త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanthara | మీరు మారిపోయారు మేడ‌మ్ – మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు కోసం న‌య‌న‌తార ఫ‌స్ట్ టైమ్‌….

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు కోసం తెలుగులో ఫ‌స్ట్ టైమ్ న‌య‌న‌తార సొంతంగా డ‌బ్బింగ్ చెబుతోన్న‌ట్లు స‌మాచారం. అంతే కాకుండా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో కూడా న‌య‌న్ యాక్టివ్‌గా పాల్గొన‌నున్న‌ట్లు తెలిసింది. చిరంజీవి సినిమా కోసం న‌య‌న‌తార త‌న రూల్స్ అన్నింటిని ప‌క్క‌న‌పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

a

Entertainment | Published On Dec 26, 2025, 2.38 pm IST

Nayanthara | మీరు మారిపోయారు మేడ‌మ్ – మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు కోసం న‌య‌న‌తార ఫ‌స్ట్ టైమ్‌….

నయనతార

Advertisement

Nayanthara |  న‌య‌న‌తార హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇర‌వై ఏళ్లు అవుతోంది. స్టార్ హీరోల‌కు జోడీగా న‌య‌న్ న‌టించిన ప‌లు సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. ఈ విజ‌యాల‌తో నంబ‌ర్ వ‌న్ నాయిక‌గా పేరు తెచ్చుకుంది. అయినా ఈ లాంగ్ జ‌ర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు సొంతంగా తెలుగులో ఏ సినిమాకు డ‌బ్బింగ్ చెప్ప‌లేదు న‌య‌న‌తార‌. కెరీర్ ఆరంభం నుంచి డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌ల‌తోనే నెట్టుకొస్తుంది. చిరంజీవి సినిమాతో ఫ‌స్ట్ టైమ్ తెలుగులో త‌న సొంత గొంతు వినిపించేందుకు రెడీ అయ్యింది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీ సంక్రాంతికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతుంది. ఇందులో మెగాస్టార్‌కు జోడీగా న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రో టాలీవుడ్ అగ్ర హీరో వెంక‌టేష్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. చిరంజీవి, వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డంతో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారుపై తెలుగు నాట భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న ఈ సినిమాల్లో ఎక్కువ‌ బ‌జ్ కూడా ఈ మూవీపైనే ఉంది.

శ‌శిరేఖ పాత్ర కోసం...

ఇటీవ‌లే మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు షూటింగ్‌కు గుమ్మ‌డికాయ కొట్టేశారు మేక‌ర్స్‌. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ట‌. ఇందులో శ‌శిరేఖగా న‌య‌న‌తార క‌నిపించ‌బోతుంది. ఈ పాత్ర కోసం న‌య‌న‌తార తానే సొంతంగా డ‌బ్బింగ్ చెబుతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో ఒక్క సినిమాలో కూడా డ‌బ్బింగ్ చెప్ప‌క‌పోవ‌డంతో న‌య‌న‌తార తొలుత‌ వెన‌క‌డుగు వేసిన‌ట్లు స‌మాచారం. అనిల్ రావిపూడి ప‌ట్టుప‌ట్టి ఆమెను డ‌బ్బింగ్ చెప్ప‌డానికి ఒప్పించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ ప‌నుల‌తో న‌య‌న‌తార బిజీగా ఉన్న‌ట్లు టాక్‌.

ప్ర‌మోష‌న్స్‌లో కూడా...

అంతే కాదు మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు ప్ర‌మోష‌న్స్‌లో కూడా న‌య‌న‌తార పాల్గొన‌నున్న‌ట్లు తెలిపింది. న‌య‌న‌తార సినిమాల ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొని చాలా ఏళ్ల‌య్యింది. తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో తాను న‌టించిన సినిమాల‌కు సంబంధించి ప్రీ రిలీజ్‌లు, ఇంట‌ర్వ్యూల‌తో పాటు ఏ ఈవెంట్‌కు నయ‌న‌తార అటెండ్ కాదు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఈ కండీష‌న్ విష‌యంలో త‌గ్గ‌లేదు. కానీ ఫ‌స్ట్‌ టైమ్ మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ కోసం ఈ రూల్‌ను ప‌క్క‌న‌పెట్ట‌నుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. చిరంజీవితో క‌లిసి కొన్ని స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డ‌మే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు న‌య‌న్ అటెండ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ ప్ర‌మోష‌న్స్‌కు న‌య‌న‌తార స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిల‌వ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. న‌య‌న‌తార‌లో వ‌చ్చిన మార్పు చూసి ఆడియెన్స్ కూడా స‌ర్‌ప్రైజ్ అవుతున్నారు. మీరు మారిపోయారు మేడ‌మ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీ జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. చిరంజీవి కూతురు సుస్మిత‌తో క‌లిసి ప్రొడ్యూస‌ర్ సాహు గార‌పాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement