Biopic | త్రివిక్రమ్‌ను రూటులో వెంకీ అట్లూరి – సేమ్ బ్యానర్‌లో ఐదో సినిమా – నానితో బయోపిక్
ప్రస్తుతం హీరో సూర్యతో విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈ బైలింగ్వల్ మూవీ కంప్లీట్ కాకముందే నెక్స్ట్ సినిమా కోసం అతడు అడ్వాన్స్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. సితార బ్యానర్‌లో నాచురల్ స్టార్ నానితో ఓ బయోపిక్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది
Entertainment | Published On Feb 12, 2026, 2.26 pm IST
Biopic | గత కొన్నేళ్లుగా త్రివిక్రమ్ వరుసగా హారిక హాసిని బ్యానర్‌లోనే సినిమాలు చేస్తున్నారు. ఇతర బ్యానర్స్ నుంచి తివ్రిక్రమ్ అడ్వాన్స్‌లు తీసుకోవడం మానేశారు. ఒక రకంగా హారిక హాసిని త్రివిక్రమ్ హోమ్ బ్యానర్‌గా మారిపోయింది. విక్టరీ వెంకటేష్‌తో చేస్తోన్న తివిక్రమ్ నెక్స్ట్ మూవీ ఆదర్శ కుటుంబం హారిక హాసిని బ్యానర్‌లోనే తెరకెక్కుతోంది. ఆ తర్వాత చేయనున్న గాడ్ ఆఫ్ వార్ కూడా ఇదే నిర్మాణ సంస్థలో ఉండనుంది.
త్రివిక్రమ్ రూట్‌లోనే అడుగులు వేస్తున్నాడు మరో యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. హారిక హాసినికి అనుబంధ సంస్థ అయిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను వదిలిపెట్టడం లేదు. ఈ బ్యానర్‌లో ఫస్ట్ టైమ్ ఐదేళ్ల క్రితం రంగ్‌దే సినిమా చేశాడు వెంకీ అట్లూరి. ఆ తర్వాత అతడు దర్శకత్వం వహించిన సార్, లక్కీ భాస్కర్ సినిమాలను సితారలోనే రూపొందాయి.
విశ్వనాథన్ అండ్ సన్స్...
ప్రస్తుతం సితార నిర్మాణ సంస్థలోనే కోలీవుడ్ హీరో సూర్యతో విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమా చేస్తోన్నాడు వెంకీ అట్లూరి. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.
నాని మూవీకి అడ్వాన్స్...
సూర్యసినిమా కంప్లీట్ కాకముందే వెంకీ అట్లూరి నెక్స్ట్ మూవీ కోసం సితార బ్యానర్ నుండే అడ్వాన్స్ అందుకున్నాడట. నాచురల్ స్టార్ నాని హీరోగా వెంకీ అట్లూరి ఓ సినిమా ఫిక్సైనట్లు సమాచారం.
నాని కోసం ఓ బయోపిక్ కథను రెడీ చేస్తున్నాడట వెంకీ అట్లూరి. ఈ సినిమాకు 796 సీసీ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా సితార సంస్థలో వెంకీ అట్లూరి చేయనున్న ఐదో సినిమా ఇది.
విశ్వనాథన్ అండ్ సన్స్‌ను సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. సూర్య సినిమా రిలీజ్ తర్వాతే నాని , వెంకీ అట్లూరి మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టి డిసెంబర్‌లోగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారట.
ప్రస్తుతం నాని ప్యారడైజ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మార్చిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. షూటింగ్ డిలే వల్ల జూన్‌కు వాయిదాపడినట్లు టాక్ వినిపిస్తోంది ప్యారడైజ్ తర్వాత ఓజీ డైరెక్టర్ సుజీత్‌తో నాని ఓ మూవీ కమిటయ్యాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



