Rashmika Mandanna | అల్లు అర్జున్ సినిమాలో నేషనల్ క్రష్ – ఫస్ట్ టైమ్ విలన్‌గా…
పుష్ప , పుష్ప 2 బ్లాక్‌బస్టర్స్ తర్వాత అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రాబోతున్నట్లు సమాచారం. బన్నీ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీలో రష్మిక మందన్న ఓ హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో రష్మిక నెగెటివ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Entertainment | Published On Feb 5, 2026, 4.19 pm IST
Rashmika Mandanna | హీరోయిన్లు అంటే పాటలు, గ్లామర్‌కు పరిమితమనే ఫార్ములాను నేటితరం హీరోయిన్లు తిరగరాస్తున్నారు. కథ, పాత్రల పరంగా ప్రయోగాలు చేయడంలో తామేం హీరోలకు తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అవసరమైతే విలన్‌గా కూడా నటించడానికి రెడీ అంటున్నారు. రష్మిక మందన్న ఫస్ట్ టైమ్ నెగెటివ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పాన్ వరల్డ్ మూవీ...
అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతోంది. దాదాపు 1300 కోట్ల బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబాయిలో జరుగుతోంది. ప్యారలాల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్‌తో హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో బన్నీకి జోడీగా ఐదుగురు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ హీరోయిన్‌గా దీపికా పదుకొనేను ఫైనల్ చేశారు. మిగిలిన నలుగురు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
నేషనల్ క్రష్?..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా మరో నాయికగా సెలెక్ట్ అయినట్లు సమాచారం. ముంబాయిలో జరుగుతోన్న తాజా షెడ్యూల్‌తో అల్లు అర్జున్ మూవీ షూటింగ్‌లో రష్మిక మందన్న జాయిన్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ పాన్ వరల్డ్ మూవీలో రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్‌లా కాకుండా చాలా పవర్‌ఫుల్‌గా రష్మిక పాత్ర ఉంటుందట. కంప్లీట్ నెగెటివ్ షేడ్స్‌లో సర్‌ప్రైజింగ్‌గా ఆమె క్యారెక్టర్ సాగుతుందని అంటున్నారు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఈ మూవీలో రష్మిక విలన్ క్యారెక్టర్‌లో కనిపించనుందని అంటున్నారు. నటిగా రష్మిక మందన్నలోని కొత్త యాంగిల్‌ను ఈ సినిమాతో డైరెక్టర్ అట్లీ చూపించబోతున్నారని అంటున్నారు.
పెళ్లి కోసం గ్యాప్...
ముంబాయిలోని చిత్రకూట్ స్టూడియోలో జరుగుతోన్న ప్రజెంట్ షెడ్యూల్‌లో అల్లు అర్జున్, రష్మిక మందన్న, జాన్వీకపూర్‌తో పాటు జిమ్ సర్భాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ సాగనుందట. కానీ రష్మిక మందన్న మాత్రం ఫిబ్రవరి 15 వరకే షూటింగ్‌లో పాల్గొననున్నట్లు చెబుతోన్నారు. పెళ్లి కోసం సినిమాలకు స్మాల్ బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి జరుగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి జరుగనున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ ఇది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన పుష్ప పుష్ప 2 సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 22వ మూవీ ఇది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



