయ్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవేనట!
జులై 13, 2026
తాజావార్తలు
- ●Jason Sanjay | హీరోగా దళపతి విజయ్ కొడుకు - టీవీకే పార్టీ ప్రత్యర్థి నిర్మాత - కోలీవుడ్‌లో కొత్త రూమర్?
- ●DSC Notification | 15 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయండి.. నిరుద్యోగుల డిమాండ్
- ●SIR | తెలంగాణలో 'సర్' గడువు పొడిగించండి.. మంత్రి పొన్నం విజ్ఞప్తి
- ●Private Schools | అడ్డగోలుగా వసూలు చేసిన అధిక ఫీజులను తిరిగి ఇచ్చేయండి.. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
- ●Bharat Future City | భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్.. 15న సీఎం రేవంత్ శంకుస్థాపన
- ●Manideep Reddy Missing | ఫిన్లాండ్లో దొరికిన మృతదేహం మనిదీప్దేనా? డీఎన్ఏ టెస్ట్ చేయాలంటూ జైశంకర్‌కు దత్తాత్రేయ లేఖ!

Jason Sanjay | హీరోగా దళపతి విజయ్ కొడుకు - టీవీకే పార్టీ ప్రత్యర్థి నిర్మాత - కోలీవుడ్‌లో కొత్త రూమర్?

DSC Notification | 15 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయండి.. నిరుద్యోగుల డిమాండ్

SIR | తెలంగాణలో 'సర్' గడువు పొడిగించండి.. మంత్రి పొన్నం విజ్ఞప్తి

Private Schools | అడ్డగోలుగా వసూలు చేసిన అధిక ఫీజులను తిరిగి ఇచ్చేయండి.. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు



