త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanthara | న‌య‌న‌తార ఫ‌స్ట్ రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే? – సీక్రెట్ రివీల్ చేసిన లేడీ సూప‌ర్ స్టార్‌

ప్ర‌స్తుతం ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న హీరోయిన్ల‌లో నయ‌న‌తార నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో కొన‌సాగుతోంది. ఒక్కో సినిమాకు ప‌న్నెండు కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రిస్తోంది. ఫ‌స్ట్ రెమ్యూన‌రేష‌న్ మాత్రం వేల‌లోనే అందుకుంది. ఈ సీక్రెట్‌ను హాయ్ ప్ర‌మోష‌న్స్‌లో న‌య‌న్ రివీల్ చేసింది.

N

Entertainment | Published On Aug 23, 2026, 9.02 am IST

Nayanthara | న‌య‌న‌తార ఫ‌స్ట్ రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే? – సీక్రెట్ రివీల్ చేసిన లేడీ సూప‌ర్ స్టార్‌
Advertisement

ప్ర‌స్తుతం సౌత్ ఇండ‌స్ట్రీలో రిచెస్ట్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది న‌య‌న‌తార‌. సంపాద‌న‌లోనే కాదు రెమ్యూన‌రేష‌న్‌లో లేడీ సూప‌ర్ స్టార్ టాప్‌లో కొన‌సాగుతోంది. ఒక్కో సినిమాకు ప‌ది నుంచి ప‌న్నెండు కోట్ల మ‌ధ్య రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేస్తోంది. చాలా మందే హీరోయిన్లు ఇండ‌స్ట్రీలో అడుగుపెడుతోన్న రెమ్యూన‌రేష‌న్‌లో న‌య‌న్‌ను మాత్రం బీట్ చేయ‌లేక‌పోతున్నారు.

విల‌న్‌గా...

ఆగ‌స్ట్ నెలాఖ‌రున న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన టాక్సిక్ తో పాటు హాయ్ సినిమాలు రెండు రోజుల గ్యాప్‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. టాక్సిక్‌లో న‌య‌న‌తార విల‌న్‌గా న‌టించ‌గా...హాయ్ సినిమాలో త‌న‌క‌న్న వ‌య‌సులో చిన్న‌వాడైన యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డే మ‌హిళ‌గా క‌నిపించ‌బోతుంది. హాయ్ సినిమాకు న‌య‌న‌తార‌నే ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఫ‌స్ట్ రెమ్యూన‌రేష‌న్‌...

సొంత సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న న‌య‌న‌తార త‌న ఫ‌స్ట్ రెమ్యూన‌రేష‌న్‌ను రివీల్ చేసింది. కాలేజీలో చ‌దువుకుంటుండ‌గా ఓ ఫ్యాష‌న్ షోలో మోడ‌ల్‌గా పాల్గొన్నందుకు రెండు వేలు రెమ్యూన‌రేష‌న్‌గా అందుకున్న‌ట్లు న‌య‌న‌తార చెప్పింది. పాకెట్‌మ‌నీ కోసం మోడ‌ల్‌గా మారిన‌ట్లు వెల్ల‌డించింది. అప్ప‌ట్లో అదే త‌న‌కు పెద్ద మొత్తంలా అనిపించింద‌ని అన్న‌ది.
హీరోయిన్‌గానే కాకుండా రౌడీ పిక్చ‌ర్స్ పేరుతో బ్యాన‌ర్ స్థాపించిన న‌య‌న‌తార త‌న భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌తో క‌లిసి సినిమాలు నిర్మిస్తుంది. కాస్మోటిక్ బ్రాండ్‌కు ఓన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. సినిమాలు, బిజినెస్‌ల‌తో భారీగా సంపాదిస్తోంది. ఆమె మొత్తం ఆస్తుల విలువ రెండు వంద‌ల కోట్ల‌కుపైనే అని స‌మాచారం.

రెండు రోజుల గ్యాప్‌

టాక్సిక్ మూవీ ఆగ‌స్ట్ 26న రిలీజ్ అవుతోంది. య‌శ్ హీరోగా న‌టిస్తున్న ఈ క‌న్న‌డ మూవీలో న‌య‌న‌తార‌తో పాటు రుక్మిణి వ‌సంత్‌, తారా సుతారియా, కియారా అద్వానీ, హ్యుమా ఖురేషి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హాయ్ సినిమాలో న‌య‌న‌తార‌కు జోడీగా కెవిన్ హీరోగా క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమా ఆగ‌స్ట్ 28న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

 

Advertisement
Advertisement