National Awards | తెలుగు వర్సెస్ మలయాళం – నేషనల్ అవార్డులపై ఫ్యాన్స్ వార్ – షాకిచ్చిన సీబీఎఫ్‌సీ
నేషనల్ అవార్డులపై సోషల్ మీడియాలో తెలుగు, తమిళం, మలయాళ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. మా హీరోకే అవార్డు వస్తుందంటూ ఆయా భాషల అభిమానులు చేస్తోన్నట్లు ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి. కాగా శుక్రవారం ప్రకటించిన నేషనల్ అవార్డుల అనౌన్స్‌మెంట్‌ను చివరి నిమిషంలో వాయిదా వేసింది.
Entertainment | Published On Jul 3, 2026, 7.35 pm IST
National Awards | నేషనల్ అవార్డుల విషయంలో తెలుగు, మలయాళం అభిమానుల మధ్య సోషల్ మీడియా లో వార్ నడుస్తోంది. మా హీరోనే అవార్డుకు అర్హుడు అని మలయాళ ఆడియెన్స్ ట్వీట్స్ చేస్తుండగా...మా హీరోకే అవార్డ్ వస్తుందంటూ తెలుగు ఆడియెన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. తెలుగు, మలయాళ ఫ్యాన్స్ చేస్తోన్న ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి. 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను సీబీఎఫ్‌సీ శుక్రవారం ప్రకటించబోతుందంటూ ప్రచారం జరిగింది. సాయంత్రం అవార్డులను అనౌన్స్‌చేస్తారంటూ వార్తలొచ్చాయి.
భ్రమయుగం...
ఈ సారి బెస్ట్ యాక్టర్‌గా భ్రమయుగం సినిమాకుగాను మమ్ముట్టికి అవార్డు వస్తుందంటూ మలయాళ ఫ్యాన్స్ ట్వీట్స్ చేయడం మొదలుపెట్టారు. బెస్ట్ మూవీగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడుజీవితం గోట్‌లైఫ్‌కు అవార్డు వచ్చే అవకాశం ఉందంటూ పోస్ట్‌లో పెడుతున్నారు. తెలుగు ఆడియెన్స్ మాత్రం పుష్ప 2 సినిమాకుగాను అల్లు అర్జున్‌కు బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డుకు అర్హుడు అని అంటున్నారు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ సీక్వెల్ కూడా అవార్డు రేసులో ఉందని అంటున్నారు. కల్కినే బెస్ట్ ఫిల్మ్‌గా నిలవవచ్చని ఫ్యాన్స్ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. తమిళ ఆడియెన్స్ కూడా తంగలాన్ సినిమాకుగాను విక్రమ్ బెస్ట్ యాక్టర్ అవార్డు రేసులో ఉన్నాడని చెబుతున్నారు. ఓ భాష పై మరో భాష అభిమానులు ....ఓ హీరోపై మరో హీరో అభిమానులు నెగెటివ్ కామెంట్లు, విమర్శలు చేస్తూ పెడుతోన్న ట్వీట్లు హాట్ టాపిక్‌గా మారాయి.
పోస్ట్‌పోన్...
నేషనల్ అవార్డుల ప్రకటనను చివరి నిమిషంలో సీబీఎఫ్‌సీ వాయిదా వేసింది. అవార్డులను నెక్స్ట్ వీక్ ప్రకటించబోతున్నట్లు వెల్లడించింది. త్వరలోనే అనౌన్స్‌మెంట్ డేట్‌ను రివీల్ చేస్తామని చెప్పింది.
రేసులో ఉన్న సినిమాలు ఇవే...
నేషనల్ అవార్డుల లిస్ట్‌లో తెలుగు నుంచి ప్రభాస్ కల్కితో పాటు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, ఎన్టీఆర్ దేవరతో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి. మలయాళంలో భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్, గోట్ లైఫ్, కిష్కిందకాండం, తమిళం నుంచి మహారాజా, అమరన్‌తో పాటు మెయ్యళగన్ నిలిచాయి. ఆర్టికల్ 370, శ్రీకాంత్, చందూ ఛాంపియన్ పలు బాలీవుడ్ సినిమాలు కూడా అవార్డుల కోసం పోటీపడబోతున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Malayalam OTT | ఓటీటీలోకి కాంట్రవర్సియల్ మలయాళం మూవీ – సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలే కథగా..
జూన్ 26, 2026

Padma Awards 2026 | నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పురస్కారాలు ప్రదానం చేయనున్న ప్రెసిడెంట్
జూన్ 23, 2026

Patriot Review | పేట్రియాట్ రివ్యూ – మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
జూన్ 6, 2026
తాజావార్తలు
- ●Telugu Serial | బిగ్‌బాస్ రన్నరప్ తెలుగు సీరియల్ - లాంఛ్ డేట్ ... ఛానల్ ఇదే - టైటిల్ ఏంటంటే?
- ●Thummala Nageswara Rao | రైతు భరోసా నిధుల విడుదలలో రేవంత్ ప్రభుత్వం రికార్డు : మంత్రి తుమ్మల
- ●Meera Nandan | జై బోలో తెలంగాణ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●RS Praveen Kumar | అడ్లూరి లక్షణ్ కథలు బంజెయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Bhatti Vikramarka | సింగరేణి కుంభకోణంపై భట్టి రెస్పాండవడం సంతోషమే.. కానీ ఏదేదో మాట్లాడిండు
- ●KTR | 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

Telugu Serial | బిగ్‌బాస్ రన్నరప్ తెలుగు సీరియల్ - లాంఛ్ డేట్ ... ఛానల్ ఇదే - టైటిల్ ఏంటంటే?

Thummala Nageswara Rao | రైతు భరోసా నిధుల విడుదలలో రేవంత్ ప్రభుత్వం రికార్డు : మంత్రి తుమ్మల

Meera Nandan | జై బోలో తెలంగాణ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

RS Praveen Kumar | అడ్లూరి లక్షణ్ కథలు బంజెయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్



