Nayanthara | విలన్ లేకుండా నయనతార సినిమా – తనకంటే ఐదేళ్లు చిన్న హీరోతో రొమాన్స్
లేడీ సూపర్ స్టార్ నయనతార తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన హీరోతో రొమాన్స్ చేయబోతుంది. నయనతార, కెవిన్ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ హాయ్ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతుంది. తనకంటే వయసులో చిన్నవాడైన ఓ యువకుడితో ప్రేమలో పడిన మహిళ కథతో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం.
Entertainment | Published On Jul 21, 2026, 8.41 pm IST
Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు పది రోజుల గ్యాప్‌లో థియేటర్లలోకి రాబోతున్నాయి. ఒకటి తమిళ సినిమా కాగా...మరోటి కన్నడ మూవీ కావడం గమనార్హం. నయనతార, కెవిన్ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ హాయ్ ఆగస్ట్ 14న విడుదల కానుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూనే భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి నయనతార స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తోంది.
కీలక పాత్రలో భాగ్యరాజ్...
ఇటీవల కన్నుమూసిన దర్శకుడు కే భాగ్యరాజ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. ప్రభు, శరత్‌కుమార్, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రలు పోషించారు. విష్ణు ఎడ్విన్ ఈ సినిమాతో దర్శకుడిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవల రిలీజైన హాయ్ మూవీ ఫస్ట్ సింగిల్ మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది.
విలన్....
హాయ్ మూవీలో విలన్ క్యారెక్టర్ ఉండదట. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా వెల్లడించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో హీరోగా నటించిన కెవిన్ కంటే నయనతార వయసు ఐదేళ్లు ఎక్కువ కావడం గమనార్హం. తనకంటే వయసులో చిన్నవాడైన ఓ యువకుడితో ప్రేమలో పడిన మహిళ కథతో ఈ మూవీ రూపొందనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఏజ్ గ్యాప్ కారణంగా వారి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయనే అంశాలతో ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ఉంటుందని సమాచారం. లోకేష్ కనగరాజ్ వద్ద ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలకు విష్ణు ఎడ్విస్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. హాయ్ మూవీతో ఫస్ట్ టైమ్ మెగా ఫోన్ పట్టాడు.
యశ్ టాక్సిక్...
కాగా హాయ్ రిలీజైన పది రోజుల తర్వాత నయనతార హీరోయిన్‌గా నటించిన కన్నడ మూవీ టాక్సిక్ థియేటర్లలోకి రాబోతుంది. ఆగస్ట్ 26న రిలీజ్ అవుతోంది. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నయనతారతో పాటు రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో నయనతార బోల్డ్ రోల్‌లో నటించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rajinikanth | రజనీకాంత్ వర్సెస్ మహేష్‌బాబు – మూడోసారి బాక్సాఫీస్ క్లాష్ – “ధర్మన్” రిలీజ్ డేట్ ఇదే!
నవంబర్ 27, 2026

Sai Pallavi | కొడుకుకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో చియాన్ విక్రమ్ మూవీ.. హీరోయిన్‌గా సాయిపల్లవి!
నవంబర్ 24, 2026

Trisha | త్రిష పేరుతో తమిళనాడులో కొత్త అసోసియేషన్ – రాజకీయ అరంగేట్రానికి సన్నాహాలు షురూ?
నవంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Crime News | అండం దానం ముసుగులో అక్రమ నెట్వర్క్!
- ●Dy CM Bhatti Vikramarka | తెలంగాణ విద్యుత్ రంగానికి కేంద్రం సహకరించాలి
- ●DGP CV Anand | పెట్రోలింగ్ పెంచండి.. ఆస్తి నేరాలకు చెక్ పెట్టండి
- ●Minister Uttam | ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు రూ.10 వేల కోట్లతో ప్రత్యేక కార్యాచరణ
- ●HMDA Truck Parking | సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ.. హెచ్ఎండీఏ వేలం విఫలం!
- ●Telugu OTT | ఓటీటీలోకి సమ్మర్ హాలీడేస్ - స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఫిక్స్

Crime News | అండం దానం ముసుగులో అక్రమ నెట్వర్క్!

Dy CM Bhatti Vikramarka | తెలంగాణ విద్యుత్ రంగానికి కేంద్రం సహకరించాలి

DGP CV Anand | పెట్రోలింగ్ పెంచండి.. ఆస్తి నేరాలకు చెక్ పెట్టండి

Minister Uttam | ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు రూ.10 వేల కోట్లతో ప్రత్యేక కార్యాచరణ



