త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ntr War 2 | ఎన్టీఆర్ వార్ 2 న‌ష్టాల‌పై ఎట్ట‌కేల‌కు ఓపెన్ అయిన నాగ‌వంశీ

వార్ 2 మూవీ న‌ష్టాల‌పై నిర్మాత నాగ‌వంశీ ఎట్ట‌కేల‌కు రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ సినిమాతో తాను పెద్ద‌గా న‌ష్ట‌పోయిందేమి లేద‌ని చెప్పారు. అత‌డి కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

a

Entertainment | Published On Dec 25, 2025, 7.04 pm IST

Ntr War 2 | ఎన్టీఆర్ వార్ 2 న‌ష్టాల‌పై ఎట్ట‌కేల‌కు ఓపెన్ అయిన నాగ‌వంశీ

వార్ 2

Advertisement

Ntr War 2 | వార్ 2 మూవీతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీపై రిలీజ్‌కు ముందు భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌ల‌లో హృతిక్ రోష‌న్‌కు ధీటుగా ఎన్టీఆర్ క‌నిపించారు. గ‌త సినిమాల‌కు భిన్నంగా స్టైలిష్ లుక్‌తో అద‌ర‌గొట్ట‌గాడు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ య‌శ్‌రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించ‌డంతో అన్ని భాష‌ల ఆడియెన్స్ వార్ 2 కోసం ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఈ సినిమాతో బాలీవుడ్‌లో ఎన్టీఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకోవ‌డం ఖాయ‌మంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఈ హిందీ సినిమాకు తెలుగులో భారీ స్థాయిలో బిజినెస్ జ‌రిగింది. భారీ పోటీ మ‌ధ్య నిర్మాత నాగ‌వంశీ వార్ 2 థియేట్రిక‌ల్ రైట్స్‌ను కొనుగోలు చేశారు. భారీగా ప్ర‌మోష‌న్స్ కూడా చేశారు.
కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా వార్ 2 థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఎన్టీఆర్‌, హృతిక్ రోష‌న్ యాక్టింగ్‌తో పాటు యాక్ష‌న్ అంశాలు బాగున్నా పేల‌వ‌మైన కాన్సెప్ట్ కార‌ణంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. తెలుగులో నాగ‌వంశీకి భారీగా న‌ష్టాలు మిగిల్చింది.

సగం వసూళ్లు...

వార్ 2 డిజాస్ట‌ర్ ఎఫెక్ట్‌తో కొన్నాళ్లు నాగ‌వంశీ ఎవ‌రికి క‌నిపించ‌లేదు. అత‌డు దుబాయ్ పారిపోయిన‌ట్లు వార్త‌లు వినిపించాయి. నాగ‌వంశీ పెట్టిన పెట్టుబ‌డిలో వార్‌ 2 మూవీ స‌గం కూడా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. నాగ‌వంశీ మాత్రం అస‌లు క‌లెక్ష‌న్స్ ఎంత‌న్న‌ది ఇన్నాళ్లు బ‌య‌ట‌పెట్ట‌లేదు. తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వార్ 2 న‌ష్టాల‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
వార్ 2 థియేట్రిక‌ల్ రైట్స్‌ను తాను 68 కోట్ల‌కు కొన్న‌ట్లు చెప్పారు. ఈ సినిమా ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో 30 నుంచి 35 కొట్ల‌ వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు చెప్పారు. ముందుగా చేసుకున్న ఒప్పందం మేర‌కు న‌ష్టాల రిక‌వ‌రీ కింద య‌శ్‌రాజ్ ఫిల్మ్స్ 18 కోట్లు వెన‌క్కి ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. వార్ 2 వ‌ల్ల తాను పెద్ద‌గా న‌ష్ట‌పోయింది ఏం లేద‌ని అన్నారు. 2025లో త‌న సినిమాలేవి స‌రిగ్గా ఆడ‌లేద‌ని నాగ‌వంశీ అన్నారు. 2026లో కంటెంట్ సైడ్ త‌ప్పులు లేకుండా చూడాల‌ని అనుకుంటున్న‌ట్లు నాగ‌వంశీ చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement