Nargis Fakhri | ఐటెం సాంగ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతోన్న నేను రెడీ మూవీలో స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుంది. నర్గీస్ ఫక్రీ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Entertainment | Published On May 16, 2026, 4.50 pm IST
Nargis Fakhri | బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఫ్యాన్స్‌కు ఊర మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. హవీష్ హీరోగా నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నేను రెడీ పేరుతో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా జూన్ సెకండ్ వీక్‌లో థియేటర్లలోకి రాబోతుంది.
పోస్టర్ రిలీజ్...
నేను రెడీ మూవీ నుంచి స్పెషల్ అప్‌డేట్‌ను మేకర్స్ శనివారం రివీల్ చేశారు. బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్‌లో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ బోల్డ్ బ్యూటీ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సిల్వర్ కలర్ డ్రెస్ ధరించి రొమాంటిక్ డ్యాన్స్ ఫోజుతో నర్గీస్ హాట్ లుక్‌లో కనిపిస్తోంది. పోస్టర్ బ్యాక్‌డ్రాప్, విజువల్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయి.
షూటింగ్ కంప్లీట్....
ఫన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న నేను రెడీ షూటింగ్‌తో పాటు రీ రికార్డింగ్ పనులు కంప్లీట్ అయ్యాయి. భిన్న ఆచారాలు, సంప్రదాయాలు కలిగిన ఓ రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో కలిసి ఎందుకు జీవించాల్సి వచ్చింది? ఈ క్రమంలో వారికి ఎదురయ్యే కష్టాలతో నేను రెడీ నవ్విస్తూనే ఉద్వేగానికి లోను చేస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. నేను రెడీలో బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెలకిషోర్, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నెక్స్ట్ వీక్‌లో ఆడియోను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.
బాలకృష్ణ మూవీలోనూ...
కాగా నేను రెడీతో పాటు తెలుగులో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీలోనూ నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రణభీర్ కపూర్ రాక్‌స్టార్‌తో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నర్గీస్ ఫక్రీ మద్రాస్ కేఫ్, మై తేరా హీరో, బంజో, అమవాస్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. ఫటా పోస్టర్ నిఖ్లా హీరో, కిక్, డిష్యూం సినిమాల్లో ఐటెంసాంగ్స్‌లో మెరిసింది.
సంబంధిత వార్తలు

Bigg Boss Ayesha | హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ – సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్
మే 18, 2026

Tamannaah Bhatia | తమన్నా రిస్క్ చేస్తోందా..? స్పెషల్ సాంగ్ కోసం కెరీర్‌నే పణంగా పెడుతోందా..?
మే 6, 2026

Tollywood | అప్పుడు తల్లి…ఇప్పుడు కూతురు – ఎం.ఎస్ రాజు మూవీతో టాలీవుడ్‌లోకి మరో వారసురాలు ఎంట్రీ
ఏప్రిల్ 30, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



