Nayanthara | తన సినిమాతో తానే పోటీ – రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
నయనతార హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు రెండు రోజుల గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. టాక్సిక్ మూవీ ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా...హాయ్ సినిమా ఆగస్ట్ 28న రిలీజ్ అవుతోంది. తన సినిమాతో తానే నయనతార బాక్సాఫీస్ వద్ద పోటీపడనుండటం ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Aug 7, 2026, 9.43 pm IST
Nayanthara | కెరీర్‌లో ఫస్ట్ టైమ్ తన సినిమాతో తానే బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఆమె హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు...రెండు రోజుల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ఓ సినిమా కన్నడ కాగా...మరోటి తమిళ మూవీ కావడం గమనార్హం. ఈ రెండు సినిమాలో తెలుగులోనూ రిలీజ్ కాబోతుండటం గమనార్హం.
టాక్సిక్...
కేజీఎఫ్ ఫేమ్ యశ్ హీరోగా నటించిన టాక్సిక్ మూవీ ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార ఓ హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆమెతో పాటు రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి కూడా కథానాయికలుగా కనిపించబోతున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీలో గంగ అనే పాత్రలో నయనతార కనిపించబోతుంది. టాక్సిక్‌లో నయనతార పాత్ర బోల్డ్‌గా సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. టాక్సిక్ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ కన్నడ మూవీపై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి.
హాయ్
టాక్సిక్ రిలీజైన రెండు రోజుల తర్వాత నయనతార హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ హాయ్ థియేటర్లలోకి రాబోతుంది. ఆగస్ట్ 28న విడుదల అవుతోంది. తొలుత ఈ సినిమాను ఆగస్ట్ 14న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే కావడంతో హాయ్ మూవీని రెండు వారాల పాటు వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను శుక్రవారం అఫీషియల్‌గా ప్రకటించారు. తనకన్న వయసులో చిన్నవాడైన ఓ యువకుడితో ప్రేమలో పడే మహిళ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కెవిన్ హీరోగా కనిపించబోతున్నాడు. హాయ్ మూవీని తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి నయనతార స్వయంగా నిర్మించడం గమనార్హం. లోకేష్ కనగరాజ్ అసిస్టెంట్ విష్ణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. టాక్సిక్, హాయ్...ఈ రెండు సినిమాలు తెలుగులోకి డబ్ అవుతున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!
సెప్టెంబర్ 9, 2026

Toxic Movie | టాక్సిక్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఓటీటీ రైట్స్ విషయంలో దారుణంగా..!
సెప్టెంబర్ 7, 2026

Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార – డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
- ●New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి

New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు



