త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jani Master | మా మ‌ధ్య గొడ‌వ‌లు లేవు – శేఖ‌ర్ మాస్ట‌ర్‌తో వివాదంపై జానీ మాస్ట‌ర్ కామెంట్స్‌

డ్యాన్స‌ర్ అసోసియేష‌న్ బై ఎల‌క్ష‌న్స్ విష‌యంలో టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫ‌ర్లు శేఖ‌ర్ మాస్ట‌ర్‌, జానీ మాస్ట‌ర్ మ‌ధ్య విభేదాలు మొద‌లైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రు గొడ‌వ‌లు ప‌డిన కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. ఈ వివాదంపై జానీ మాస్ట‌ర్ క్లారిటీ ఇచ్చారు. శేఖ‌ర్ మాస్ట‌ర్‌తో త‌న‌కు ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని అన్నారు.

N

Entertainment | Published On Jul 13, 2026, 6.12 pm IST

Jani Master | మా మ‌ధ్య గొడ‌వ‌లు లేవు – శేఖ‌ర్ మాస్ట‌ర్‌తో వివాదంపై జానీ మాస్ట‌ర్ కామెంట్స్‌
Advertisement

Jani Master |  తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్స‌ర్స్ అసోసియేష‌న్ బై ఎల‌క్ష‌న్స్ విష‌యంలో టాప్ కొరియోగ్రాఫ‌ర్లు జానీ మాస్ట‌ర్‌, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య విభేదాలు మొద‌లైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆదివారం హైద‌రాబాద్‌లోని డ్యాన్స‌ర్ అసోసియేష‌న్ బిల్డింగ్ వ‌ద్ద శేఖ‌ర్, జానీ మాస్ట‌ర్లు గొడ‌వ ప‌డిన కొన్ని వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. జానీ మాస్ట‌ర్‌కు వ్య‌తిరేకంగా శేఖ‌ర్ మాస్ట‌ర్‌తో పాటు అత‌డి అనుచ‌రులు నినాదాలు చేస్తోన్న వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

చిరంజీవిని కలిశాం...

ఈ వివాదంపై జానీ మాస్ట‌ర్ క్లారిటీ ఇచ్చారు. త‌మ మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లో త‌న భార్య సుమ‌ల‌తతో క‌లిసి జానీ మాస్ట‌ర్ ఓ పాత్రికేయుల స‌మావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సంద‌ర్భంగా జానీ మాస్ట‌ర్ మాట్లాడుతూ "నాకు ఏమైనా ఇబ్బంది ఉందంటే శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌రిగెత్తుకుంటూ వ‌స్తారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ స‌మ‌స్య‌ల్లో ఉంటే నేను వెళ‌తాను. మేము గొడ‌వ‌లు ప‌డిన‌ట్లుగా వ‌చ్చిన వీడియోలు చూసి చిరంజీవి బాధ‌ప‌డ్డారు. చిరంజీవి పిల‌వ‌డంతో నేను, శేఖ‌ర్ మాస్ట‌ర్ సోమ‌వారం ఆయ‌న్ని మెగా 158 సెట్స్ లో క‌లిశాం. మా ఇద్ద‌రితో చిరంజీవి ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ముగ్గురం క‌లిసే భోజ‌నం కూడా చేశాం. నేను, శేఖ‌ర్ గొడ‌వ‌లు ప‌డ్డామ‌ని, మా మ‌ధ్య విభేదాలు ఉన్నాయంటూ వ‌స్తోన్న వార్త‌ల‌న్నీ అబ‌ద్ద‌మే. మిగిలిన మాస్ట‌ర్ల‌తో నాకు ఎలాంటి స‌మ‌స్య‌లు లేవు. మా అసోసియేష‌న్ కు టాలీవుడ్ హీరోలంద‌రి స‌పోర్ట్ ఉంది" అని జానీ మాస్ట‌ర్ అన్నారు.

మేనేజ‌ర్ల వ‌ల్ల అన్యాయం...

మేనేజ‌ర్ల వ‌ల్ల డ్యాన్స‌ర్ల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని జానీ మాస్ట‌ర్ భార్య సుమ‌ల‌త అన్నారు. ప్రొడ్యూస‌ర్లు...డ్యాన్స‌ర్ల‌కు 1500 రెమ్యూన‌రేష‌న్ ఇస్తే... చివరకి డాన్సర్ల‌కు చేరేది 500 మాత్ర‌మేన‌ని సుమ‌ల‌త ఆరోపించారు. మిగిలిన వెయ్యి రూపాయ‌ల‌ను మేనేజ‌ర్లు అన్యాయంగా దోచుకుంటున్నార‌ని చెప్పారు.

రాజీనామా...

ప్ర‌స్తుతం తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్స‌ర్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్‌గా జానీ మాస్ట‌ర్ భార్య సుమ‌ల‌త వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆమె ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు, ఆధిప‌త్య ధోర‌ణి విష‌యంలో మిగిలిన స‌భ్యులు అసంతృప్తిగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సుమ‌ల‌త తీరును నిర‌సిస్తూ ప‌దిమంది స‌భ్యులు రాజీనామా చేసిన‌ట్లు స‌మాచారం. స‌భ్యుల రాజీనామాతో ఫెడ‌రేష‌న్ అనుమ‌తి లేకుండా సుమ‌ల‌త బై ఎల‌క్ష‌న్స్ నిర్వ‌హించ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతోనే శేఖ‌ర్ , జానీ మాస్ట‌ర్ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

 

Advertisement
Advertisement