Kajal Aggarwal | నయన్ పోయే…కాజల్ వచ్చే – బాలకృష్ణ సినిమాలో ట్విస్ట్
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాకు ఆరంభం నుంచి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ నయనతార తప్పుకుంది. నయన్ స్థానంలో కాజల్ షూటింగ్‌లోకి అడుగుపెట్టింది.
Entertainment | Published On May 2, 2026, 10.02 am IST
Kajal Aggarwal | బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఎన్‌బీకే 111 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనౌన్స్‌మెంట్ నుంచే ఎన్‌బీకే 111కు అనేక ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. తొలుత హిస్టారికల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కానీ ఓవర్ బడ్జెట్ కారణంగా ఆ కథను పక్కనపెట్టి కమర్షియల్ సినిమా చేయాలని ఫిక్సయ్యారు.
నయన్ ఔట్...
తాజాగా ఈ సినిమాలో మరో మార్పు చోటుచేసుకుంది. ఎన్‌బీకే 111లో హీరోయిన్‌గా నయనతార నటించనున్నట్లు వెల్లడించారు. నయన్ బర్త్‌డే సందర్భంగా ఓ పవర్‌ఫుల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. కానీ షూటింగ్‌లో అడుగుపెట్టకముందే నయన్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. సల్మాన్ ఖాన్ సినిమాతో బిజీగా ఉన్న నయన్ డేట్స్ క్లాష్ కారణంగా బాలకృష్ణ సినిమా నుంచి వైదొలిగినట్లు ప్రచారం జరుగుతోంది. నయన్ స్థానంలో హీరోయిన్‌గా మేకర్స్ కాజల్‌ను ఫైనల్ చేశారు.
షూటింగ్‌లో జాయిన్....
శనివారం నుంచి ఎన్‌బీకే 111 మూవీ షూటింగ్‌లో కాజల్ జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్‌లో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్‌పై కీలక సన్నివేశాలను దర్శకుడు గోపీచంద్ మలినేని చిత్రీకరించబోతున్నారట. మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనున్నట్లు సమాచారం.
భగవంత్ కేసరి తర్వాత....
బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది. వీరిద్దరు కలిసి చేసిన భగవంత్ కేసరి నేషనల్ అవార్డును గెలుచుకుంది. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సక్సెస్ సెంటిమెంట్‌తోనే ఎన్‌బీకే 111లో కాజల్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. 2024లో రిలీజైన సత్యభామ తర్వాత కాజల్ టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. రెండేళ్ల తర్వాత బాలకృష్ణ మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతుంది.
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



