త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sudhakar Son | హీరోగా మారిన‌ క‌మెడియ‌న్ సుధాక‌ర్ కొడుకు – ఒకే రోజు రెండు సినిమాల‌తో బాక్సాఫీస్ బ‌రిలో…

టాలీవుడ్ సీనియ‌ర్ క‌మెడియ‌న్ సుధాక‌ర్ త‌న‌యుడు బెన్నీ హీరోగా మారాడు. అత‌డు క‌థానాయ‌కుడిగా న‌టించిన రెండు తెలుగు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. న‌వంబ‌ర్ 27న ఆలోచ‌న , హై సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాల్లో బెన్నీ సుధాక‌ర్ హీరోగా న‌టించాడు.

N

Entertainment | Published On Nov 22, 2026, 6.52 pm IST

Sudhakar Son | హీరోగా మారిన‌ క‌మెడియ‌న్ సుధాక‌ర్ కొడుకు – ఒకే రోజు రెండు సినిమాల‌తో బాక్సాఫీస్ బ‌రిలో…
Advertisement

Sudhakar Son |2000 ద‌శ‌కంలో టాలీవుడ్‌లో టాప్ క‌మెడియ‌న్‌గా కొన‌సాగారు సుధాక‌ర్‌. చిరంజీవి, వెంక‌టేష్‌, బాల‌కృష్ణ‌, నాగార్జున‌తో పాటు స్టార్ హీరోలంద‌రితో సినిమాలు చేశారు. వెరైటీ డైలాగ్ డెలివ‌రీ, మాడ్యులేష‌న్‌తో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. అనారోగ్య స‌మ‌స్య‌లతో చాలా కాలంగా యాక్టింగ్‌కు దూరంగా ఉంటున్నారు సుధాక‌ర్‌.

ఒకే రోజు....

తాజాగా తండ్రి బాట‌లోనే సుధాక‌ర్ త‌న‌యుడు అడుగులు వేశారు. న‌టుడిగా మారాడు. సుధాక‌ర్ త‌న‌యుడు బెన్నీ సుధాక‌ర్ విభిన్నంగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నాడు. అత‌డు హీరోగా న‌టించిన రెండు తెలుగు సినిమాలు ఒకే రోజు థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి.

హై వ‌ర్సెస్ ఆలోచ‌న‌...

న‌వంబ‌ర్ 27న ఆలోచ‌న‌, హై సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో రూపొందిన ఈ రెండు సినిమాల్లో బెన్నీ సుధాక‌ర్ హీరోగా క‌నిపించ‌బోతున్నాడు.
ఆలోచ‌న ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కుతోండ‌గా...హై మూవీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోంది. ఈ రెండు సినిమాల ప్ర‌మోష‌న్స్‌లో బెన్నీ సుధాక‌ర్ పాల్గొంటున్నాడు. అచ్చం సుధాక‌ర్ పొలిక‌ల‌తోనే బెన్నీ క‌నిపిస్తున్నాడు. అత‌డి మాట తీరు, కామెడీ టైమింగ్ కూడా తండ్రి మాదిరిగానే ఉన్నాయంటూ ఫ్యాన్ కామెంట్లు పెడుతున్నారు.

మెసేజ్ ఓరియెంటెడ్‌....

ఆలోచ‌న సినిమాకు సురేంద‌ర్ చాచా ద‌ర్వ‌క‌త్వం వ‌హించాడు. ఉద్యోగాల పేరుతో పిల్ల‌లు న‌గ‌రాల‌కు, విదేశాల‌కు వ‌ల‌స వెల్ల‌డంతో ఒంట‌రిగా మిగిలిపోయి త‌ల్లిదండ్రులు ప‌డే సంఘ‌ర్ష‌ణ‌తో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా ఆలోచ‌న రూపొందింది

అనిల్ రావిపూడి కో రైట‌ర్‌....

హై సినిమాలో బెన్నీ సుధాక‌ర్ ఓ హీరోగా క‌నిపించాడు. అనిల్ రావిపూడి వ‌ద్ద ప‌లు సినిమాల‌కు కో రైట‌ర్‌గా ప‌నిచేసి సాయి కృష్ణ హీరోగా న‌టిస్తూ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అన‌న్య శ‌ర్మ‌, ప‌ల్ల‌వి దొర‌, బుల్లిరాజు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. భిన్న నేప‌థ్యాలు క‌లిగిన కొంద‌రు యువ‌తీయువ‌కుల జీవితంతో హై మూవీ తెర‌కెక్కుతోంది.

 

Advertisement
Advertisement